19, ఫిబ్రవరి 2015, గురువారం

ప్రముఖ కార్టూనిస్ట్ రాగతి పండరి హఠాన్మరణం

  పై బొమ్మను ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారు పండరి గారి ఆత్మ కథ పుస్తకం కోసం వేసినది, ఈ రోజు ఇలా    ఆవిడ మరణ వార్తకు వాడవలిసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు 

బ్రేకింగ్ న్యూస్ మనం ఎక్కడ ఉన్నా మన్ని వెంటాడుతూనే ఉంటుంది అని ఈరోజున అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. గత నెల రోజులుగా ఫేస్ బుక్ లో (కొత్త కదా) ఎక్కువ సమయం గడుపుతున్నాను. రాజమహేంద్రవరం  నివాసి, ప్రముఖ కార్టూనిస్టు, సహ చం. పి., మిత్రుడు ఏం వి అప్పారావు గారు (సురేఖ పేరుతో కార్టూన్లు వేస్తారు) తన ఫేస్ బుక్ లో ఒక విషాద వార్త గురించి వ్రాసినట్టు గమనించి అటుగా  వెళ్ళాను. పిడుగులాంటి వార్త,  ప్రముఖ కార్టూనిస్ట్ రాగతి పండరి గారు మరణించారు అని.  చాలా బాధ కలిగింది.

వార్త తెలిసి చాలా సేపు ఇది ఎలా జరిగింది అని బాధపడి, వెళ్ళిపోయిన మంచి కార్టూనిస్టు రాగతి పండరి గారికి నివాళిగా నా ఫేస్ బుక్ లో ఒక ఆల్బం తయారు చేశాను. ఈ కింది లింకు నొక్కి  చూడవచ్చు.


నాకుఆవిడ కార్టూన్లతొనే ఎక్కువ పరిచయం కాని  రాగతి పండరి గారితో  పరిచయం అతి కొద్ది.  ఒకసారి ఆవిడ గురించి వ్యాసం వ్రాయటానికి వివరాలు అడగటానికి ఫోనులో మాట్లాడాను. ఆవిడ వెంటనే నేను అడిగిన వివరాలు మెయిలు ద్వారా పంపారు. కార్టూనిస్టుల  గురించి వ్యాస పరంపర వ్రాస్తున్న రోజుల్లో జరిగిన విషయం. రాగతి పండరి గారి గురించిన వ్యాసం ఈ కింది లింకు నొక్కి చదువ వచ్చు:



రాగతి పండరి గారికి బాపూ గారు ఇచ్చిన సలహా ఈ కింది బొమ్మలో చూడండి 

 క్లిక్ చేసి చూస్తె బొమ్మ పెద్దది అవుతుంది, సులభంగా చూడవచ్చు 

 ****************************************************
రాగతి పండరి గారి కుటుంబ సభ్యులకు, తోటి కార్టూన్ అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను
****************************************************

స్వర్గంలో ఎదో జరిగింది! అక్కడ హాస్యానికి ముఖం వాచినట్లున్నారు, వరుసగా చూడండి, ముళ్ళపూడి వెంకటరమణ, ఎ వి యస్, మల్లి కార్జున రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బాపు, ఎం ఎస్ నారాయణ, ఇవ్వాళ రాగతి పండరి. ఓయి భగవంతుడా మాకు కూడా హాస్యం కావాలి, తీసుకెళ్ళిన వాళ్ళను ఎలాగో తీసికెళ్ళావు, ఇక ఆపవయ్యా బాబూ. ఇక్కడ నవ్వటం చేతకానివాళ్ళు రోజు రోజుకీ పెరిగి పోతున్నారు. ఇంకెవర్నీ తీసుకెళ్ళకు.

రాగతి పండరి మరణ వార్త టి వి ల్లో - యు ట్యూబ్ నుంచి
టి వి 5 లో వచ్చిన న్యూస్


సాక్షి టి వి


10 టి వి


ఈ టెన్ టి వి ఎవరండీ! మల్లిక్ కార్టూన్ ను రాగతి పండరి కార్టూన్ గా తమ న్యూస్ లో చూపించేశారు





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.