tag:blogger.com,1999:blog-2631245017925390963.post8148479353591705050..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: చలం గారి సమాధి - వివాదంSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-27616946848280284642011-12-20T23:59:06.732+05:302011-12-20T23:59:06.732+05:30కప్పు గంతు గారికి — మీరు వ్రాసిన చలం విషయం నిజమే ...కప్పు గంతు గారికి — మీరు వ్రాసిన చలం విషయం నిజమే నని అనుకొంటున్నాను .నేను చలం గారిని అరుణాచలంలో చూశాను ,.అప్పటికే ఆరోగ్యం క్షీణించింది .మధ్యాహ్నం పన్నెండు తర్వాత చూసిన జ్ఞాపకం .భోజనం చేసి మంచం మీద పడు కోని వున్నారు .భార్య కూడా చెంతనే వున్నారు .ఇస్మాయిల్ ,చలం గారి ఇంకో అమ్మాయి పక పక వున్నట్లు గుర్తు .సౌరీస్ గారు మాత్రం శ్వేత వస్త్రాలతో ప్రక్క గదిలో ధ్యానం లో వున్నారు .చలం గారు కళ్ళు తెరిచే దాకా ఉండి గళ్ళ లుంగీ ,నేత అర చేతుల బనీను తో వున్నారు చలం .గడ్డం పెరిగి ఉంది.చూపుల్లో వెలుగు కన్పించిం ది అన్నేళ్ల సాధన ఫలితా మేమో ? . ,పాదాలకు నమస్కారం చేశాను . బెజవాడ దగ్గర ఉయ్యూరు నుంచి వచ్చానని చెప్పాను .రమణ మహర్షి ఆశ్రమం సందర్శించి వచ్చాను అని చెప్పాను .మాట్లాడే స్థితి లో కూడా లేనట్లు కన్పించింది .కాళ్ళు ,పాదాలు బాగా ఉబ్బి వున్నాయి .నీరు పట్టిందను కొంటాను .ఖచ్చితం గా ఏ సంవత్సరం లో చూశానో జ్ఞాపకం లేదు .శ్రీ శ్రీ ఆయన్నురేడియో కోసం ఇంటర్వ్యూ చేసిన సుమారు రెండేళ్లకు అని జ్ఞాపకం. అదొక అనుభూతి గా ఫీల్ అయాను .ఒక మహా రచయిత ను దర్శించాననే మహదానందం పొందాను .దాని తో పాటు కాలేజీ రోజుల్లో ,సౌరిస్ గారి పుస్తకాలు చదివి ,ప్రభావితం అయానని చెప్ప లేను కాని ,చదివి ఆనందించాను అని చెప్ప గలను .ఆమె ను గురించి విన్న ,చదివిన కధలు ,గాధలు కూడా జనాపాకమే .ఆమెను కూడా చూసినందుకు సంబర పడ్డాను .ఒక తరాన్ని ప్రభావితం చేసిన మహా రచయితలు చలం ,సౌరీస్ లు .చలం మ్యూజింగ్స్ అంటే ఎప్పుడూ నాకు విపరీత మైన క్రేజ్ .అరుణా చలం చాలా సార్లు వెళ్ళినా ,చలం అక్కడే వున్నారని తెలిసినా చూడటం అప్పుడే .అదే మొదటి సారి చివరి సారి .ఇదే చలం సందర్శన కధ .మళ్ళీ ఇన్నేళ్ళకు మీరు పంపిన లేఖ ద్వారా జ్ఞాపకం వచ్చాయి .ఆ జ్ఞాపకాలు ఒలక బోశాను అంతే —మీ దుర్గా ప్రసాద్G DURGA PRASADnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-70073186090319564822011-12-20T22:21:59.914+05:302011-12-20T22:21:59.914+05:30@విరిసిన అరవిందం
Thanks for sharing your experien...@విరిసిన అరవిందం

Thanks for sharing your experience. What you explained just strengthens my contention that AJ is just hyped up a non issue into an issue.

