ఇవ్వాళేదో ఆ ఇంగ్లీషువాడు ఆడియో బుక్స్ అంటే అబ్బురంగా చూసి అదేమిటో మనమూ విందామని తహతహ లాడుతున్నరేకాని ఈనాటి టెక్ సావీ యువత, మనింట్లోనే పూసిన పుష్పాల సువాసన చూడలేని, మనింట్లోని సంగీతాన్ని వినలేని వారిగా తయారవ్వటంలో వారి తప్పులేదు అని నా అభిప్రాయం. ఇప్పటి యువతకు రేడియో అంటే ఏమి తెలుసు? వాళ్ళు పుట్టేప్పటికే టి వి దయ్యం అందరిళ్ళల్లో ఉన్నది, ఆ తరువాత పూనకాల ఎఫ్ ఎం రేడియో దరువులు , కేకలు, అరుపులు ఉండనే ఉన్నాయి. వాళ్ళకేమి తెలుస్తుంది పాపం రేడియో కథానికల విషయం!!!
నాకు బాగా చిన్నతనం. అప్పట్లో విజయవాడ రేడియో కేద్రం నుండి అప్పుడప్పుడూ మదరాసు కేద్రం నుండి తెలుగు కార్యక్రమాలు రిలే అయ్యేవి. ఈ కార్యక్రమాల్లో నాకు ఇప్పుడె గుర్తుకు వచ్చింది, "చక్రపాణి" అన్న పేరుతో (పేరులో నేను తప్పుగా గుర్తు పెట్టుకుని ఉంటే సరిచేయండి) ఒక అనౌన్సర్ ఉండేవారు. వారి గొంతు ఎంతో విలక్షణంగా ఉండేది. ఆ తరువాత, గొల్లపూడి మారుతీరావుగారు తన సొంపైన కంఠస్వరంతో తన కథలు, ఇతరుల కథలు హాయిగా చదివేవారు. అసలు కథంటే ఏమిటో తెలియని వయస్సు. చదువుతున్న వారి కంఠస్వరాల మాధుర్యపు గారడీ వల్ల కథలంటే మక్కువ ఏర్పడి సాహిత్య అభిమానిగా మారటానికి పునాదులు అక్కడే ఉన్నాయనిపిస్తుంది. (అప్పుడు నా వయస్సు 7-8 ఏళ్ళు ఉండవచ్చు).
ఇంతటి జ్ఞాపకాల దొంతరను కదిలించిన సంఘటన ఏమిటి? మన బ్లాగు గంధర్వ (వారి జి మైలు పేరు రంజని తప్ప మరే వివరాలు తెలియవు అందుకని "గంధర్వ" అని సరదాగా అంటున్నాను. ఇలా పేరు తెలియకుండా మేలు చేసేవారిని "గంధర్వ" అని ఎందుకు వ్యవహరిస్తానో మరోసారి, మరో వ్యాసంలో) ఈ రోజున పొద్దున్నే ఒక చక్కటి మైలు పంపారు. ఆయన మైళ్ళు ఎప్పుడూ ముక్తసరిగా, సూటిగా చెప్పవలసిన మాటలే తూకం వేసినట్టు ఉంటాయి. వారు క్లుప్తంగా చెప్పినది ఏమంటే ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురగా జానకీరాణి గారు "రేడియో కథానికలు" అన్న విషయం మీద రేడియోలో ప్రసంగించారని, కాని ఆ రికార్డింగు సగం నుంచే ఉన్నదని (ముందుగా తెలియక పోవటం వల్ల, రికార్డింగుకు సిధ్ధంగా ఉండే అవకాశం లేక) "నేను-మీరు" బ్లాగ్‌లో ఈ ఆడియో ఉన్నదని చెప్పారు. సరి, అక్కడకు పోయి చూస్తే ఆడియో ప్లే కావటంలేదు-సరిగ్గా లింకు చేసినట్టులేరు.
రంజనిగారే ఆ ఆడియో పంపారు. కింది ప్లేయర్ ద్వారా వినండి.
