6, సెప్టెంబర్ 2011, మంగళవారం

కాపీ కొట్టటమూ ఒక కళే!

PICTURE COURTESY BUZZLE.COM CLICK HERE

మనకున్న అరవై నాలుగు కళల్లో కాపీ కొట్టటం ఒక కళ కానే కాదు. అప్పట్లో ఈ కాపీలు కొట్టటం అనేది పాపం వాళ్ళకి తెలియదు. కానీ ప్రపంచం పెరుగుతున్న కొద్దీ, సాంకేతిక పరిజ్ఞానం అభివృధ్ధి చెందే క్రమంలో, కొత్త కొత్త కళలు వచ్చి పడినాయి. అలా కొత్తగా పరిచయం అయిన వాటిల్లో కాపీ కొట్టటం ఒక కళగా మనవాళ్ళు ముఖ్యంగా సినిమా వాళ్ళు ఎంతో పెంచి పోషిస్తున్నారు. కథలూ కాకరకాయలూ, హాస్యం గీస్యం, సీన్లకి సీన్లు అలా కాపీ పేస్ట్ చెయ్యటం ఈ సినిమా "కళలో" అనాదిగా గుట్టుగా జరిగిపోతూనే ఉన్నది. తెలియని వాళ్ళదగ్గర ఇదంతా తమ ప్రజ్ఞే అని కాలెరెగరెయ్యటం, తెలిసిన వాళ్ళు చెబితే విననట్టు ఊరుకోవటం ఆ కళలో భాగాలే. ముఖ్యంగా ఎక్కడో స్పానిష్ ట్యూనులో, లాటిన అమెరికా సంగీతమో రహస్యంగా టేపులో, రికార్డులో సంపాయించి, వాటిల్లో ఉన్న సంగీతపు విరుపులను మన పాటల్లోకి ఎక్కించటం అంత తేలికైన పనేమీ కాదు. అందుకనే కాపీ కూడ ఒక కళే అన్న నిర్ధారణకు రావటం తప్పనిసరి అయ్యింది.

మచ్చుకి, చెప్పాలంటే అనేకం ఉన్నాయి కానీ, అప్పుడెప్పుడో 1970 లలో స్వీడన్ కు చెందిన "అబ్బా" (నొప్పెడితే అరిచే అరుపు కాదు, ఆ సంగీత బృంద నామధేయం-వాళ్ళకు ఆ పేరెలా వచ్చిదో మరోసారి)గ్రూప్ పాడిన అనేక పాటల్లో "చికిటీట" ప్రపంచ ప్రసిధ్ధి పొంది దశాబ్దాలు దాటిపోయిందికదా, ఇప్పుడెవరు కనుక్కుంటారులే అన్న దీమాతో, మన టోలీవుడ్ వారు ఆ పాటలోని గమకాన్ని, తెలుగైజ్ చేసిపారేశారు. ఈ విషయం, మా తమ్ముడు రాధాకృష్ణ ఇట్టే పసిగట్టి, తెలుగు, ఆంగ్ల పాటలను ఎవరూ తెలుసుకోలేనంత చక్కగా కలిపి నాకు పంపాడు.

సరే ఆంగ్లం లో "చికిటీటా" ఐతే తెలుగులో పాటేమిటి అనేకదా సందేహం. ఈ మధ్యనే వచ్చిన "వినాయకుడు" సినిమాలో "సరదాగా ఈసమయం" అనే పాట.

కాపీ కళ కాదు అనుకునే వాళ్ళు తప్పనిసరిగా వినవలిసిన పాట ఇది. చూడండి ఎంత అద్భుతంగా తమ కళా ప్రావీణ్యం చూపించారో


అబ్బా గ్రూప్ పాడిన "చికిటీట" పాట సాహిత్యం

Chiquitita, tell me what's wrong
You're enchained by your own sorrow
In your eyes there is no hope for tomorrow
How I hate to see you like this
There is no way you can deny it
I can see that you're oh so sad, so quiet

Chiquitita, tell me the truth
I'm a shoulder you can cry on
Your best friend, I'm the one you must rely on
You were always sure of yourself
Now I see you've broken a feather
I hope we can patch it up together

Chiquitita, you and I know
How the heartaches come and they go and the scars they're leaving
You'll be dancing once again and the pain will end
You will have no time for grieving
Chiquitita, you and I cry
But the sun is still in the sky and shining above you
Let me hear you sing once more like you did before
Sing a new song, Chiquitita
Try once more like you did before
Sing a new song, Chiquitita

So the walls came tumbling down
And your love's a blown out candle
All is gone and it seems too hard to handle
Chiquitita, tell me the truth
There is no way you can deny it
I see that you're oh so sad, so quiet

Chiquitita, you and I know
How the heartaches come and they go and the scars they're leaving
You'll be dancing once again and the pain will end
You will have no time for grieving
Chiquitita, you and I cry
But the sun is still in the sky and shining above you
Let me hear you sing once more like you did before
Sing a new song, Chiquitita
Try once more like you did before
Sing a new song, Chiquitita
Try once more like you did before
Sing a new song, Chiquitita

1 వ్యాఖ్య:

  1. మీరు చెప్పింది నిజం...కాని పాట బాగుంది కదా వినడానికి,కాకుంటే వాళ్ళు నిజాయితి గ ఇదే నేను పలానా భాష నుంచి తీసుకున్నాను అంటే గౌరవం గాను..యా భాష గురించి మనం తెల్సుకునే వీలు ఉంటుంది...చత్రపతి సినిమా లో బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఒక కొరియన్ వీడియో game లోడి ..దాన్ని రాజమౌళి గారు గౌరవం గ ఒప్పుకున్నారు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.