2, అక్టోబర్ 2010, శనివారం

షార్ట్ వేవ్ రేడియో సాధక బాధకాలు

(పైన మనం చూస్తున్నవి రేడియో నెదర్లాండ్స్ వారి షార్ట్ వేవ్ ట్రాన్స్ మీటింగ్ ఎంటిన్నాల సముదాయం )

నా అబిమాన షార్ట్ వేవ్ రేడియో రేడియో నెదర్లాండ్స్ . స్టేషన్ ను నా చిన్నతనం 1974-75 నుండి దాదాపుగా 1996-97 వరకూ కూడ రెడియోలోనే వినే వాణ్ని. ఇప్పుడు ఇంటర్నెట్లో వినగలుగుతున్నాను. స్టేషన్లో మీడియా నెట్వర్క్ అని ఒక కార్యక్రమం ఉన్నది. అందులో సామాన్య శ్రోతలకు రేడియోలు , సాంకేతిక వివరాలు, ప్రీక్వెన్సీలు, ప్రసా సమయాలు మొదలైన విషయాలు చాలా మామూలు భాషలో వివరిస్తూ ఉంటారు. అలా వచ్చిన కార్యక్రమాల్లో ఒకటి మీకోసం కింద లింకుతో ఇవ్వబడిం ది

రేడియో స్టేషన్ల సాధక బాధకాలు


పైన
మనం వినే సంభాషణలో ఒకటికి రెండుసార్లు "సింగిల్ హాప్" అనే మాట వాడబడింది. అంటే ఏమిటి? షార్ట్ వేవ్ రేడియో ప్రసారాలు ఐనో స్ఫియర్ నుండి రిఫ్లెక్ట్ చేయబడతాయి. మన వాతావరణంలో బాగా పైన ఉండే పొరను ఐనో స్ఫియర్ అంటారు. సూర్యుని నుండి వెలువడే హానికరమైన కిరణాలు మనకు తాకకుండా కాపాడుతూ ఉంటుంది వాతావరణ పొర. పొర వల్లన మరొక ఉపయోగం ఉన్నది. రేడియో తరంగాలను వక్రీభవిస్తుంది (reflects) . విషయం కనుగొన్న తరువాత రేడియో ప్రసారాలు పొర నుండి వక్రీభవనం ద్వారా చాలా దూర తీరాలకు ప్రసారం చేసే అవకాశంవచ్చింది. వక్రీకరణలో ఒక చోట ఉన్న ట్రాన్స్ మీటర్ రేడియో తరంగాలను ఐనోస్ఫియర్ పొరకు ఒక కోణంలో గురిచేసి వదులుతూ ఉంటే, వక్రీకరణ జరిగిన రేడియో తరంగాలు, (ట్రాన్స్ మీటర్ శక్తి తక్కువ ఐనప్పటికీ) 3,500 కిలో మీటర్ల వరకు వెళ్ళగలిగి, దూరం లో ఉన్న వారికి రేడియో ద్వారా వినిపిస్తాయి. రేడియో ట్రాన్స్ మీటర్ ఎంటిన్నా కోణాన్ని (angle) మార్చి దూరాన్ని 3500 కిలో మీటర్లు లేదా అంతకన్నా తక్కువ పరిధికి పరిమితం చెయ్యవచ్చు. ప్రక్రియను "First Hop Transmission" అంటారు. రేడియో స్టేషన్ వారు తాము ఎన్నుకున్న ప్రదేశానికి (Target Area) తమ కార్యక్రమాలను ప్రసారం చెయ్యటానికి రేడియో ఎంటిన్నా కోణం మార్చి ప్రసారాలను పంపుతారు. సామాన్యంగా ఇలాంటి "First Hop Transmission" ఎంత తక్కువ దూరం ఉంటే ప్రసారాలు అంత బాగా స్పష్టంగా వినపడతాయి.

ఇదే
విషయాన్ని పైన మన వినే సంభాషణలో ఉదాహరిస్తున్నారు. ఒకవేళ 3500 కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రసారం చెయ్యాలంటే ఏమి చేసేవారు? ఫస్ట్ హాప్ చివరలో ఒక రిలే ట్రాన్స్ మీటర్ పెట్టి మళ్ళి అక్కడనుండి మరొక హాప్ కొట్టేవారు, దాంతో మరో 3500 కిలోమీటర్లు ప్రసారాలు పంపే వీలుండేది. మనకు అలా వాయిస్ ఆఫ్ అమెరికా ప్రసారాలు, అమెరికాలో ఉన్న వారి ట్రాన్స్మిటర్లనుండి, ఫిల్లిప్పైన్స్ లో ఉన్న రిలే ట్రాన్స్మిటర్ల నుండి వచ్చేవి.

ఇప్పుడు హాప్ లు, రిలేల గోల లేదు. శాటిలైట్లు వచ్చేసాయి వాటిద్వారా ప్రసారాలు హాయిగా జరుగుతున్నాయి, స్పష్టంగా వినగలుగుతున్నాము. రోజున షార్ట్ వేవ్ రేడియో లలో పైన చెప్పిన పద్ధతిలో పనిచేసే స్టేషన్లు అతి తక్కువ. కాని పెద్ద పెద్ద స్టేషన్లు బి బి సి, వాయిస్ ఆఫ్ అమెరికా, వాయిస్ ఆఫ్ జర్మనీ వంటి వారు సాంప్రదాయిక పద్ధతిని ఇంకా వదలలేదు. ఇంటర్నెట్, శాటిలైట్ రేడియో తో పాటుగా షార్ట్ వేవ్ రేడియోని ఇంకా బతికించే ఉంచారు. చిన్న చిన్న దేశాలు, షార్ట్ వేవ్ రేడియోనే నమ్ముకుని ఉన్నాయి.

మధ్య సునామీ వచ్చినప్పుడు, ప్రజల వద్ద ఇప్పుడు షార్ట్ వేవ్ రేడియో లు లేక పోవటం వల్ల సముద్ర తీరాల్లో ఉన్న వారికి హెచ్చరికలు పంపలేక పోయారు. సముద్ర తీరంలో కూచుని చిన్న ట్రాన్సిస్టర్ వినగలం కాని, శాటిలైటు లేదా ఇంటర్నెట్ రేడియో వినలేము కదా. శాటిలైటు రేడియోలు, ఇంటర్నెట్ రేడియోల ప్రభావంతో సాంకేతికత ఎక్కువైపోయిన ప్రజలు తమ వద్ద షార్ట్ వేవ్ రేడియోలను ఉంచుకోవటం నామోషీగా భావించి, ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. సాంకేతిక అభివృద్దిని ఎంతవరకు వాడుకోవాలో, దేనికోసం వాడుకోవాలో తెలుసుకున్నప్పుడే జన బాహుళ్యానికి ఎక్కువ ఉపయోగం.

షార్ట్
వేవ్ రేడియోల గురించి, అప్పటి జ్ఞాపకాల గురించి మరో రోజున.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.