tag:blogger.com,1999:blog-2631245017925390963.post79827486030691038..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: మీకు తెలుసా! ఒక మహా రచయిత శతజయంతి ఈరోజునSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-81238419895259696582009-11-01T06:48:56.816+05:302009-11-01T06:48:56.816+05:30శివ గారూ,
విరసం వాళ్ళు వేస్తున్న సంపుటాలకు నేను డబ...శివ గారూ,
విరసం వాళ్ళు వేస్తున్న సంపుటాలకు నేను డబ్బు కట్టేశాను. ఇప్పటి వరకు నాలుగు సంపుటాలు పంపారు కూడానూ! కొడవటిగంటి రచనా ప్రపంచం పేరుతో! దీని గురించి వేణువు బ్లాగర్ వేణు గారు తన బ్లాగులో మార్చిలోనే ఒక టపా రాశారు. ఇదిగో లింకు!
http://venuvu.blogspot.com/2009/03/blog-post_16.html

ఇది చూసే నేను వారి నుంచి పుస్తకాలు తెప్పించుకుంటున్నాను. హైదరాబాదులోని వీక్షణం ఆఫీసుని కూడా సంప్రదించవచ్చు వీటి కొరకు. నాకు అక్కడినుంచే వస్తాయి.

వారి చిరునామా కంటే ఈ మెయిల్ మీకు ఉపకరిస్తుంది.

veekshanam2003@gmail.com
reachcdrc@yahoo.com

కొత్త పుస్తకాల్లో అనవసరమైన ఫుట్ నోట్సూ అవీ లేకుండా హాయిగా కూడా ఉన్నాయి.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-16039868729719662002009-10-31T21:05:25.610+05:302009-10-31T21:05:25.610+05:30సుజాతగారూ,
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. అతడు అడవిన...సుజాతగారూ,

మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. అతడు అడవిని జయించాడు రచయిత పేరు తప్పువ్రాశాను, సరిచేసినందుకు కృతజ్ఞతలు.

నేను కుటుంబరావుగారిగురించి అతి కొద్ది, నాకు నచ్చిన సీతప్ప పాత్ర, చందమామ సంపాదకీయం మాత్రమే కవర్ చేశాను. కుటుంబరావుగారి సమగ్ర సాహిత్యంలో నేను వ్రాసింది అతి తక్కువ. మీరు, ఆయన వ్రాసిన దిబ్బ కథల గురించి వ్రాస్తే బాగుంటుంది. నాకు ముంబాయినుంచి బెంగుళూరికి బదిలీ అయ్యి ఆరు నెలలక్రితమే రావటం, ఇంకా నా పుస్తకాల పాకింగు తియ్యకపోవటం వల్ల దొరికిన ఒక్క సంపుటి చూసి ఎక్కువగా చదివిన గుర్తుతో వ్రాశాను.

కుటుంబరావుగారి కథలు, నవలల్లోంచి అనేక పేర్లు చెప్పి మళ్ళీ అవి చదివిన అనుభూతి కలిగించారు.దయచేసి మీరుకూడ వ్రాస్తే చాలా బాగుంటుంది, సాహిత్యం మీద అభిమానం ఉన్న బ్లాగర్లందరూ తలా ఒక వ్యాసం వ్రాస్తే ఆయన శత జయంతి ఉత్సవాలకు (బయట ఎవరన్నా చేసినా చెయ్యకపోయినా) మనం మొదలు పెట్టిన మంచి ప్రారంభం కాగలదని నా ఉద్దేశ్యం.

