28, ఆగస్టు 2009, శుక్రవారం

కొన్ని మంచి మాటలు

ఈ రోజున నెట్లో వెతుకుతుంటే ఒక చోట మన తెలుగులో సూక్తులు అవీ దొరికాయి. అందులో కొన్ని అందరితో పంచుకోవాలని అనిపించింది. అందుకనే ఈ చిన్న టపా!

విలాసాల మధ్య, ఆనందం తరిగి పోవడమన్నదే ఈ మానవ చరిత్రకు సంబంధించిన గొప్ప బాధ. -చిన్మయానంద

చట్టం అప్పుడప్పుడు నిద్రిస్తుంది, చావదు. -అరవింద యోగి

మన వైఖరి సవరించుకోవడం ద్వారా జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు . -వివేకానంద

దోషరహితమైన దాన్ని నిందించటం, ప్రశంసకు అర్హత లేనిదాన్ని పొగడడం.....మనిషి డబ్బుకోసం ఎం చెయ్యడానికైనా వెనుకాడడు. -పంచతంత్రం

ప్రేమతో నిర్మించబడే దేవాలయం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు, మనిషి రాళ్ళను తీసుకురావడం విచిత్రంగా లేదూ! మనసే కదా దేవుని మందిరం. ఆ మాత్రం తెలీదూ? -రవీంద్రనాథ్ టాగూర్



3 కామెంట్‌లు:

  1. అరవింద యోగి కాలం నాటి చట్టం చనిపోయుంది, ఆయన చనిపోయునట్లే.
    దేవుని మందిరం(మనసు) నుంచే సమాజం లో జరిగే ఘోరాలు, నేరాలకి బీజము
    పడితే దేవుడి ని మందిరం లో ఉంచడమే మేలు మనసులో కన్నా.

    రిప్లయితొలగించండి
  2. ఎవరి మనసు దేవునికి మందిరం కాదో, అటువంటి మనుషులవల్లే దారుణాలు . మంచి మాటలు ఎప్పుడూ మనిషిని మించి బతుకుతాయి. అందులోని మంచిని అర్థం చేసుకోగల శక్తి ఉండాలి. నిరాశావాదం మనుష్యులను వెనక్కు తీసుకు పోతుందేకాని ముందుకు మాత్రం కాదు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.