జనవరి 14, 1956 ఆంధ్ర పత్రికలో ప్రచురించబడ్డ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి చిత్రం (ఫోటో కాదు)
చిత్ర సేకరణ శ్రీ మాగంటి వంశీ
చిత్ర సేకరణ శ్రీ మాగంటి వంశీ
- ప్రముఖులైన కవులు, రచయితల రచనలు మనం ఎన్నో చదువుకుంటూ ఉంటాము. కాని, ఆ పుస్తకం ప్రచురణ సందర్భంగానో, లేక పున:ప్రచురణ సందర్భంగానో, ఆ పుస్తక రచయిత గళంలోనే ఆ కథను వినటం ఎంతో ఆనందానిస్తుంది. కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు తాను వ్రాసిన కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు ఆయన నోటిద్వారా వినే అదృష్టానికి మనం నోచుకోలేదు. ఎక్కడో కిన్నెరసాని పద్యాలు అనుకుంటాను ఆడియో ఉన్నది.
- వారి కుమారులలో ఒకరైన శ్రీ విశ్వనాథ పావని శాస్త్రిగారు, తాను పండిత పుత్రుణ్ణి కాదని నిరూపించుకున్నారు. స్వతహాగా కథకుడు. సాహిత్య సమావేశాల్లో మంచి ప్రసంగాలు చేసి సాహెతీ అభిమానులను అలరించేవారు. పావని శాస్త్రిగారు, తన తండ్రిగారైన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన కొన్ని కథలను తాను చదివి వినిపించారు. అలా పావని శాస్త్రిగారి గళంలో వెలువడ్డ కథలలో నాకు నచ్చిన కథ ఒకటి ఈ కింది ఆడియోగా ఇస్తున్నాను. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి నోటినుండి వినకపోయినా, వారి అబ్బాయి నోటినుండి వినటం ఎంతో ఆనందానుభూతి ఇస్తుంది. ఇక కథను వినండి.
విశ్వనాధ వారి గురించిన ఒక అద్భుత వ్యాసం ఈ కింది లింకు నొక్కి చూడండి.
జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి విరచిత వ్యాసం
(వ్యాసం కర్టెసీ మాగంటి.ఆర్గ్)
జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి విరచిత వ్యాసం
(వ్యాసం కర్టెసీ మాగంటి.ఆర్గ్)
- విశ్వనాథ వారికి శ్రీ శ్రీ ఇచ్చిన కితాబు కూడ ఇక్కడ ఉదహరిస్తే బాగుంటుంది అనిపించింది. కాబట్టి, చందస్సు లేని ఆ ద్విపద శ్రీ శ్రీ రచన ఇదిగో చూడండి.
మాట్లాడే వెన్నెముక
పాట పాడే సుషుమ్న
నిన్నటి నన్నయభట్టు
నేటి కవి సామ్రాట్టు
గోదావరి పలుకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలుగువాళ్ళ గోల్డునిబ్బు
అకారాది క్షకారాంతం
ఆసేతు మహికావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి
అనవరతం తెలుగువాడి ప్రకాస్తి
ఛందస్సు లేని ఈ ద్విపద
సత్యానికి నా ఉపద
ఆధునిక తెలుగు సాహిత్యం గురించి మాట్లాడుతూ విశ్వనాథ పేరెత్తగానే ఛాందసుడు అని ఆడిపోసుకునే వాళ్ళందరూ ఈ కథ వినాలి.
రిప్లయితొలగించండిపంచుకున్నందుకు నెనర్లు శివగారు.
కొత్త పాళీగారూ. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశివగారు:
రిప్లయితొలగించండిమంచి కథను గుర్తు చేసారు.
నేను విశ్వనాథ వారు ఒకేరోజు పుట్టాము - భాద్రపద బహుళ షష్ఠి. మొన్ననే జరుపుకున్నాము ;)
స్కూల్లో ఉన్నపుడు మా తెలుగు మాస్టారు ఈ విషయం చెప్పి వారి రచనలు చాలావరకు చదివించారు.
శ్రీశ్రీ గారు అన్నట్టు: అతగాడు తెలుగువాడి ఆస్తి
ఐతే విశ్వనాథ వారి ప్రభ ముందు పావనశాస్త్రి గారు చాలా చిన్నగా అనిపిస్తారు నాకు.
@Witreal
రిప్లయితొలగించండిశ్రీ పావని శాస్త్రి గారు పండిత పుత్రుడిగా మటుకు పేరొందలేదు, అలా అని తన తండ్రంత పండితుడిగా పేరూ రాలేదు. వారు మా మామగారికి ఎంతో ఆప్తులు. మా పెళ్ళికి వచ్చి, విశ్వనాథ వారి మొదటి నవల, చివరి నవల ఒకే పుస్తకంగా వేసిన ప్రతి మాకు బహుమతిగా ఇచ్చారు. విశ్వనాథ వారి సాహితీ సమగ్రం ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రచురించి సాహితీ ప్రియులకు పుస్తక విందు చేశారు. ఆయన అకాల మరణం నాకు చాలా బాధ కలిగించింది. వారి ఆత్మకు శాంతి కలుగు గాక.
చదివితే ఎలా ఉండేదో కానీ, భావయుక్తంగా వింటుంటే జలదరింపు కలిగింది. చక్కటి ప్రయత్నం శివ గారూ. ఇటువంటివి మరిన్ని మాకోసం పోస్ట్ చేస్తుండండి.
రిప్లయితొలగించండిWow!
రిప్లయితొలగించండిThanks a lot!
మీ వద్ద మరేవన్నా విశ్వనాథ వారి తాలూకా ఆడియోలు ఉన్నాయా?
చాలా బాగుందండి. పంచుకున్నందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండికల్పవృక్షంలోంచి ముఖ్యమైన పద్యాలు పావనిశాస్త్రిగారు చదివితే, వాటికి వివరణ విశ్వనాథవారి మనవరాలు చదివే ఆడియో కేసట్లు తయారు చెయ్యాలని అనుకున్నారు. పీఠికలోని పద్యాలతో ఒక కేసెట్ మాత్రం విడుదల చేసారు. ఆ ప్రయత్నం ముందుకు సాగినట్టు లేదు. ఈ లోపుల పావనిశాస్త్రిగారు కూడా పరమపదించారు :-(