తరువాత విరసం వారు కుటుంబరావుగారి సాహిత్యం సంపుటాలుగా వేస్తూ ఇప్పటేకే 14 సంపుటిలు వేశారని విన్నాను. మీకు తెలిస్తే, దయచేసి ఆ సంపుటాలను తెప్పించుకోవటానికి ఏ చిరునామాకి వ్రాయాలి (ఇ మైలు ఉంటే ఇంకామంచిది), డబ్బులు ఎంత ఎలా పంపాలి వివరాలు నాకు తెలియచేయగలరు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-14549237329713166392009-10-31T17:44:49.287+05:302009-10-31T17:44:49.287+05:30శివ ప్రసాద్ గారూ,
మాండలికాలంటే గుంటూరు యాస గురించే...శివ ప్రసాద్ గారూ,
మాండలికాలంటే గుంటూరు యాస గురించే నేను ప్రస్తావించింది. బహుశా అక్కడ పుట్టి పెరగడం వల్ల కాబోలు తరచూ ఆయన రచనల్లో దొర్లే మధ్య తరగతి (బ్రాహ్మణ) కుటుంబాల్లో వినపడే మాటలు నాకు చాలా దగ్గరగా, ఆత్మీయంగా అనిపిస్తాయి. సవతి తల్లి నవలిక లో వెంకమ్మ మాటలు, కొత్త కోడలు నవల్లో హనుమాయమ్మ గారు మాట్లాడే మాటలు,అలాగే తిమింగలం వేటలో నాగభూషణం భార్య సుభద్ర మాటలు ఇవన్నీ నా చుట్టూ బోలెడు మంది మాట్లాడగా విన్నాననిపిస్తుంది.చిరపరిచితాలుగా అనిపిస్తాయి."శ్రీకృష్ణ ప్రరబ్రహ్మణే నమః" లో భైరవ శాస్త్రుల్ని, "మగవాడి దౌర్జన్యం" లో శ్రీరాముల్ని, "మారు పేర్లు" లో సుబ్రహ్మణ్యాన్ని,చదువు లో సుందరాన్ని నేనెరుగుదుననిపిస్తుంది. ఎనని చెప్పను? ప్రతి పాత్రా నా చుట్టూ ఉన్న మనుషుల్లో నేను చూశాననే అనిపిస్తుంది.

సరితాదేవి డైరీ లో సరితా దేవి ఆలోచనలు మాటలు ఇవన్నే ఎక్కడో చూశాననో, విన్నాననో అనిపిస్తూ ఉంటాయి. ఏవేవో జ్ఞాపకాలు రేపుతాయి.అలాగే కథల్లోని పాత్రలు కూడా నా చుట్టూ ఒకప్పుడు ఉన్న సజీవ పాత్రలనే అనిపిస్తుంది నాకు.

అంతగా ఆయన రచనల్ని ఐడెంటిఫై చేసుకుంటాను నేను. ఆయన రచనల్లో కనపడే పదునైన హాస్యం కూడా కట్టిపడేస్తుంది.

మీరు ఇంత సమగ్రంగా రాశాక ఇంకా నా బ్లాగులో కుటుంబరావు గారి రచనా వైభవం గురించి మళ్ళీ నేను రాయగలనంటారా?

ఏదో ఒక చిన్న నవలను నా దృష్టి నుంచి పరిచయం చేసే దిశగా ఆలోచిస్తాను.

అన్నట్లు అతడు అడవిని జయించాడు నవల కేశవ రెడ్డిగారిది కదా!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-31133146204874396312009-10-30T23:04:56.370+05:302009-10-30T23:04:56.370+05:30రోహిణీ ప్రసాద్ గారూ. మీరు మీ అమూల్యమైన అభిప్రాయం న...రోహిణీ ప్రసాద్ గారూ. మీరు మీ అమూల్యమైన అభిప్రాయం నా బ్లాగుకు వచ్చి ఇచ్చినందుకు ధన్యవాదములు. మీ వ్యాఖ్య ను వ్యాసంలో భాగంగా ఉంచాను.

భావన గారూ మీరు వ్రాసిన వ్యాఖ్యకు ధన్యవాదములు. మీ దగ్గర కుటుంబరావుగారి పుస్తకాలన్నీ ఉన్నాయి కదా. దయచేసి, మీరుకూడ ఒక వ్యాసం మీ బ్లాగులో వ్రాయగలరు.

