2, నవంబర్ 2010, మంగళవారం

ఎన్ టి రామారావు తీయని అల్లూరి సీతారామరాజు సినిమా లో పాట


అల్లూరి సీతారామరాజు అందరికీ పరచియం ఉన్న స్వాతంత్ర సమర యోధుడు. మన్యం ప్రాంతంలో ఆయన కొనసాగించిన పోరాటం బ్రిటిష్ వారి పుస్తకాల్లో "పితూరీ" గా వర్ణించారు. ఇరవయ్యో శతాబ్దపు తొలిరోజుల్లో జరిగిన ఈ స్వాతంత్ర్య పోరాటం సినిమాలోకి ఎక్కించాలని తాను అల్లూరి సీతారామ రాజు వేషం వెయ్యాలని, నందమూరి తారక రామారావు గారు ఎంతగానో ఉవ్విళ్ళూరారు. ఈ దశగా తన పద్ధతిలో కొనసాగుతూ, ఒక పాట కూడా వ్రాయించి రికార్డు చేయించారు.


కాని, ఆయన పథకాలు పథకాలుగానే ఉండగా, ప్రముఖ నటుడు కృష్ణ తాను సీతారామరాజుగా 1970 లలో ఒక సినిమా తీసి విడుదల చేసేశారు . ఆ సినిమా మంచి విజయం సాధించింది.

ఎన్ టి రామారావు తాను తీద్దామనుకున్న సినిమా కృష్ణ తీసి విడుదల చెయ్యటంతో బాధపడి ఊరుకున్నారు. కాని కొంత కాలానికి "సర్దార్ పాపారాయుడు" సినిమాలో ఒక పాటలో సీతారామరాజుగా కనిపించి తన ముచ్చట తీర్చుకున్నారు.
ఎన్ టి రామారావు గారు తాను అల్లూరి సీతారామ రాజు సినిమా కోసం రికార్డు చేయించిన పాట 1968-69 లలో బాగానే వినపడేది. తరువాత తరువాత మరుగున పడిపోయింది. అలనాటి ఆ పాట, (సినిమాలోకి ఎక్కని) ఈ కింది ప్లేయర్ ద్వారా వినవచ్చు .

సాహిత్యం పడాల రామారావు, గానం ఎం ఎస్ రామారావు , ఘంటసాల, పిఠాపురం, మాధవపెద్ది , సంగీతం టి వి రాజు


పై పాట సేకరణ శ్రీ చంద్రశేఖర శర్మ మరియు శ్యాం నారాయణ గార్లు

సర్దార్ పాపారాయుడు సినిమాలో ఎన్ టీ ఆర్ అల్లూరి సీతారామరాజుగా కనిపించిన పాటను కూడ వినండి.


*

14 వ్యాఖ్యలు:

 1. ఇంత అరుదైన పాటను అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలండీ! ఈ పాట రచన, సంగీతం, గాయకుల పేర్లు కూడా ఇవ్వగలిగితే బాగుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. వేణు గారి అభిప్రాయమే నాదీను. గొప్ప కలెక్షన్ సార్. ధన్యవాదాలు మీకు..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చాలా బాగుంది.. అల్లూరి పేరు చెప్తేనే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. ఈనాటి రాజనాయకులకి కనీసం నెలకోసారి ఇలాంటి వాళ్ళ చరిత్ర చూపిస్తే (బలవంతంగా) కాళ్ళూ చేతులూ కట్టేసి...

  ప్రత్యుత్తరంతొలగించు
 4. The song was shared on Ghantasala/Project Ghantasala and ghantasala.info sites in the past. So, where is the acknowledgement?

  Regards,
  Sreenivas

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @Sreenivas Paruchuri.

  I never claimed that I am the first person to post the song in public domain, nor did I give link to the website you are informing. I am not aware that the same song was in another blog/web site.

  If you go through my blog and look around, you will realise that I am the first person to given acknowledgement for any piece I use which is not mine.

  In the instant case also you can see underneath the player playing the song the names of Gentlemen who collected and provided the song to me.

  I would have been happy to receive any further input on the song giving further details of its background etc.rather than your present comment.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @Voleti. It would be a futile attempt. The present day politicians (capital letter for this word not intended) are beyond repair.

  We deserve such people only, because we never care to show interest and take voting as our primiary responsibility, before claiming any of the tiniest right.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. K.శివ రామ ప్రసాద్ గారూ!
  గంటి లక్ష్మీ నర సింహ మూర్తి గారి & నాన్నగారు కీ.శే.పండిత గంటి సూర్యనారాయణ శాస్త్రిగారు వివరాలను వీలైతే చెప్ప గలరా?
  అసాధ్యుడు - సినిమాలో వాణిశ్రీ, కృష్ణ -లు వేసిన "అల్లూరి సీతా రామ రాజు" స్టేజీ డ్రామా ఉన్నది;
  వీలైతే ......

