17, ఆగస్టు 2009, సోమవారం

చందమామలో మొదటి కార్టూన్ ధారావాహిక - గలివర్ ట్రావెల్స్

పిల్లల పుస్తకంలో కార్టూన్ ధారావాహిక లేకపోవటమేమిటి అనుకున్నరల్లేఉంది చందమామ వారు, 1960 ఏప్రిల్ నుండి 1960 డిసెంబరువరకు గలివర్ ట్రావెల్స్ ప్రచురించారు. ఈ ధారావాహికకు బొమ్మలు వేసినది ఎవరో తెలుసా? బాపు గారు. ఈ అద్భుతమైన ధారావాహికను దొరికినంతవరకు పోగుచేసి ఒక ఫైలుగా చేసాను. స్కానింగు నాణ్యం అంత బాగా లేదు. అయినా పరవాలేదు చదవచ్చు.

ఈ ధారావాహికతోపాటుగా,మరి రెండు కార్టూన్ కథలను కూడ జతపరిచాను.
1) మంత్రాల మల్లి
2) హనుమంతుడి కథ

ఈ రెండిటికీ బొమ్మలు ఎవరు వేశారో తెలియటంలేదు. బహుశా వడ్డాది పాపయ్య గారనుకుంటాను.ఈ రెండు కార్టూన్ కథలను నవంబరు 1964 మరియు నవంబరు 1962లో దీపావళి ప్రత్యేక సంచికలలో ప్రచురించారు.

చివరలో రెండు పాపయ్య గారి చక్కటి బొమ్మలు కలిపాను. ఈ బొమ్మలు పురాణ సంబంధం కాదు. రెండూ కూడ దేశభక్తి పూరకమైనవి ఒకటి 1965లో మరొకటి 1963లో వేసినవి. ముఖ్యంగా చైనా దాడి నుండి భారత్ ఎలాగోలా బయటపడిన తరువాత వెయ్యబడ్డ చిత్రం, పాపయ్య గారు చైనాను చిత్రించిన విధం అద్భుతం. బారత మాతను, బారత ప్రజలను చూసి బెదిరిపోతున్న డ్రాగన్ లాగ వేశారు. డ్రాగన్ మొహం చైనా వాడిది వేసారు, అందులో మావో పోలికలను తెప్పించారు.

4 వ్యాఖ్యలు:

 1. చందమామలో 60లలో ప్రచురించిన కామిక్స్ అందించినందుకు ధన్యవాదాలు. ‘గలివర్ ట్రావెల్స్’ బాపు గారు వేసిన ఇతర కామిక్స్ తో కలిపి పుస్తకంగా కూడా వచ్చింది. మంత్రాల మల్లి, హనుమంతుడి కథ లకు బొమ్మలు వేసింది కూడా బాపు గారేనని ఆ గీతలను బట్టి అనిపిస్తోంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Siva garu, I made a point to visit this site atleast once a day to see any new updates are available. I am one of Chandamama Fan and your efforts are very much appreciated...thank you very much.

  Best regards,
  Ravi Varma

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అవును. వేణు గారి చెప్పిన కామిక్స్ లో బాపు బొమ్మలతో వచ్చిన కొన్ని చందమామ కథలూ ఉన్నాయ్.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శివ గారు, అవన్నీ బాపు గారి బొమ్మలేనండి.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.