వేణూ గారూ. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. సీతప్ప పాత్ర గురించి తెలిసిన మరొకరు దొరికారు మీరు. ఆనందం. కుటుంబరావుగారి సాహిత్య కృషికి నిజమైన నివాళి, మనం సీతప్పలం కాకుండ ఉండటమే.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-54171523212159159422009-10-30T22:51:14.698+05:302009-10-30T22:51:14.698+05:30బాగుంది అండి మీ సమగ్ర పరిశీలన , నా దగ్గర అన్ని పుస...బాగుంది అండి మీ సమగ్ర పరిశీలన , నా దగ్గర అన్ని పుస్తకాలు వున్నాయి మీరు చెప్పినవి అన్ని చదివేను కాని మీరు చాలా బాగ వివరణ ఇచ్చారు. వూరికే గొప్ప హంగులకు ఆర్భాటాలకు పోకుండా ఏదో మాములు గా మా చిన్నప్పుడూ మా ఇంట్లోనో మా పక్క ఇంట్లోనో జరిగిన కధ లా వుంటాయి చదువుతుంటే. మళ్ళీ అంతలోనె ఆ కధ ల నుంచి ఆ కాలపు సామాజిక నైతిక, ఆర్ధిక ఆహార్యాలన్నిటిని అర్ధం చేస్తారు. మంచి రచయత వారి గురించి మీ నుంచి ఒక మంచి విశ్లేషణ.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-65117624661841685692009-10-29T19:13:14.053+05:302009-10-29T19:13:14.053+05:30శివ గారూ !
కొడవతిగంటి వారి రచనల గురించి చాలా వివరం...శివ గారూ !
కొడవతిగంటి వారి రచనల గురించి చాలా వివరంగా రాసినందుకు కృతజ్ఞతలు. వెంటనే చదివినా కొన్ని పని ఒత్తిడుల వలన ఆలస్యంగా స్పందిస్తున్నాను. ఇలాగే ఇంకా ఎన్నో మీ నుంచి రావాలని అశిస్తూ....SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-62328214214681795552009-10-29T03:40:23.521+05:302009-10-29T03:40:23.521+05:30మీ సమగ్రంగా రాశారు. మా నాన్న వీలున్నంతవరకూ ఇరవయ్యో...మీ సమగ్రంగా రాశారు. మా నాన్న వీలున్నంతవరకూ ఇరవయ్యో శతాబ్దపు మనిషిలా జీవించడానికి ప్రయత్నించారు. ఈ రోజుల్లో కూడా నాకు మానసికంగా పద్ధెనిమిదో, పంతొమ్మిదో శతాబ్దంలో బతుకుతున్నవాళ్ళు తగులుతూ ఉంటారు. ఆధునికత అంటే లేటెస్ట్ రిస్ట్ వాచీలూ, సెల్ఫోన్లూ, టీవీలూ ఉపయోగించడమే కాదని చాలామందికి తెలిసినట్టులేదు. ఈ వెనకబాటుతనం చూస్తే అయిదు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూవస్తున్న ప్రగతివాదశక్తులన్నీ విఫలం అయాయనిపిస్తుంది. ఆలోచనలోనూ, భాషలోనూ కూడా స్పష్టత సాధించడం మానాన్న రచనల్లోని ఒక ముఖ్యలక్షణం అనిపిస్తుంది.Rohiniprasad Kodavatigantihttps://www.blogger.com/profile/15269729071886333073noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-17139691478325467722009-10-28T22:42:28.888+05:302009-10-28T22:42:28.888+05:30రాజుగారూ, ఇప్పటివరకు మీరు నా బ్లాగులో వ్రాసిన అతిప...రాజుగారూ, ఇప్పటివరకు మీరు నా బ్లాగులో వ్రాసిన అతిపెద్ద వ్యాఖ్య ఇదే అనుకుంటాను. చాలా టైము వెచ్చించినట్టున్నారు. మొదట, ఏ పత్రికైనా ఒక నిబధ్ధతో నడిపితేనే నిలబడుతుంది, ఎక్కువకాలం మన్నుతుంది. చందమామే దానికి ఉదాహరణ. యజమానులలో సిన్సియారిటీ ఉన్నన్నాళ్ళూ చందమామ నిలబడింది. మహానుభావుడు చక్రపాణిగారు కన్నుమూయటం, చందమామపతనం ఆరంభం ఒకేసారి జరిగినాయి. ఆ తరువాత చిత్రా మరణం, మరో రెండు సంవత్సరాలలో మహా రచయిత, చందమామకు అనామిక సంపాదకుడు (28 సంవత్సరాలు ఏకబిగిన) కొడవటిగంటి కుటుంబరావుగారి ఆకస్మిక మరణం చందమామను కుంగతీశాయి. ఆ పధ్ధతిలో చక్కటి సంపాదకీయ లక్షణం ఉన్న మరొకరు దొరకక పోవటం మనందరి దురదృష్టం. 1996 వరకు సర్కులేషన్ పడకపోవటానికి కారణం, అలవాటుగా చందమామను కొంటున్నవారు ఉన్నందున. అలాంటివారు వయస్సు పైబడటం వంటి కారణాలవల్ల, ముఖ్యంగా వారు కూడ ఇది మన పాత చందమామ కాదన్న విషయం గమనించుకోవటం వల్ల ఆ తరువాత సర్కులేషన్ పడిపోయిందని నా అనుమానం.

