పాల మీద మీగడలా, మంచి గులాబీ సువాసనలా, గాలిలో తేలివస్తున్న జాజిపూల పరిమళంలాగ ఉంటాయి సత్యం శంకరమంచి వారి కథలు. ఒక్కొక్క కథ ఒక్కొక్క మణిపూసే. మన తెలుగు సాహితీ వేత్తలకు పూనుకుని తోటి రచయితలకు ప్రపంచ ఖ్యాతి తీసుకు రావటం అంతగా తెలియదు లేదా చెయ్యరు. అలా పూనుకుని అమరావతి కథలను నోబెల్ బహుమతి ప్రదాతలకు పంపిస్తే, నోబెల్ బహుమతి రావలిసింది కదండీ. ఇప్పటికైనా ఆలశ్యం కాలేదని నా ఊహ.
ఈ రోజున మరొక ఐదు కథల గురించి.
6.ముక్కోటి కైలాసం
ముఖ్య పాత్రలు-ముసలమ్మ, బిచ్చగాళ్ళు ఎవరికీ పేర్లు పెట్టలేదు
బాపు బొమ్మ-నేలమీద చాలా హీనంగా కూచుని చేతులెత్తి నమస్కరిస్తున్న ముసలిది, ఆకాశంలొనుండి ఒక అద్భుత హస్తం అమె వైపుకు తిరిగి. ఆదిదేవుడే ఆ ముసలమ్మను తన చేత్తో, పూజలే ముఖ్యమయ్యి, తోటి మనిషిని పట్టించుకోని లోకంనుండి, ఒక పర్వదినాన ఆమెను కైలాసానికి తీసుకొని వెళ్ళబోతున్నట్టు స్పురిస్తుంది
కథ-ఇదికూడా సంఘటనా వర్ణనమే ఒక దిక్కులేని ముసలమ్మ వైకుఠ ఏకాదశి నాడు అమరావతిలో శివాలయం లో దేవదర్శనంకోసం ప్రయత్నించటం, అశేష జనవాహినిలో పడి కొట్టుకుపోయి, ఆ జన సంద్రపు తీరాన విసిరివేయబడటం, అమె అక్కడే తనువు చాలించటం. కథలో బిచ్చగాళ్ళ దీన జీవన గాధ, అంతటి బీదరికంలొనూ వాళ్ళలొ వాళ్ళు తన్నుకోవటం, తమకంటే తక్కువ వాళ్ళను చీదరించుకోవటం, దిక్కులేని ముసలమ్మను పట్టించుకోక పొగా, కసిరి ఆవతలకి పొమ్మనటం, చివరికి ముసలమ్మను "చచ్చిందిరోయ్" అని అనందంగా కనిపెట్టి, ఆ శవాన్నే పణంగా పెట్టి అడుక్కోవటానికి కూడ వెనకాడక పోవటం చాలా హృద్యంగా చిత్రీకరించారు. "ముసలమ్మ ముందు రెండు కొబ్బరిముక్కలు పడ్డాయి. వాటిని కొరకబోయింది గాని మింగుడు పడలేదు" అన్న వాక్యం మనస్సును ద్రవింపచేస్తుంది.
7.అరేసిన చీర
ముఖ్య పాత్రలు సాంబడు, లచ్చి
బాపు బొమ్మ-సాంబడు లచ్చి, ఇద్దరికి బట్టలతో లంకె, కథలో వారిద్దరు చివరకు ఒకరి మీద మరొకరు ఎలా ఇష్టపడ్డారో తెలియచెప్తుంది
కథ-చాకలి సాంబడు, చాకలి లచ్చి, పెద్దవాళ్ళ బలవంతంమీద పెళ్ళాడుతారు, కాని, వారిద్దరికీ ఇతరులమీద, లచ్చికి కోటేశు మీద, సాంబడికి సీతాలు మీద, మనసు పోతూ ఉటుంది. క్షణం పడదు వాళ్ళీద్దరికీ. ఉతకటానికి వేసిన బట్టల్లోంచి కోటేశుకు చెందిన అత్తాకోడలంచు పంచ లచ్చి, సీతాలుకి చెందిన నెమిలి కంఠం చీర సాంబడు ఉతుకుతారు. సాయంత్రానికి ఉతికిన బట్టల్లోంచి తమకు నచ్చిన బట్టలు - నెమిలి కఠం చీర లచ్చి, అత్తాకోడలంచు పంచ సాంబడు కట్టుకుంటారు. ఆ బట్టల్లో వాళ్ళకి ఒకళ్ళమీద ఒకరికి ఇష్టం కలిగినట్టు సూచించి కథ ముగించారు రచయిత.

