21, జనవరి 2010, గురువారం

జయదేవ్ గారి ఆత్మకథ

(పైనున్న బొమ్మను క్లిక్ చేసి పెద్దగా చూడవచ్చు)
ఆత్మకథలను వ్రాసుకోవటం అందరి వల్ల కాదు. కారణం వ్రాసుకోవటానికి పెద్దగా లేకపోవటం, ఉన్నా వ్రాయగల శక్తి లేకపోవటం. మనకు తెలుగులో ఆత్మకథలను వ్రాసుకున్న ప్రముఖులు చాలా కొద్దిమంది. కొద్దిమందిలో కార్టూనిస్టులు ఎవరూ లేరు. తెలుగులో వ్యంగ్య చిత్ర కళా వైభవం బాపు గారు మొదలు పెడితే జయదేవ్ గారు కళా రూపాన్ని తనదైన శైలిలో అనేక మెరుగులు దిద్దారు. కొన్ని దశాబ్దాల నుండి జయదేవ్ గారు తన కార్టూన్లతో తెలుగు పత్రికా పాఠకులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నారు. ఈయన కార్టూన్ లు వేయని పత్రిక తెలుగులో లేదు. పూర్వం యువ లాంటి ప్రముఖ పత్రిక దీపావళి సంచిక వీరి కార్టూన్ లేకుండా వచ్చేది కాదు.

జయదేవ్ గారు తన జీవితంలో ని అనేక సంఘటనలు గుదిగ్రుచ్చి ఒక చక్కటి డైరీ లాగ తన ఆత్మకథ వ్రాసుకున్నారు. ఆత్మకథ లో ఆరేడు దశాబ్దాల కాలంలోని అనేక సంఘటనలు వివరించారు. ఆత్మ కథను మధ్యనే హైదరాబాదులో ఆవిష్కరించటం జరిగింది. సామాన్యంగా పుస్తక ఆవిష్కరణ సభ ఏదో ఒక అరగంటో గంటో జరుగుతుంది. కాని వీరి ఆత్మకథ ఆవిష్కరణ సభ ఏకంగా గంటలపాటు జరిగిందట.

ఒక కార్టూనిస్టు మొట్టమొదటగా ఆత్మకథను వ్రాసుకున్న సందర్భం ఇది. కార్టూన్ ప్రియులందరూ చదివి తీరవలసిన పుస్తకం జయదేవ్ గారి ఆత్మకథ.

వీరి ఆత్మకథ కు పేరు గ్లాచ్చు మీచ్యూ. పేరు కూడ చిత్రంగా ఉన్నది కదూ.

1 కామెంట్‌:

  1. శివరాం గారూ, ఈ పుస్తకం మద్రాసులో కొనడానికి లభ్యంగా ఉందా, లేదా తిరుపతిలో ప్రయత్నించాలా. చెప్పగలరు. అన్ని దీపావళి 'యువ' సంచికలలో జయదేవ్ గారి కార్టూన్లు.. ఇక ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. వీరతాడు వెయ్యవలసిందే..

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.