కొడవటిగంటివారి చేతిలో పడి అన్ని కథలూ ఆణి ముత్యాలయ్యాయి. అప్పటి చందమామ రచయితలు ఒకరిద్దరు తప్ప (పాలంకి వారు మొ||లగు వారు) మిగిలినవారందరూ సరదాగా ఒక కథ వ్రాసి పంపినవారే. వ్యాసంలో నా పాయింటు కూడ అదే, అతి సామాన్యమైన కథను తన సంపాదకీయ నైపుణ్యంతో ఒక చక్కటి కథగా మలచటం వల్ల, ఆ కథలు మళ్ళీ మళ్ళీ ప్రచురించబడినాయి. చందమామ పూర్వపు ప్రాభవం కోసం కొంత ఆరాటపడ్తోంది అనిపించటానికి కారణం ఆ కథలను పునర్ముద్రించటమే, మీరు చెప్పిన కారణం మాత్రమే అయితే మటుకు, నా దృష్టిలో చాలా అన్యాయం.

ఒక్క కోరిక రాజుగారూ, ఆన్ లైను చందమామలో మనకు తెలిసిన చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పని చేసిన కుటుంబరావుగారి మీద వ్యాసం (ఆయన శతాబ్ది సందర్భంగా) వ్రాయటం ఎంతైనా సముచితంగా ఉంటుంది. దయచేసి వ్రాయగలరు. మీ చేతిలో ఒక చక్కటి వ్యాసం తయారవుతుంది. నా కోరికను మన్నించండి.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-87369254171755397792009-10-28T22:15:56.552+05:302009-10-28T22:15:56.552+05:30వెంకట రమణగారూ, తృష్ణగారూ మీ వ్యాఖ్యలకు థాంక్స్. ...వెంకట రమణగారూ, తృష్ణగారూ మీ వ్యాఖ్యలకు థాంక్స్. తృష్ణగారూ, ట్రెజర్ ఐలాండ్ నా దగ్గర ఒరిజినల్ లైబ్రరీ ఎడిషన్ ఉన్నది, తెలుగు అనువాదం కాంచన ద్వీపం కూడ ఉన్నది (ఒక 30 సంవత్సరాల క్రితం కొన్నది). అయినా మీరు చెప్పిన వెబ్ సైటు చూస్తాను. ఈ వెబ్ గురించి నాకు చెప్పినందుకు, ప్రత్యేక ధన్యవాదములు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-13150187047702282442009-10-28T22:11:57.424+05:302009-10-28T22:11:57.424+05:30సుజాతగారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. కుటుంబరావుగార...సుజాతగారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. కుటుంబరావుగారి కథలు ఇష్టపడని వారెవరు ఉంటారు! వారి శతజయంతి సందర్భంగా, మీ బ్లాగులో కూడ కుటుంబరావుగారి గురించి ఒక వ్యాసం వ్రాస్తే బాగుంటుంది. ఆ తరువాత మాండలీకాలు అన్నారు. కుటుంబరావుగారు మాండలీకాలలో వ్రాయటం..........నా కంట పడలేదండి. మరి వ్రాశారేమో. నాకు తెలిసినంతవరకు కోకు వ్రాసిన భాష యావత్తూ కృష్ణా-గుంటూరు జిల్లాలలోని ప్రజలు మాట్లాడుకునేదే. గోదావరి యాస కూడ ఆయన రచనలో నాకెక్కడా కనపడలేదు. మాండలీకాలలో వ్రాయటం అనేది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది, కేతు విశ్వనాథ రెడ్డిగారు "అతడు అడవిని జయీంచాడు" నవలను ప్రచురించిన తర్వాతే (ఆంధ్ర జ్యోతిలో) అనుకుంటాను.

మీ బ్లాగులో కూడ ఈ మహా రచయిత గురించిన వ్యాసం కోసం ఎదురు చూస్తూ.....Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-72020023071930795462009-10-28T20:41:29.152+05:302009-10-28T20:41:29.152+05:30Shri M V L Prasad garu has responded as follows by...Shri M V L Prasad garu has responded as follows by e mail after reading the article on Shri Kodavatiganti.