Then one more thing. When Shri Chalam passed away, I still remember there was not much news coverage at all. Just a news item that he died that too after two days of his death. He was living among Tamilians, deep inside Tamilnadu. How his house could be made memorial. At that time also there were not many people who liked Shri Chalam to undertake such a project. Now...I hope there are some but.....I have no clear idea whether anything can happen because of his hangama created by AJ.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-56887528290503814692011-12-20T16:53:56.886+05:302011-12-20T16:53:56.886+05:30శివప్రసాద్ గారికి నమస్కారం, సర్ మహాకవి శ్రీ
గుడ...శివప్రసాద్ గారికి నమస్కారం, సర్ మహాకవి శ్రీ
గుడిపాటి వెంకటచలం గారి గురుంచిన మీ బ్లాగ్ చదవగానే నా కు ఎదురయిన అనుభవం గుర్తుకొచ్చి మీ తో పంచుకోదామని
మొన్నమార్చ్ లో తమిళనాడు టూర్ వెళ్లి అక్కడనుంచి అరుణాచలం వెళ్లినప్పుడు రమణమహర్షి ఆశ్రమం వెళ్లి చలం గారి గురుంచి అడిగినప్పుడు నిజంగా చాల భాధ అనిపించింది.ప్రస్తుతం ఉన్నవాళ్ళకి చలం గారి గురుంచి ఏమి తెలియదు,అంతా అరవం వాళ్ళు అసలు మన గోడు పట్టించుకోరు అప్పుడునేను గట్టిగ వాదం పెట్టుకుంటే ఒక పెద్దాయన(అక్కడ ఉద్యోగి) వచ్చి అమ్మనేను తెలుగువాడినివిజయనగరం మాది ఇప్పుడుఇక్కడ ఎవరకి ఏమి తెలియదు అని రహస్యంగ ఇక్కడ అయనగురుతులు ఏమి లేవమ్మ ఆఖరికి ఆయనఇల్లు అవి కూడా లేవమ్మ ఇంతకంటే నేను చెప్పలేను అనిఅన్నారు.

"అప్పుడునేను అనుకున్నాను ఒకమహామనిషి,ఒక సంస్కర్త, రచయత
ఒక రుషి ,గుర్తులు కూడామిగులుచుకోలేని దౌర్భాగ్యస్తితిలో వున్నాము కదాఅని"
చేసిదిఏమిలేకబరువెక్కిన మనస్సుతోఆయన తిరిగిన ప్రదేశం కదా అని మొత్తం ఆనేల అంతా తిరిగి వచ్చి మనసులోనే ఆయనికిఅంజలి ఘటించాను".పూర్వ ఫల్గుణి (poorva phalguni)https://www.blogger.com/profile/18141099857737213199noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-70791001835659498912011-12-20T04:04:58.154+05:302011-12-20T04:04:58.154+05:30@కొత్తపాళీ,
Thank you for your comment. To state ...@కొత్తపాళీ,

Thank you for your comment. To state a fact, Chalam was cremated but not buried. Yes, had he been buried, he would have been turning in his grave.

@Indian Minerva

My point is that the structure which the media is showing is not the so called Samadhi of Shri Chalam. Without verifying the facts, Media is trying to a sensation to fill the time in the channel and space in the paper.

Yes if the Samadhi of Shri Chalam could be found or discovered, it should be made a Memorial. On this there is no second opinion.But not just some structure which is pointed out by the news hungry media.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-55930584614472284572011-12-19T22:44:16.300+05:302011-12-19T22:44:16.300+05:30శివ గారు,
ఇరవై ఏళ్ళ క్రితం స్వామి రామనంద గార...శివ గారు,

