10, జనవరి 2011, సోమవారం

"కొత్తపల్లి" పత్రికలో కీర్తన పాట


మా తమ్ముడు పూర్ణ శ్రీనివాస్ చిన్న అమ్మాయి చిరంజీవి లక్ష్మీ కీర్తన చక్కటి గాయనిగా తయారవుతున్నది. మంచి సాధన చేస్తూ, పాట పాడటంలో మంచి స్థాయి చేరటానికి కృషి చేస్తున్నది. కీర్తన పాట విని "కొత్తపల్లి" పిల్లల పత్రిక వారు తమపత్రికలో కీర్తన ఫోటో వేసి పాడిన పాటను వారి అక్టోబరు 2010 సంచికలో ప్రచురించారు. పైన ఉన్న బొమ్మలో ఆ ప్రచురణ చూడవచ్చు. కీర్తన పాడిన పాట పూర్తి పాఠం ఈ కింద ఇవ్వబడింది.

ఎందుకో.. ఎందుకో?

వసంతురాకఎందుకో
'ఎందుకో..?'

ఆశలన్ని దూసి పోసి
అలమటించే మల్లె తీవెకు
క్రొత్త చివురులు పల్లవింప,
జీవమొసగేటందుకే
'ఎందుకో..?'

మూగవోయెను తనకు గళమని
మూలవగచే కోయిలమ్మను
మావి గుబురులు చేర బిలిచి
గళము మీటేటందుకే
'ఎందుకో ..?'

మధువు కరవై వ్యథను చెంది
తరువు తరువు తెరుగు తేటికి
వేప తేనియ విందు చేసి
వెతను బాపేటందుకే
ఎందుకో, ఎందుకో..?
వసంతురాకఎందుకో
'ఎందుకో..?'

పాట రచన మరియు సంగీతం శ్రీ వారణాసి వెంకటరావు

పై పాట కీర్తన గొంతులో ఆర్కెస్ట్రా తో పాటుగా రికార్డు చేసి, "కొత్తపల్లి" పత్రికవారు వారి వెబ్ సైటులో ఉంచారు. ఈ కింది లింకు నొక్కి ఆపాటను చూడవచ్చు, విననవచ్చు కూడ.

"కొత్తపల్లి" పత్రికలో కీర్తన పాట


2 వ్యాఖ్యలు:

  1. శివ గారూ !
    చి. కీర్తన పేరు సార్థకం చేసుకుంది. హాయిగా పాడింది. నా ఆశీస్సులు అందించండి.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. మాస్టారు, చిన్నారి చాలా చక్కగా ఆలపించింది.. బ్లాగ్ లో పెట్టినందుకు చాలా సంతోషం..మీ బ్లాగు బహు బాగుగా ఉన్నది.. ధన్యవాదాలు..

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.