జానకీరాణిగారు ఆ కొద్ది సమయంలో ఎన్నెన్ని విశేషాలు చెప్పారు, ఎంతటి విశ్లేషణ. రేడియో కథానికకు ఉండే పరిధులు చక్కగా వివరించారు. ఈ పరిధులన్ని కూడ ఇప్పటి మీడియ (ముఖ్యంగా ఎలక్‌ట్రానిక్ మీడియా) అనుసరిస్తే ఎంత బాగుండును. జానకీ రాణిగారి ప్రసంగంలో నాకు దొరకని సమాచారం ఒక్కటే. ఆకాశవాణి హైదరాబాదు కేద్రం నుండి 1980 ఆగస్టు నుండి అనుకుంటాను "నవలా స్రవంతి" అని ఒక కార్యక్రమం రాత్రి 8:45 కు ప్రతిరోజూ వచ్చేది. ఆ కార్యక్రం గురించి.
తురగా జానకీరాణిగారు రచయిత్రిగానే నాకు తెలుసు. ఆవిడ రేడియోలో పనిచేశేవారన్న విషయం నేను వెబ్ లోకంలోకి 2003లో వచ్చేవరకు తెలియదు. జానకీ రాణిగారు చలంగారి మనుమరాలని ఆవిడ చలంగారి గురించి ఒక విశ్లేషణాత్మక (ఆవిడ పక్కనుండి) పుస్తకం వ్రాశారని కూడ తెలియదు.
బ్లాగులో ప్రచురించటానికి జానకీ రాణిగారి ఫొటో దొరుకుతుందా అని గూగులిస్తుంటే ఒక చక్కటి వెబ్ సైటు అందులో ఆవిడతో ఒక ఇంటర్వ్యూ దొరికాయి. ఈ కింది లింకు నొక్కి ఆ ఇంటర్వ్యూ చదువుకోవచ్చు.
శ్రీమతి తురగా జానకీరాణిగారితో ఇంటర్వ్యూ

రేడియో అంటేనే బహుజన హితాయ... బహుజన సుఖాయ... రేడియో ద్వారా హితం పలుకుతాం
-తురగా జానకీరాణి
రంజనిగారి రికార్డింగులో ప్రసంగం పూర్తిగా ఉంది.
రిప్లయితొలగించండి"నేను-మీరు" బ్లాగు టపాలోని రికార్డింగులోని ప్రసంగంలో
మొదట ఓ రెండు-మూడు నిమిషాలు రికార్డు అవలేదు..
@mv
రిప్లయితొలగించండిAudio in "meeru-neu" blg is not playing at my end. I went to Div Share site and downloaded the same. Now I shall see the audio sent by Shri Ranjani. Thanks for the information.
jrturaga@gmail.com శ్రీమతి తురగా జానకీరాణిగారి దగ్గర మీకు కావలసిన సమాచారం దొరుకుతుంది.
రిప్లయితొలగించండిఈ మెయిల్ చిరునామాలో ప్రయత్నించండి.
మీరు ఎంతో శ్రమపడి మాతో పంచుకుంటున్న తీపి జ్ఞాపకాలకు బహుసంతోషం
ayyo nannu gurimchi amtha srama padaala naa prasangam thappaka gmail lo pedathanu.
రిప్లయితొలగించండిnavalaa sravanthi ratri kakumda madhyahnam okatinnaraki vacheppudu nenu choosedanni. ranaganayakamma gaari stree, vasireddi sithadevi uri traadu,unnava vijaya lakshmi gaari pilupukosam, dwivedula visalakshi gaari di maroka navala nenu prasaaram chesaanu. radiolo naa service iravai ellu. imkaa em cheppanu?
ayyo..naa kosam antha shrama padaalaa? nenu naa prasangaanni post chestaanu. navalaa sravanthi raatri kaaka madhyahnam vachchetappudu nenu choosedaanini. ranganayakamma gaari stree, vaasireddy seeta devi gaari uri traadu, dwivedula visaalaakshigaari maroka navala nenu prasaaram chesaanu. iravai samvatsaraala radio service naadi. inka em cheppanu?
రిప్లయితొలగించండిayyo..naa kosam antha shrama padaalaa? nenu naa prasangaanni post chestaanu. navalaa sravanthi raatri kaaka madhyahnam vachchetappudu nenu choosedaanini. ranganayakamma gaari stree, vaasireddy seeta devi gaari uri traadu, dwivedula visaalaakshigaari maroka navala nenu prasaaram chesaanu. iravai samvatsaraala radio service naadi. inka em cheppanu?
రిప్లయితొలగించండి