8.శివుడు నవ్వాడు
ముఖ్య పాత్రలు గుడ్డి గంగన్న, అర్చకుడు మహదేవయ్య
బాపు బొమ్మ-గుడ్డి గంగన్నలోని పరమేశ్వరుణ్ణి చూస్తూ అతన్ని లేవతీస్తున్న మహదేవయ్య, కథలోని సంఘటనకు అద్దం పడ్తుంది.
కథ-దేవాలయానికి ఆనుకుని ఉన్న గుడ్డి గంగన్న కాళీ స్థలాన్ని, అక్కడ ప్రసాదాలు అమ్మేషాపు పెట్టాలని చులాగ్గా నిర్ణయింస్తారు గుడి గుమాస్తా, ఆఫీసరు. వాళ్ళు గుడ్డి గంగన్న దగ్గరకు వచ్చి ఆ స్తలాన్ని అమ్మమని ఆడుగుతారు, గంగన్న తిరస్కరిస్తాడు. అతనికి రొజూ పెట్టే ప్రసాదం పెట్టటం మానేస్తారు. నాలుగు రోజులు తరువాత, ఆ ప్రసాదం మీదనే బ్రతికే గంగన్న ఆవేశంతో ఆక్రొసిస్తాడు. ఆ క్రమంలో పడిపోతున్న గంగన్నని, అర్చకుల్లో పెద్దవాడైన మహదేవయ్య మడిలో ఉండి కూడ పట్టుకుని ప్రసాదం తినిపించి, అతని ఆకలి తీరటంతో, నాలుగు రోజులనుండి చిరునవ్వు నవ్వని శివుడు నవ్వినట్టు భావించి ఆనందిస్తాడు. బిచ్చగాళ్ళు తన స్తలంలో వండుకుని పడుకొంటున్నారని గమనించిన గంగన్న"ఆ స్తలం నాదే కాని బాబూ! దాన్ని అమ్మే హక్కు నాకు లేదు బాబూ"అని అనటం, మడిలో గంగన్నని ముట్టుకున్నందుకు వచ్చిన ఆక్షేపణను మహదేవయ్య "అతనూ మడిగట్టుకునే ఉన్నాడండీ" అన్న ఒక్క మాటతో కొట్టి పారెయ్యటంతో, మానవుల మనసుల్లో కొరవడుతున్న మానవత్వపు విలువలను ఎత్తి చూపారు రచయిత.
9.ఒక రోజెళ్ళి పోయింది
ముఖ్య పాత్ర-పిచ్చయ్యగారు
బాపు బొమ్మ-చాలా అర్ధవంతమైన బొమ్మలలో ఒకటి.అస్తమిస్తున్న సూర్యుడు, ఎగిరిపోతున్న పావురం, కథావిషయాన్ని ఇట్టే చెప్పగల శక్తిగలదీ బొమ్మ
కథ-ఇందులో పిచ్చయ్య గారన్న ఒక సామాన్య వ్యక్తి, ఒకళ్ళ అంటు-సొంటు అక్కర్లేని వ్యక్తి యెక్క దినచర్య, అతను వెళ్ళిపోయిన వైనం. అన్ని విధాలా సంతృప్తిపడగల వ్యక్తి జీవితం ఎంత హాయిగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జరిగిపోతుందో రచయిత చక్కగా వర్ణించారు. పిచ్చయ్యగారికి "కారం దివ్యంగా ఉండాలి. లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు" అన్న రెండు వాక్యాలు చదువుతుంటే ఆ సంఘటన కళ్ళకు కట్టి నవ్వు తెప్పిస్తుంది. సమాజంలోని ఎంతో మంది తమకు అక్కర్లేని పనులలో తల దూర్చి లేనిపోని చిక్కులు, సమస్యలు(అవి తీరుస్తున్నామన్న భావనతో)తెచ్చుకుంటారో,తెస్తారో(చాలాభాగం సొంత లాభంకోసం), అటువంటివారికి వారికి పూర్తి విభిన్నంగా "పిచ్చయ్యగారు ఏవీ సాధించలేదు. తగాదాలు తీర్చలేదు. సమస్యలు చర్చించలేదు. కానీ, కాలానికి తెలియకుండా కాలంలో కలసిపోయి బతికాడు. అది చాలదా? అది చాలటంలేదు చాలామందికి " అన్న చురుక్కుమనే కొసమెరుపునిచ్చి కథను రచయిత ముగిస్తారు.
