24, మార్చి 2013, ఆదివారం

పొద్దు గడవని వారు-పొట్ట గడవని వారు


**********************************
ప్రభాత వేళ, ఏ టి వి
చూసినా ఏమున్నది ఠీవి
ఎందెందు వెతినా అదందే కలదు! ఏమది?
పొద్దుపోని వారందరి వెర్రి కూతలా!  కాదు?
కాదు? సుమా మరంతకంటే మించినదదేదో!!
కచాకచి ముష్టాముష్టి  నిషిధ్ధమని,
మాటల బాణాలు, వాడి, వాడేసిన మాటలనీ
ఊదేసి, వాగేసి, అలసి-సొలసినవాణ్ణి, 
మళ్ళీ  మాట్లాడమంటే ఇంకెక్కడైనా సరే (అసెంబ్లీలో)  వాక్కవుటే నయమంటాడు,  ప్లెకార్డు తో నుంచోవటమే బెటరంటాడు కాని    మనకోసం,  అవును మనకోసమే
మాట్లాడతాడా?   మరందుకేనుట,  పోడియాలయ్యాయహో
ట్రాఫిక్ ఐలండ్లు

టి వి లలో  గోల చూసి-చూసి,  గ్రామసింహాలు   సైతం  తమ మాతృభాష పరిరక్షణకు నడుంకట్టటం
విడ్డూరమవ్వలేదు, కుక్కలకొక భాష!!
మనుషులకొక భాషా?? ఎందుకది!!
అనుకుంటున్న మనుషలను చూసి
వెర్రెక్కిన భైరవ దేవుడికి
బొడ్డు  చుట్టూ ఇంజెక్షన్లెవరిస్తారు! !
**********************************

ఎక్కడైతేనేమి పనికిరాని మాటలు, ఏ టివి  స్టుడియోలొనైనా  ఏమున్నది వినటానికి రణగొణ ధ్వని తప్ప , ఒకడిమాట మరొకడు చొరనిస్తే కదా.            

అసలే రౌడీ, ఆపైన నాయక ముసుగు, మీడియా ముందున్నాడు, పైగా లైవ్ టెలికాస్ట్‌ట మరిక వినపడేది ఏమిటి శునక గార్ధబ యుగళం  తప్ప (కుక్కలు గాడిదలు క్షమించు గాక) . 

దీంట్లో మళ్ళీ యాంఖరెందుకో తన ధోరణిలో  ఎవ్వరినీ పట్టించుకోకుండా తాను వాక్కుంటూ పోవటానికా? లేక తమ చానెల్ పార్టీ  వాళ్ళను మాత్రమే అరవనివ్వటానికా (ఇవ్వాళ మాటలెవరు మాట్లాడుతున్నారు కనుక).

పొద్దున్నే "పొద్దు జరగని" వారందరూ కలిసి టి విల్లో పడి  నానా గోల చేస్తూ "పొట్టగడవని"  వారి ఉపాధికి గండి కొట్టి మరీ (ఆ కాసేపూ కరెంటిచ్చి మరీ) సమయమంతా వృధా చేసేస్తున్నారు. పొద్దున్న ఈ టి వి లకు తగలేసే కరెంటు వాడకుండా ఉంటె, ఎక్కడైనా పొలాలకు నీళ్ళు పెట్టుకోవచ్చు, మరెక్కడైనా ఏదైనా పరిశ్రమ నడిచి నలుగురు పొట్టగడవని వారికి నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళ్ళే  అవకాశం వస్తుంది.  పొద్దుగడవని వారే కొంచెం, కొద్దిగా మనసు చేసుకుని ఆలోచించాలి. అలోచనా అదేమిటి ఎలా ఉంటుందండీ!!!!!?.....అలా అనుకుంటే చేసేదేమున్నది కనుక!!??

ఎందుకొచ్చిన ఈ చర్చలు?  ప్రజల సమయం  ఎందుకు వృధా చెయ్యటం, విలువైన  విద్యుత్  ను పొదుపుగా వాడుకోవటం కోసం, పొద్దునపూట టివిలను ఈ వేసంకాలం అయ్యేవరకూ బందుచేస్తే, పొట్టగడవని అనేకమందికి ఇంత ఉపాధి దొరుకుతుంది. పొద్దు గడవని వారు పుస్తకాలు చదువుకుంటె పొయ్యేదేమీ లేదు, మీడియాకు యాడ్ ఇంకం తప్ప.  అది పోయినందు వల్ల మన యెకానమీ ఏమీ కూలిపోదు పైగా ఉపయోగపడేపనులు జరిగి ఆర్ధికాభివృధ్ధి  జరిగే అవకాశమే ఎక్కువ.  

2 కామెంట్‌లు:

  1. ఇవాళ మన వార్తా చానళ్ళలో వొచ్చే గోలంతా ప్రజల కోసమే అని నమ్మబలికి, ప్రజావసరాల వార్తలని మటుకు చూపించకుండా ....... కేవలం "రాజకీయ ప్రాయోజిత వార్తలకే" ప్రాధాన్యతని ఇస్తున్నాయి మన మిడియాలు.... మీరు చెప్పినట్లుగా ఈ టివిలకి వాడే కరెంటుని మరేదైనా ప్రజావసరాలకి వాడుకుంటే నలుగురి కడుపైనా నిండుతుంది. పైగా టివిలలో ప్రకటనలు రాకపోతే దానివారా కొన్ని వస్తువుల ధరలైనా తగ్గుతాయి కూడా......

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.