16, ఏప్రిల్ 2017, ఆదివారం

రేడియో మరణించలేదు


1980 లకు ముందు పుట్టిన వాళ్ళకు  పరిచయం ఉన్నట్టుగా ఆ తరువాత   పుట్టినవాళ్ళకు రేడియో పరిచయం, రేడియో వినటం తెలియదు. సరే నాలాంటి వాళ్ళు 1950ల్లో 60ల్లో అంతకు ముందు పుట్టినవాళ్ళకు రేడియోనే పెద్ద వినోద సాధనం . సాంకేతిక బాగా పెరిగి రేడియోనే కాక అనేకానేక సమాచార సాధనాలు మూలాన పడ్డాయి. ప్రస్తుతం రేడియో అంటే ఎఫ్ ఎం రేడియో మాత్రమె. ఎఫ్ ఎం రేడియో అంటే అందులో వచ్చే అనౌన్సర్ అదే "జాకీ" అనే జోకర్ పాట్లాడే వెర్రి మొర్రి మాటలు, దరువులు, కేకలు.

రేడియో ఇంకా చచ్చిపోలేదు. రేడియో ఇంకా అక్కడక్కడా బతికే ఉన్నది.  షార్ట్ వేవ్ రేడియో పూర్తిగా మరణించిందనే చెప్పాలి. ఎదో బి బి సి లాంటి వాళ్ళు తప్ప దాదాపు ఇతర రేడియోలు మూతపడినాయి.

ప్రస్తుతం రేడియో ఇంటర్నెట్ లో వస్తున్నది. వందలాది స్టేషన్లు ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం వ్యాపార ప్రకటనల పీడ తక్కువ. 

నేను ఈ ఇంటర్నెట్ రేడియోలు అనేకం చూసి, వాడి, ప్రయోగాలు చేసి చేసి చివరకు ఒక నిర్ణయానికి వచ్చాను. ప్రస్తుతానికి రేడియో వినే సరదా తీర్చుకోవటానికి ఇంటర్ నెట్ రేడియో ఎంతగానో ఉపయోగపడుతున్నది. 

అసలు ఈ ఇంటర్నెట్ రేడియో అంటే ఏమిటి. పేరులో ఉన్నట్టుగానే, ఇంటర్నెట్లో ప్రసారం చెయ్యగల రేడియో.ఇంటర్నెట్లో వస్తుంటే రేడియో అని ఎందుకు అనాలి, స్ట్రీమింగ్ ఆడియో అనచ్చు కదా. అనచ్చు, కానీ ఎక్కువ భాగం ఈ ఇంటర్నెట్ రేడియోలు ఆయా దేశాల్లో మామూలు ప్రసారాలు చేస్తూనే, వారి ఆడియోను ఇంటర్నెట్లో కూడా లైవ్ గా ఉంచి ప్రపంచ వ్యాప్తంగా అందరూ వినే ఏర్పాటు చేస్తున్నారు. 

ఇంటర్నెట్ రేడియో ఎలా వినాలి?

చాలా సింపుల్. డెస్క్ టాప్ కానీ, లాప్ టాప్ కానీ పాడ్ లు కానీ దేన్లో అయినా సరే వాడుకోవటానికి వీలుగా అనేక అప్లికేషన్లు, యాప్ లు వచ్చేసినాయి.

పిసి/లాప్ టాప్ లకు చక్కటి ఇంటర్ నెట్ రేడియో "రార్మ రేడియో".  ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని, పిసి/లాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, దేశదేశాలలో ఉన్న అనేకానేక రేడియో స్టేషన్లు వినవచ్చు. ఈ అప్లికేషన్లో స్టేషన్లు దేశాల వారిగా జార్న్ (Genre) పరంగా విడివిడిగా చూపిస్తుంది. పైగా మనం వినే స్టేషన్లు రికార్డు చేసుకోవచ్చు కూడా.  ఈ రేడియో చూడటానికి ఇలా ఉంటుంది:


ఈ రేడియోను ఈ కింది లింకు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింకు నొక్కగానే రార్మా రేడియో వెబ్ సైటులోకి వెడతారు. అక్కడ ఉచిత డౌన్లోడ్, కొనుక్కునో అవకాశం కూడా ఉన్నాయి. మనకు "ఉచిత" డౌన్లోడ్ చాలు.


 మరొక చక్కటి ఇంటర్నెట్ రేడియో కూడా ఉన్నది. ఇది "రేడియో గార్డెన్". ఈ ఇంటర్నెట్ రేడియోకి ఇన్స్టలేషన్ కూడా అక్కర్లేదు. ఈ కింది లింకు నొక్కితే చాలు మీ పిసి లో వచ్చేస్తుంది. 


ఈ రేడియో గార్డెన్ కు యాండ్రాయిడ్ వర్షన్ కూడా ఉన్నది. సెల్ లోనూ లేదా పాడ్లో కూడా వినవచ్చు. ఈ రేడియో గార్డెన్ వాడకం గురించి ఒక వీడియో కూడా యు ట్యూబ్ లో ఉన్నది చూడండి. ఒక జాగ్రత్త:

ఇంటర్నెట్ లోనూ గూగుల్ షాప్ లోనూ కనిపించిన ప్రతి చెత్త రెడియోనూ ఇన్స్టాల్ చెయ్యకండి. మీ పిసి లోకి లేదా సెల్ లోకి వైరస్ వచ్చే అవకాశం ఉన్నది. పైన చెప్పిన రెండు రేడియోలూ సురక్షితం. 

ఏతావాతా చెప్పేది ఏమంటే, రేడియో చచ్చిపోలేదు. ఇంకా బతికే ఉన్నది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.