ఏది ఏమైనా ఆకాశవాణి వారు ఇంతటి మంచి పని మొదలు పెట్టినందుకు ఆనందంగా ఉన్నది. పై వార్త తేదీ చూస్తె మే 25, 2010 అంటే "వినిపించే కళాకారులు కనపడే వేళ" కార్యక్రమం జరిగిన ఒకటి రెండు రోజుల తరువాతే ఈ "మంచి ప్రారంభం" జరిగినట్టుగా తెలుస్తున్నది. ఈ విషయం గురించి ఆ రోజున ఆ కార్యక్రమంలో ప్రకటించి ఉంటే ఎంతైనా బాగుండేది. కాని బ్యూరోక్రాట్ లు బ్యూరోక్రాట్లే వాళ్లకి ప్రతిదీ రహస్యమే.
ఇప్పటికైనా దక్షిణాది ఆర్ఖైవ్స్ వారు ఈ డిజిటైజేషన్ కు తీసుకున్న కార్యక్రమ వివరాలను ఆకాశవాణి వారి వెబ్ సైటులో ఉంచితే అందరికీ తెలిసే అవకాశం ఉన్నది (మరీ పేరాశ కదూ!!!)
ఒక 3-4 సంవత్సరాల క్రితం చందమామ పత్రికలన్నిటిని స్కాన్ చేసి వెబ్ లో ఉంచబోతున్నారు అన్న వార్త చదివినప్పుడు కలిగిన "థ్రిల్" గుర్తుకు వస్తున్నది. తిరుపతి తిరుమల దేవస్థానం వారి పుణ్యమా అని పాత చందమామలు అన్నీ కూడా మళ్ళి చూస్తూ చదవగలిగిన అదృష్టం కలిగింది. అలాగే ఆకాశవాణి వారు, వారి పూర్వపు కార్యక్రమాలు మళ్ళి మనింట్లోనే మనకు వీలైనప్పుడు వినగలిగే అవకాశం కలిగిస్తే అంతకంటే కావలసినది ఏమున్నది! అందుకే ఇది శుభవార్త.
వార్త పత్రికలో వచ్చిన కథనం ఈ కింది లింకు నొక్కి చదువవచ్చు.