12, ఆగస్టు 2010, గురువారం

ఇంటర్నెట్ రేడియో


రేడియో మనకు అందుబాటులో ఉన్న ఏకైక వినోద సాధనం. మాట ఒకప్పుడు. ప్రస్తుతం రేడియోని టి.వి పడగొట్టి రకరకాల వేషాలు వేస్తున్నది. రేడియో పేరిట వస్తున్న లోకల్ చానెల్స్, అవే ఎఫ్ ఎం రేడియోలు, కూడ తామ తంపరగా పుట్టి వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నాయి. డిస్క్ జాకీ పేరిట నా నా అల్లరి చేస్తూ ఊరికే వాగటమే కనిపిస్తుంది నాకు. "జనరేషన్ గ్యాప్" అయ్యి ఉండచ్చు.

అదే నా పాయింటు. ఇవన్ని కూడ 40 ఏళ్ళ వయస్సు లోపలివారికే కాని, పాత తరం రేడియో తెలిసి అప్పట్లో ఆ రేడియో కార్యక్రమాలు విని ఎంతో ఆనందించి, ప్రస్తుతం భయ్యో పడిలోకి వచ్చిన నా లాంటి వారి కోసం కార్యక్రమాలు ఎక్కడా కనపడటంలేదు, లేదా ఎక్కడన్నా ఉన్నాయేమో నేనే వాటిని పట్టుకునే వీలు లేకుండా ఏదో మారు మూల వస్తున్నాయేమో తెలియదు.

నా చిన్నతనంలో, రేడియోలో షార్ట్ వేవ్ ఫ్రీక్వెన్సీలలో ఏరియల్ అవి కట్టుకుని ఎంతో కష్టపడి విన్న రేడియోలు ఇప్పడు కనుమరుగయ్యాయి. వాటిలో చాలా భాగం శాటిలైటు రెడియోలుగా మారినాయి. దాదాపు అవన్నీ కూడ ఇంటర్నెట్లో కూడ ఉంచబడినాయి. అలా ఇంటర్నెట్లో వినటానికి వీలుగా ఉండి, అప్పట్లో అంటే దాదాపు 30+ సంవత్సరాల క్రితం విన్న రేడియోలు ఇప్పుడు హాయిగా వినటానికి దొరకటం ఆనందం కలిగిస్తున్నది. నా దృష్టిలో మంచి ఇంటర్నెట్ రేడియోలను అందరితో పంచుకోవాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను.

బ్లాగులో కుడిపక్కన ఒక విడ్జెట్ ఉంచాను. అందులో ఒక లింకు ఉంటుంది. లింకు నొక్కి ఇంటర్నెట్ రేడియోని వినవచ్చు. కుదిరినప్పుడు, రేడియోలను తరచూ మార్చటానికి ప్రయత్నం చేస్తుంటాను. రేడియో అభిరుచి కలవారు హాయిగా వినండి. మరిన్ని ఇంటర్నెట్ రేడియోలు తెలిసిన వారు లింకులు పంపండి, అందరితో పంచుకుందాము.










.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.