ఇరవై ఏళ్ళ క్రితం స్వామి రామనంద గారు, నన్నూ నా మిత్రులు వర ప్రసాద్ గారిని, అణ్ణామలై తీసుకువెళ్ళారు. మా బస చలంగారు వుండిన పాత ఇంటిలొనే. అప్పటికే సౌరిస్ భీంలి తరలిపొయేరు. నర్తకి గారు మాత్రం వున్నారు. చలంగారిని చివరవరకు అంటిపెట్టుకుని సేవ చేసారు. పూర్వాశ్రమంలో స్వామి రామానంద గారు చలం గారితోనే వున్నారు.సౌరిస్ ఆదేశంతో హిమాచల్ వెళ్ళి అక్కడ స్వామి రామానంద అయ్యారు. ఇప్పుడు సౌరిస్, నర్తకి, స్వామి రామానంద లేరు. చలం గారి సమాధి గుర్తు లేదు. నర్తకి గారు హైదరాబాద్ వచ్చినపుడు ఒరొజు మా అతిధిగా వున్నారు.స్వామి రామానంద గారు కూడా. అప్పుడు ఆమేతోపాటు చలంగారి అభిమానుల ఇళ్ళకు తీసుకువెళ్ళారు. ఫిల్మ్ నగర్ లో రచయిత్రి రంగనాయకమ్మ గారింటింకి కూడా వెళ్ళాము. రంగనాయకమ్మగారికి చలంగారి ఆశ్రమం గురించి బాగా తెలుసు. అక్కడి సందేహాలు ఆమే తీర్చగలరు అని నా నమ్మకం.బాబుhttps://www.blogger.com/profile/18255485380845436006noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-16402420380494192782011-12-19T11:42:51.641+05:302011-12-19T11:42:51.641+05:30ఓ కవిగారన్నట్టు మనుషులు పోతేగానీ మంచోళ్ళవ్వరు. అలా...ఓ కవిగారన్నట్టు మనుషులు పోతేగానీ మంచోళ్ళవ్వరు. అలా మంచోళ్ళయినాక మరి వాళ్ళసమాధులను జాగ్రత్తగా కాపాడుకోవాలికదండీ.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-39934133029352497562011-12-19T09:23:33.816+05:302011-12-19T09:23:33.816+05:30well said. If Chalam were really buried, he'd ...well said. If Chalam were really buried, he'd be turning in his grave!!Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-65072351564218963112011-12-19T02:13:17.992+05:302011-12-19T02:13:17.992+05:30నెలవంక గారూ. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఇదేదో లేనిపో...నెలవంక గారూ. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఇదేదో లేనిపోని వివాదం అనిపిస్తున్నది. ఇప్పుడు వార్తాపత్రికల్లో చూపించే ఫొటో అసలు చలంగారి సమాధేనా అని నా అనుమానం. ఆ కట్టడం చూస్తుంటే గత పది పదిహెనేళ్ళ క్రితం కట్టబడినట్టుగా కనిపిస్తున్నది.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-86553371895694520582011-12-19T01:50:53.512+05:302011-12-19T01:50:53.512+05:30శివరాంగారూ,
గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఓ పున్నమి ర...శివరాంగారూ,
గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఓ పున్నమి రోజున గిరివనం -తిరువణ్ణామలై-కి సహోద్యోగులతో కలిసి వెళ్లాను. రాత్రి పది గంటలకు మేం నడక మొదలెడితే అరుణాశ్రమం గేట్ కనిపించింది తప్పితే చీకటిలో ఏమీ కనిపించలేదు. చలంగారు 30 సంవత్సరాలు నివసించిన స్థలాన్ని సందర్శించాను అనే సంతృప్తి మాత్రమే దక్కింది. అంతకుమించి వెదకడానికి ఆ రాత్రి అవకాశం లేదు. తెలుగువాళ్ల దౌర్భాగ్యం కొద్దీ ఈ నేలమీద పుట్టి పారిపోయిన మాన్యుడి సమాధి కూడా మనకు మిగలదనే నా భయం. మనకు ఏది మిగిలిందని ఇక్కడ?kanthisenahttps://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.com