  ప్రత్యుత్తరంతొలగించు
 8. కుసుమ గారూ, అసాధ్యుడు సినిమాలో అల్లూరి సీతారామరాజు నాటిక ఉన్నదా! అద్భుతమైన విషయం చెప్పారు. వీలైతే ఆ పాటను ఈ మైలు ద్వారా పంపగలరు.

  vu3ktb@gmail.com

  మీరు చెప్పిన పెద్దవారి వివరాలు తెలియదు. కాని ప్రయత్నించి కనుక్కోవచ్చు. నా ప్రయత్యం చేశ్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. శివ గారూ !
  చాలా మంచి విషయాలు రాస్తున్నారు. ధన్యవాదాలు.
  మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు
  - శి. రా. రావు
  శిరాకదంబం

  ప్రత్యుత్తరంతొలగించు
 10. శివరామ ప్రసాద్ గారూ ! చాలా బాగుంది. ఇలాంటివి పరిచయం చేయడంలో తెలుగు బ్లాగర్లలో నాకు తెలిసీ మీకు మీరే సాటి. నాకు నచ్చిన సినిమా అల్లూరి సీతారామరాజు. కృష్ణ అసాధ్యుడులో కూడా అల్లూరి రోల్ ఉంది. బహుశా కృష్ణ కూడా ఈ సినిమాను మళ్లీ ఇంత మంచిగా తీయలేడేమో! ఘంటసాల మాస్టారు ఆఖరుగా పాడినది కూడా ఈ సినిమాకే ననుకుంటా! ఎక్కడో చదివిన గుర్తు. ఎం.టీ.ఆర్ అల్లూరి సీతారామరాజు తీద్దామని ప్రయతింస్తుంటే పరచూరిగోపాల కృష్ణ వారించి ఒక్క సారి కృష్ణ గారి సీతారామరాజు చూడండి. అది చూశాక కూడా తీద్దామంటే అప్పుడు చూద్దాం కథ సంగతి అన్నారట. అప్పటి వరకూ కృష్ణతో మాట్లాడని ఎం.టీ.ఆర్ బ్రదర్ మీ సినిమా చూపాలి నాకు అంటే కృష్ణ ఆయనకు ప్రత్యేక షో వేయించారట. అది చూసి ఎన్‌.టీ.ఆర్ బ్రదర్ మేను ఇక సీతారామరాజు సినిమా ఆలోచన మానుకుంటున్నాను అన్నారట. అయితే సీతారామరాజు జనరల్ గా లాగూ వేసుకునేవాడనీ, సినిమాలో హీరోయిజం కోసం పంచె కట్టారనీ అంటారు. రెండో పాట వివరాలూ ఉంచండి. సర్దార్ పాపారాయుడు లో పాటకు సంబంధించి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కొండలరావుగారూ.

   మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మరికొన్ని విషయాలు తెలియచేశారు.

   పరుచూరి గోపాలకృష్ణ గారు సినిమాల్లోకి వచ్చినది 1980 దశకం మొదటి రోజుల్లో. ఆయన సోదరుడు శ్రీ పరుచూరి వెంకటేశ్వర రావుగారు నాకు బాగా సీనియర్ కొలీగ్. ఇద్దరం కలిసి శ్రీశైలం ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్ లో ఒక ఆఫీసు పని మీద మూడు నెలలు ఉండి కలిసి పనిచేశాము. గోపాలకృష్ణగారు ఎన్ టి రామరావు తో సీతారామరాజు సినిమా వచ్చేప్పటికి ఆయనకు చెప్పేంత పరిచయం ఉన్నదా! సీతా రామ రాజు సినిమా నాకు గుర్తుండి 1974 లో అనుకుంటాను వచ్చింది.

   తొలగించు
  2. ప్రసాద్ గారూ !
   నేను ఇది విన్నది కృష్ణ మాటల్లోనో , పరచూరి గోపాలకృష్ణ మాటల్లోనో సరిగా గుర్తు లేదు. కానీ కృష్ణ సినిమా వచ్చాక కూడా ఎన్.టీ.ఆర్ సీతారామరాజు తీద్దామని అనుకున్నమాట వాస్తవం.

   తొలగించు
 11. స్వర్గీయ ఎన్.టి.ఆర్.అల్లురి సీతారామరాజు సినిమా తీయాలని 1954లో జయసింహ సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఎన్.ఏ.ట్.వారి తదుపరి చిత్రం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు అని ప్రకటించి పడాల రామారావు గారితో స్క్రిప్టు రాయించారు కూడా.ఒక పాట కూడా రికార్డ్ చేయించారు.కానీ ఎందుకని ఆ సినిమా తీయడం ఆగిపోయిందో ఇప్పటి వరకు ఎక్కడా ఎవ్వరూ చెప్పలేదు.ఏ పత్రికా రాయనూలేదు.
  ఒ.వెంకటేశ్వరరావు.9490099789

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.