11, అక్టోబర్ 2011, మంగళవారం

రేడియోలో శ్రీ పేకేటి శివరాం


 పేకేటి  శివరాం గారి గురించి ఇప్పటి తరం వారి తెలిసి ఉండటం కష్టం. ఆయన తెలుగు సినిమా మొదటి తరం మనిషి.

వద్దంటే డబ్బు చిత్రంలో ఎన్ టీ ఆర్, అల్లు లతో   పేకేటి. 

ఆయన తెలుగు సినిమాకు చేసిన అమోఘమైన సేవ గురించి  పెద్దగా తెలియదు. ఒక రికార్డింగ్ కంపెనీ అధికారిగా, అంతకు ముందు, పనికి రాని గాత్రంగా తిరస్కరించబడిన ఒక గాయకుని పాటను తన స్వంత నిర్ణయంతో ఒక రికార్డ్ వదిలారు. ఆ తరువాత అన్నీ  రికాకార్దులే ఆ గాయకునికి. చొరవ తీసుకుని పేకేటి అవకాశం ఇచ్చిన ఆ గాయకుడి మరెవరో కాదు, శ్రీ ఘంటసాల వెంకటే శ్వరరావు  . 


పేకేటి 1990 దశకంలో ఆకాశవాణి హైదరాబాదు కేద్రం నుంచి ప్రత్యెక జనరంజని సమర్పించారు. ఆ జనరంజని మొదటి భాగం వినండి. 



ఈ  భాగం లో  పేకేటి గారు , ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ ఆదినారాయణ రావుగారితో తనకున్న అనుబంధం, ఇల్లరికపు అల్లుళ్ళ గురించి, గులేబకావళి కథ సినిమాకు శ్రీ సి నారాయణ రెడ్డిగారు సంబాషణలు వ్రాసిన విషయం (నాకు ఇప్పుడే తెలిసింది) చెప్పుకొచ్చారు. 

అప్పటి కాలపు విషయాలు వింటూ  ఉంటే చాలా హాయిగా ఉంటుంది. గత కాలపు  స్మృతులు, అప్పటివరకూ మనకు నిగూధంగా ఎక్కడో నిక్షిప్తమైన జ్ఞాపకాలు బయటకు వస్తాయి. ఆంగ్లంలో  "నోస్టాల్జియా" అనే మాట ఉన్నది. ఈ మాటకు సమానమైన తెలుగు మాటే ఇంత రకూ  ఎవరూ "వండి" నట్టు లేదు. సరైన గ్రాంధికం దొరక్క కాబోలు! ఈ పాత రికార్డింగులు వింటూ ఉంటే ఆ నోస్టాల్జియానే కలుగుతుంది.

ఈ  కార్యక్రమంలో  ఉన్న  గొప్ప విషయం ఎక్కడా కూడా వ్యాపార ప్రకటనలు , ఇంటర్వ్యూ  చేస్తున్నామన్న సాకుతో అవాకులూ చెవాకులూ వాగే ఎంఖర్లు లేకుండా చెయ్యటం. అది రికార్డ్ చేసి మనకు అందించిన వారి గొప్పతనం. హాయిగా ఒక కార్యక్రమం వింటూ ఉంటే, పరమాన్నంలో ఇంగువ లాగా ప్రకటనలు ,  పులిహోరలో పలుకు రాయిలా ఎంఖర్ల  మిడి మిడి  జ్ఞానపు  వాగుడూ  చీదర  కలిగించి  వాళ్ళు  చెప్పే వస్తువు ఎన్నటికీ కొనకూదన్న ప్రతిజ్ఞ పట్టేట్టు చేస్తాయి . ఈ కార్యక్రమం వింటూ ఉంటే అటువంటి భీషణ ప్రతిజ్ఞలు చెయ్యాల్సిన అవసరం లేదు. 

ప్రకటనలు తీసిపారేసి మనకు అందించిన  వారి దృష్టికోణాన్ని అభినందింఛి తీరాలి. ఆ అజ్ఞాత వ్యక్తి  కి మరొక్కసారి కృతజ్ఞతలు . సేకరించి అందించిన శ్రీ శ్యాం గారికి అనేకానేక ధన్యవాదాలు.

మిగిలిన భాగాలు వీలునుబట్టి అతి త్వరలో మీకు అందించే  ప్రయత్నిస్తాను.  










4 కామెంట్‌లు:

  1. శ్రీ పేకేటి శివరం గారి గురించి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఈ ప్రోగ్రాం ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. రావ్ గారూ,

    శివరాం గారు హాస్య నటుడే కాదు, మంచి దర్శకుడు, సినిమా తియ్యటానికి ఉండవలసిన అనేక హంగులు కలవాడు. తెర వెనుకనుండి అనేక సినిమాలు నడిపించిన వాడు.

    ఇలాంటి వారు మాట్లాడుతున్నప్పుడు సమయ నిబంధన విధించి ఆపకూడదు. వాళ్ళని ఎంతసేపు మాట్లాడ గలిగితే అంతా మాట్లాడనివ్వాలి. ప్రోగ్రాం లో ఎడిట్ చేసి వారి మాటలు తగ్గించి వేసినా, ఆకాశవాణి వారి వెబ్ సైటులో, ప్రోగ్రామ్లో నుండి తోలగించినవి ఉంచాలి. కాని, ఆకాశవాణి వారికి అంతటి ఆలోచనా, అయ్యో రామ!! అసలు ఈ రికార్డింగు వాళ్ళ దగ్గర ఇప్పుడు కావాలంటే దొరుకుతుందా? టేపులు పొదుపు ఉద్యమంలో ఆణిముత్యాల వంటి వాటి మీద మరొక సారి రికార్డ్ చేసేయ్యటం, దశాబ్దాల తరువాత, మేము మా కార్యక్రమాలను డిజిటైజ్ చేస్తాం మీరా మీరా అంటూ బజార్న పడి వాళ్ళ పాత కార్యక్రమాల కోసం ప్రజల దగ్గర నుంచి సంపాయించే పాకులాట, ప్రెస్ ప్రకటనలు. ఆకాశవాణి తమ ద్వారా ప్రసార మైన అద్భుతమైన కార్యక్రమాలను పదిలపరచటం లో విఫలం చెందినది అని చెప్పక తప్పదు. దానికి కింది లెవెల్లో ఉన్న వాళ్లకి ఉన్న కారణాలు వాళ్లకి ఉన్నాయి. కాని అప్పటి పై అధికారులలో ముందు చూపు అనేది లేకుండా తీసుకున్న చర్యలవల్ల ఆకాశవాణి ఒక అరవై సంవత్సరాల చరిత్ర చేజేతులా పారబోసుకున్నది.

    రిప్లయితొలగించండి
  3. Bharadwaj,

    Please thank the unknown person who recorded the AIR programme and preserved for years, thank the person (may be the same great man) who digitized the recording of the transmission and preserved and finally put it in public domain.

    Finally Thank Shri Shyam Narayana who collected the recording and provided to us.

    I just put it in the blog thats all, which in itself is not a great work as compared to those mentioned above.
    I never claim that I am alone doing this "single handedly" as "some" try to claim.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.