7, జూన్ 2009, ఆదివారం

సిందుబాదు యాత్రలు చందమామ ధారావాహిక

ప్రియ చందమామ అభిమానులారా!

ఫణికుమార్ (బ్లాగాగ్ని) చందమామ అభిమానులకు చేస్తున్న సేవ చూసి , నా వంతు కృషిగా సిందుబాదు యాత్రలు చందమామ ధారావాహికను ఒకే ఫైలుగా తయారు చేశాను. ఈ కింద ఇచ్చిన లంకె ద్వారా మీ కంప్యూటర్ లోకి దిమ్పుకోవచ్చును. ఇది తయారు చెయ్యటానికి సహకారం ఆడించిన బ్లాగాగ్నికి నా ధన్యవాదములు.

http://rapidshare.com/files/241774209/SINDBAD_YAATRALU.pdf.html

సిందుబాదు యాత్రలు ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

ఈ ధారావాహిక చందమామ పత్రికలో నవంబరు ౧౯౬౯న మొదలయ్యి మే ౧౯౭౦ లో అయిపోయింది. ఏడు భాగాలుగా ప్రచురించారు. ఇప్పుడు మీకు ఒకే భాగంగా అందిస్తున్నాను.

శివరామప్రసాడు కప్పగంతు
బెంగుళూరు, భారత్

1 కామెంట్‌:

  1. శివరామ ప్రసాద్ గారూ !

    మొత్తానికి మీరు కూడా ఫణి గారిలాగా చందమామ అభిమానులకు పండగ చేయటం మొదలుపెట్టారన్నమాట. ‘సింద్ బాద్ యాత్రలు’ డౌన్ లోడ్ చేశాను ఇప్పుడే. చాలా చాలా థ్యాంక్యూలు.

    మీ తర్వాతి ప్రణాళిక ఏమిటి? ‘మహా భారతం’ అందిస్తే చాలా గొప్ప మేలు చేసినట్టవుతుంది.

    చందమామలో ఎంటీవీ ఆచార్య గారి చిత్రాలతోనూ, తర్వాత శంకర్ గారి చిత్రాలతోనూ మహాభారతం వచ్చింది కదా? ఎంటీవీ ఆచార్య గారి బొమ్మలు కవర్ పేజీలుగా కూడా వచ్చాయప్పుడు. ఈ రెండు భారతాలనూ విడివిడిగా కవర్ పేజీలతో పాటు ఇవ్వగలిగితేనా...! (మీరు గానీ ఫణి గారు కానీ )

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.