(ఈ తొమ్మిదో కథ ఉన్నదే, ఈ కథను ప్రస్తుతం పదవులకోసం కొట్టుకు చస్తున్న రాజకీయ నాయకులకి బలవంతాన ఒక రోజల్లా వినిపిస్తే ఎమన్నా గుణం కనిపిస్తుందేమో? మానసిక వైద్యులు ఎవరైనా విశ్లేషించి తేల్చి చెప్పాలి)
10.హరహర మహాదేవ
ముఖ్య పాత్ర-మోగులూరి ముసలమ్మ
బాపు బొమ్మ-రధంలో ఊరేగుతున్న పరమేశ్వరుడి రధ చక్రంలో మోగులూరి ముసలమ్మను చిత్రీకరించటం, ఆ చక్రాకృతిలోనే ముసలమ్మ దేవుడికి హారతి పట్టడం బొమ్మయెక్క ప్రత్యేకత
కథ-చాలా కాలం క్రితం, (ఈ కథారచనా సమయంలోనె) ఆకాశవాణి వారు శ్రీరామనవమి నాడు భద్రాచలం నుండి అక్కడ ప్రతి సంవత్సరం జరిగే సీతారామ కళ్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసావాళ్ళు. అందులో వ్యాఖ్యాతగా జమ్మలమడక మాధవరాయ శర్మ తన్మయుడయి ఆ కళ్యాణాన్ని కళ్ళకు కట్టినట్టు భక్తి పారవశ్యంతో చెప్పి సకలాంధ్ర శ్రోతలకు ఆనందం కలిగించేవారు. ఈ కథలో,అమరావతిలో మహా శివరాత్రి నాడు జరిగే అమరేశ్వరుని రధ యాత్రను, రచయిత ఆ పంధాలొనే, అక్షర రూపంలోనె మనముందు ఉంచినా, ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కలుగ చేశారు. ఎంతో దూరం నుంచి వచ్చిన మోగులూరి ముసలమ్మ పరమేశ్వర దర్శనం చేసుకోవటం, హారతి ఇచ్చి పరవశించటం ఈ కథకు వన్నె తెచ్చిన అంశం.

Mee Amaravathi kathalu sameeksha chala bagundi. Naaku nachhe kathala pustakam lo Amaravathi Kathalu di agrastanam.
రిప్లయితొలగించండి'ఒక రోజెళ్ళి పోయింది' కథ చాలా ఇష్టం నాకు. దీనిలో అద్భుతమైన జీవిత సత్యాన్ని ఎంతో సరళంగా చెప్పారు సత్యం శంకరమంచి.
రిప్లయితొలగించండిశివ గారూ, అజరామరమైన ‘అమరావతి కథల’ సారాన్ని ఎంతో చక్కగా వివరిస్తున్నారు. అభినందనలు!
అన్ని కథలూ వరుసగా పరిచయం చేయడం మంచి ఆలోచన.. బాపు బొమ్మలని కూడా కళ్ళకి కడుతున్నారు చక్కగా..
రిప్లయితొలగించండిచిన్నప్పుడు కనిపించిన చందమామనల్లా వదలకుండా చదివెదాన్ని, కధల పుస్తకంలో తల దూరిస్తె చాలు పక్కన ప్రపంచం ఏమైపోయినా నాకు తెలిసేది కాదు, మీరు రాసిన సమీక్ష చూస్తుంటే ఈ సారి ఎలాగైనా పుస్తకం సంపాదించి చదవాలని ఉంది. ఈ కధల సంగ్రహం పుస్తక రూపంలొ దొరుకుతుందాండీ?
రిప్లయితొలగించండి