---------- Forwarded message ----------
From: Prasad MVL mvlprasad@gmail.com
Date: 2009/10/28
Subject: Re: MAIL FROM SIVARAMAPRASAD KAPPAGANTU
To: SIVARAMAPRASAD KAPPAGANTU vu3ktb@gmail.com

శ్రీ శివరామ ప్రసాదు గారు:
కృతఙ్ఞతలు!
ఇప్పుడే చదివాను...చాల కూలంకషం గా రాసారు. పాత రోజుల కథన్లని గుర్తు తెప్పించారు!
నా పేరు రాయ వలసిన అవసరము లేదు కాని మీ అభిమానము చాలు...

-ప్రసాదుSaahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-23966278955182707392009-10-28T11:27:55.989+05:302009-10-28T11:27:55.989+05:30శివ గారూ, కొ.కు. గురించి మంచి విశేషాలు చాలా వివరంగ...శివ గారూ, కొ.కు. గురించి మంచి విశేషాలు చాలా వివరంగా రాశారు.

తెలుగు సాహితీ దిగ్గజం కొ.కు. రచనలను వి.ర.సం. వారు వరుసగా సంపుటాలు వేస్తున్నారు. ‘కొడవటిగంటి కుటుంబరావు రచనా ప్రపంచం’ పేరుతో ఇప్పటికి నాలుగు పుస్తకాలు వెలువడ్డాయి.

కొ.కు. సృష్టించిన ‘సీతప్ప’ పాత్ర గురించి మీరు రాసింది చాలా బావుంది. టిపికల్ కారెక్టర్ సీతప్పకు కొ.కు. ఉపయోగించిన భాష చాలా విలక్షణమైనది. దీని ప్రభావం నన్ను కొద్దికాలం వెంటాడి వేధించింది! ‘బెదిరిన మనుషులు’ లాంటి గొప్ప కథలను ఎన్నిటినో కొ.కు.రాశారు.

మంచి టపా రాసినందుకు అభినందనలు!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-54384985852423527592009-10-28T11:08:15.030+05:302009-10-28T11:08:15.030+05:30"ఇవ్వాల్టికి పాఠక ఆదరణ కోసం వెంపర్లాడుతూ ఆ పత..."ఇవ్వాల్టికి పాఠక ఆదరణ కోసం వెంపర్లాడుతూ ఆ పత్రిక దశాబ్దాలనాటి కథలనే మళ్ళీ మళ్ళీ పునర్ముద్రణ చేస్తోంది అంటే ఆ కథల గొప్పతనం అర్ధం చేసుకోవచ్చును"

చిన్న సవరణ. పాఠకాదరణకోసం వెంపర్లాడటం మాటేమిటో గాని, లాభాలు తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకుందామనే అప్పటి యాజమాన్యం ఆలోచనలే చందమామ కథల, ధారావాహికల పునర్ముద్రణకు బలమైన కారణంగా చెప్పాలి. చందమామ పాలసీలో జరిగిన మార్పుగానే దీన్ని గుర్తించాలి.

1980ల నుంచే చందమామ లైబ్రరీకి పుస్తకాలు సేకరణకోసం బడ్జెట్ కేటాయింపును నిలిపివేశారు. అప్పటినుంచే పాత కథలు, సీరియళ్లను వేయడం ప్రారంభమయింది. చిత్రాగారు, కుటుంబరావు గారు ఆకస్మికంగా పోవడం, బయటకు చెప్పలేని కారణంచేత దాసరి సుబ్రహ్మణ్యం గారు ఉన్నట్లుండి ధారావాహికలు రాయడం ఆపివేయడం.. అరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్ అనే చందంగా, చందమామ పతనం పేరిట మీవంటివారు చెబుతున్న దానికి, పాతకథలే ఎక్కువగా రీప్రింట్ చేయడానికి పలు కారణాలు ఇలా తోడవుతున్నాయి.

1980ల తర్వాతే చందమామ అన్నిభాషల్లోనూ సర్క్యులేషన్ బాగా పెరగడం గమనించాలి. 1980 తర్వాతే ఒరియా చందమామ రెండు లక్షల సర్క్యులేషన్ దాటడం, తెలుగు, హిందీ ఒక్కొక్కటి లక్ష కాపీలు దాటడం, పలు భాషల్లోకి చందమామ విస్తరించడం జరగడం యాదృచ్ఛికం కాదు. చందమామ దార్శనికతకు మార్గ దర్శకత్వం వహించిన ఘనాపాఠీలు - చక్రపాణి, చిత్రా, కుటుంబరావుల అస్తమయం- దాసరి సుబ్రహ్మణ్యం గారి అస్త్రసన్యాసం (ధారావాహికలకు సంబంధించి) చందమామపై బలంగానే పడిందనడంలో సందేహం లేదు కానీ 1996వరకు కూడా చందమామ సర్క్యులేషన్ పెద్దగా పడిపోయింది లేదు.

