13, మే 2016, శుక్రవారం

యు ట్యూబ్ కు తెలుగు ఏమిటి!?

యు ట్యూబ్ కు తెలుగు ఏమిటి!?


నాకు తెలుసు మీరు అదే అంటారని. ఏది! అదే మీకూ తెలుసు నాకూ తెలుసు. నిజానికి యు ట్యూబ్ కు ఆ పేరు ఎలా వచ్చిందని మీ అభిప్రాయం!
యు అంటే మీరు అనుకున్నదే "మీ" లేదా "మీ యొక్క" ఇక్కడవరకూ కూడా ప్రమాదం లేదు. ప్రమాదమల్లా ఆ తరువాత ముక్కతోనే! ట్యూబ్ అంటే గొట్టం అనె కదా! ఏవో దీపావళి దినుసులు సూరేకారం పోటాష్ మరొకటో ఉన్నాయి. అవి వేటికవి అంత ప్రమాదం లేనివే, కాని కలిపితే ప్రమాదం. అలాగే You కు తెలుగు, Tube కు తెలుగు వేటికవి ప్రమాదం లేని మాటలు (ఆ రెండోది కొంచెం ప్రమాదం అనుకుంటున్నారు కదా! ఐతే మునిసిపాలిటీ స్కూల్లో చదివారన్న మాటే మరి). రెండు మాటలూ తెలుగు చేసి ఒకచోట పెడితే ఒక మోస్తరు బూతు స్పురిస్తుంది చాలామందికి. బూతు స్పురించని వాళ్ళు పుణ్యాత్ములు. అదేమిటి అని "ఫ్యాషన్" కి తెలియనట్టు నటించే వాళ్ళు అసలు సిసలైన బూతుకారులు మరి.


సరే అసలు కథలోకి వద్దాం! You Tube (వీటిని తెలుగు చేసి ఒకచోట వ్రాసే ధైర్యం నాకు లేదు. సరే ఇంటర్ నెట్ లో యు ట్యూబ్ కు ఉన్న ప్రాచుర్యం మరే సైటుకు లేదు. యు ట్యూబ్ లో ఎముంటుంది. భక్తీ, ముక్తి, రక్తీ అన్నీ సమపాళ్ళల్లో వినిపించటమే కాదు, కనిపిస్తాయి కూడా. ఇంటర్ నెట్ రాక పూర్వం వినిపిస్తూ కనిపించే పరికరం ఏమిటి? అదే ట్యూబ్. ట్యూబెమిటి నీ మొహం  అంటారా! అక్కడే ఆగండి. మొట్టమొదట టివి ప్రాచుర్యం లోకి వచ్చినప్పుడు దాన్ని ట్యూబ్ అనేవాళ్ళు లేదా టెల్లీ అనేవాళ్ళు. కొంచెం పాత తరం వాళ్లకి గుర్తు ఉండేఉంటుంది, 1980 లలో టి వి కొనుక్కున్నవాళ్ళు కొంతకాలం పోయేప్పటికి, "ట్యూబ్" పోయింది అని పాతది పారేసి కొత్తది కొనుక్కునేవాళ్ళు. ట్యూబ్ అంటే మనకు కనిపించే తెరనే ట్యూబ్ అంటారు. ఇప్పటి ఎల్ సి డి టి విల్లో ట్యూబ్ లేదు మరి.

కాబట్టి, మీకు టివిలాగా కనపడుతూ వినపడే వెబ్ సైటు కాబట్టి యు ట్యూబ్ అనగామీ టి వి" అని చెప్పుకోవాలి కాని, యధాతధ అనువాదం చేసి భ్రష్టుపట్టించకూడదు అని నా ఉద్దేశ్యం. ఉత్సాహవంతులు మరొక రకంగా అనుకుని ఆనందిస్తారని నాకు తెలుసనుకోండి. ఎవరి ఆనందం వారిదీ! పోనివ్వండి.

2 కామెంట్‌లు:

  1. మీ హాస్యంతో కూడిన రచన ఇదే మొదటిది నేను చదివింది. బావుంది. బూతుకారుల నిర్వచనం కూడా.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.