ఒకప్పుడు రేడియో మాత్రమె ఒక సమాచార సాధనంగా ఉన్న అద్భుతమైన రోజులలో, ప్రజలకు వార్తలు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ప్రజలలో ఒకరిగా స్థానం సంపాయించుకున్న వారు వార్తా చదువరులు (News Readers) . రేడియో మనుషులుగా ఎంతగానో ప్రాచుర్యం పొందినవారిలో న్యూస్ రీడర్లది ప్రధమ స్థానం. ఆ విధంగా తెలుగులో ఇటు ప్రాంతీయ కేంద్రాలైన విజయవాడ, హైదరాబాదు నుండి వచ్చే ప్రాంతీయ వార్తలు, అటు హస్తిన నుమ్డి నుండి వచ్చే జాతీయ వార్తలు ప్రజలకు కావలిసిన విశేషాలను తెలియ చెప్పేవి.
ఆ వార్తలు చదివిన అనేకమంది న్యూస్ రీడర్ల గురించిన దొరికిన కొద్ది సమాచారం, ఫోటోలు, మన బ్లాగులో సహ రచయిత శ్రీ సుధామ గారు పంపారు. ఆ వివరాలు మీకోసం:
రేడియోలో ఢిల్లీ వార్తలు చదవి ఆకాశవాణి శ్రోతలకు పరిచితులైన కొందరు:
ఆ వార్తలు చదివిన అనేకమంది న్యూస్ రీడర్ల గురించిన దొరికిన కొద్ది సమాచారం, ఫోటోలు, మన బ్లాగులో సహ రచయిత శ్రీ సుధామ గారు పంపారు. ఆ వివరాలు మీకోసం:
రేడియోలో ఢిల్లీ వార్తలు చదవి ఆకాశవాణి శ్రోతలకు పరిచితులైన కొందరు:
శ్రీ అద్దంకి మన్నార్ : పుట్టింది:1934/విజయవాడలో అనౌన్సర్ గా చేరింది:1959/1977లో 2 సంవత్సరాలు మాస్కోలోతెలుగు వార్తలు చదివారు
శ్రీ కొత్తపల్లి సుబ్రహ్మణ్యం: చేరింది:1954 ఫిబ్రవరి24.1956 నుండి 13 సంవత్సరాలు డిల్లీ న్యూస్ రీడర్ గా చేసి 1966 లో హైదరాబాద్ వచ్చారు
శ్రీ.దుగ్గిరాల పూర్ణయ్య:జననం:15.4.1936.1964 లో న్యూస్ రీడర్ గా చేరారు ఢిల్లిలో.1994 ఏప్రిల్ లో రిటైరయ్యారు
శ్రీ కందుకూరి సూర్యనారాయణ జననం:29 జూలై 1936.1962 లో ఢిల్లీ వార్తావిభాగం లొచేరారు.మాస్కోలోనూ చేసారు. ప్రముఖ కవి కందుకూరి రామభద్రరావు గారి కుమారుడు.
శ్రీ డి.వెంకట్రామయ్య:హైదరాబాద్ ప్రాంతీయ విభాగం లో ప్రముఖ న్యూస్ రీడర్.1963 నవంబర్ లో మొదట అనౌన్సర్.ఫ్రముఖ కథకులు. నాటకరచయిత.2010 రావిశాస్త్రి పురస్కార గ్రహీత. పంతులమ్మ సినిమా మాటల రచయిత.వార్తా పఠనానికి పేరుపొందారు
శ్రీ ఏడిద గోపాలరావు 1966 నుండి 1996 వరకూ ఢిల్లిలో వార్తలు చదివారు.మాస్కోలో 4 సంవత్సరాలు తెలుగు వార్తలు చదివారు.మంచి నటులు.గాంధీ వేషానికి పెట్టిందిపేరు
ఒకప్పుడు రేడియోలో వీళ్ళలో కొంతమందితో సన్నిహిత సహచరుడిగా పనిచేసినప్పటికీ వారి ఫోటోలు నా వద్ద కూడా లేవు. ఇంత శ్రమ తీసుకుని వాటన్నిటినీ ఒక్కచోట చేర్చిన మీకు ధన్యవాదాలు. తిరుమలశెట్టి శ్రీరాములు గారి ఫోటో కూడా వుందా? వుంటే దయచేసి దాన్ని కూడా ఇందులో జతపరచగలరు - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండిధన్యవాదాలు శ్రీనివాసరావు గారూ. ఆ ఫొటోలన్నీ కూడ సుధామ గారు పంపించారు. ఈ మధ్యనే ఎ బి ఆనంద్ గారిని కలిసే అదృష్టం కలిగింది. వారితో మాట్లాడిన ఆ గంట గురించి త్వరలో ఒక వ్యాసం వ్రాసి మీకు తెలియచేస్తాను.
రిప్లయితొలగించండితిరుమలశెట్టి శ్రీరాములు గారి గురించి చాలా వెతికాను. ఈ వ్యాఖ్య వ్రాయటానికి ముందుకూడా వెతికాను. కాని ఆయన ఫొటో ఎక్కడా లేదు. ఆయన దూరదర్శన్లో ఆ లైట్ల వెలుగుకి కళ్ళు చికిలిస్తూ తన అద్భుతమైన గొంతుతో వార్తలు చదవటం నా కళ్ళ ముందు కదులుతున్నది. 1983 లో తెలుగుదేశం విజయ పరంపర జరుగుతున్నప్పుడు, వరుసగా వచ్చిన ఆకాశవాణి న్యూస్ బులెటిన్లు అన్నీ రికార్డు చేశాను. కాని ప్రమాద వశాత్తూ చెరిగిపొయ్యాయి. అప్పుడు వార్తలు చదివిన వారిలో శ్రీరాములు గారు, సురమౌళిగారు కూడా ఉన్నారు.
ఆకాశవాణి వారు తలుచుకుంటే అంటె ఆ గుమాస్తలు వాళ్ళ దగ్గర ఉన్న బీరువాలు, ఫైళ్ళు వెతికితే ఇప్పటికైనా సరే సమాచారం మొత్తం దొరుకుతుంది, ఫొటోలతో సహా. కాని ఎవరికి ఉన్నది ఓపిక. ఆకాశవాణి పేరు ప్రతిష్టలు తీసుకు వచ్చిన కళాకారులను పూర్తిగా విస్మరించటం ఆకాశవాణి చేసిన ఘోరమైన తప్పిదం. ఈ కింది లింకు నొక్కి నేను ఆకాశవాణి వారికి వ్రాసిన బహిరంగ లేఖ చదువగలరు. మీకు వీలైతే మీ పలుకుబడితో ఈ విషయాలు తెలియవలసిన వారి దృష్టికి తీసుకు రాగలరు.
http://saahitya-abhimaani.blogspot.in/2010/10/blog-post_03.html