చందమామకు అనుకోకుండా కలిగిన అజ్ఞాతవాసం -దీనికి ఎన్నో కారణాలు. లేబర్ సమస్య మాత్రం కాదు- పత్రిక భవిష్యత్తుపై బలంగా దెబ్బతీసింది. 1996లోనే ఒరిస్సాను ముంచేసిన భారీ తుపాను ప్రభావం ఒరియా చందమామను కోలుకోలేనంత దెబ్బ తీసింది. లక్షలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయి, కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఆ రాష్ట్రంలో కుప్పగూలిపోయన స్థితి చందమామకు ఉత్పాతంలా తగిలింది. ఇలాంటి ఎన్నో కారణాలు చందమామ భవితవ్యాన్ని నిర్దేశించాయి.

అన్నిటికంటే మించి కుటుంబరావు, చిత్రా గార్ల అస్తమయం చందమామ క్వాలిటీని రెండురకాలుగా దెబ్బతీసింది. దానికి దాసరి గారి అస్త్రసన్యాసం అగ్నికి ఆజ్యం పోసిన చందంలా అయిందనుకోండి.

ఈ వ్యాఖ్య మీ వ్యాసం పరిధిని దాటి ఎక్కడికో పోయినట్లుంది. ఇంతటితో ఆపివేస్తాను.

సకాలంలో, కుటుంబరావు గారి గురించి ఇంత పెద్ద జ్ఞాపకం, పరిచయం చేశారు. అభినందనలు. మళ్లీ వస్తాను..kanthisenahttps://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-86632449465977567982009-10-28T11:04:37.551+05:302009-10-28T11:04:37.551+05:30మంచి రచయితను గుర్తు చేసారు.బాగా రాసారు. అభినందనలు....మంచి రచయితను గుర్తు చేసారు.బాగా రాసారు. అభినందనలు. హిందీ ప్రవీణ చేసినప్పుడు కొడవటిగంటి కుటుంబరావు గారి కధలు ఉండేవి మాకు.

మీ ఇష్టమైన పుస్తకాల లిస్ట్ లో Treasure Island ఉంది... మొన్ననే ఆ పుస్తక పరిచయం books and galfriends లో ప్రచురితమైంది.వీలుంటే చూడండి.

http://booksandgalfriends.blogspot.com/2009/10/blog-post_26.htmlతృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-86120643494945567532009-10-28T10:58:43.722+05:302009-10-28T10:58:43.722+05:30ఆయనవి కొన్ని కధలు, సాహిత్య వ్యాసాలు కొన్ని చదివాను...ఆయనవి కొన్ని కధలు, సాహిత్య వ్యాసాలు కొన్ని చదివాను. చదవాల్సినవి చాలా ఉన్నాయి.

మంచి వ్యాసం వ్రాశారు. అభినందనలు.రమణhttps://www.blogger.com/profile/02392154414177135776noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-91567228031780804002009-10-28T09:32:20.436+05:302009-10-28T09:32:20.436+05:30ఎంత బాగా రాశారండీ! సమగ్రంగా ఉంది మీ టపా!
కుటుంబర...ఎంత బాగా రాశారండీ! సమగ్రంగా ఉంది మీ టపా!

కుటుంబరావు గారి మీద నా అభిమానం పూజించే స్థాయిలో ఉంటుంది. ఆ భావ ప్రకటన, ఆ మాండలీకాలు, అలవోగ్గా చేసి పారేసే వ్యక్తిత్వ విశ్లేషణ, ఇవన్నీ ఇంకెవరికీ,ఇంకెవరికీ సాధ్యం కావు. విరసం వాళ్ళ పుణ్యమా అని ఇదివరలో విశాలాంధర్లో అందుబాటులో లేని ఆయాన రచనలన్నీ ఇప్పుడు మళ్ళీ మొత్తం 14 సంపుటాల్లో అందుబాటులోకి వస్తుండటం సంతోషించదగ్గ వార్త. నాలుగు సంపుటాలు వచ్చేశాయి కూడాను!

మీరు కోట్ చేసిన వాక్యాలన్నీ చిరపరిచితాలే! చదువుతుంటేనే మనసు పులకరిస్తోంది.

ఈ శతాబ్దపు అద్భుత రచయిత!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com