తెలుగులో మన భారత రామాయణ ఇతిహాసాలను ఇక చెప్పేవారెవరు అని ప్రజలు తరచి చూసుకుంటున్న తరుణంలో, శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు మనందరి భగవత్ ప్రార్ధనల ఫలితంగా ఈ పురాణేతిహాసాలను అనర్గళంగా మనందరికీ అర్ధమయ్యే విధంగా చక్కటి సరళమైన తెలుగులో చెప్పటానికి మనముందుకొచ్చారు. వారి పురాణ ప్రవచనాలు విని "ఆహా" అననివారు లేరు. అలా అనలేనివాడు మనిషేకాడు. నేను ముంబాయిలో ఉండగా రోజుకు రెండు గంటల రైలు ప్రయాణం పొద్దున్న మరియు సాయంత్రం కలిపి. అదృష్టవశాన అంధేరి నుంచి చర్చ్ గేటు స్టేషనుకు ప్రయాణం కావటాన వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు కూడ నాక్కావాలిసిన సీటు దొరికేది. అలా ప్రయాణించేప్పుడు, నాకెంతో ప్రియతమ నేస్తం, మన చాగంటివారు. వారి ప్రవచనాలు వింటో (నా మ్యూజిక్ ప్లెయర్ సహాయంతో) పరవశించి పోతో ప్రయాణ బడలిక పోగొట్టుకోవటం ఒక అతి చిన్న ఉపయోగమైతే, మనపురాణాలలోని ధర్మ సూక్ష్మాలు, మనకు తెలియని విశేషాలు తెలుసుకోవటం అసలైన ఆనందకరమైన అనుభవం. నెట్లో ఈరోజున చాగంటివారి వెబ్ సైటు చూడటం జరిగింది. ఆ వెబ్ సైటులో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి!
ఈ లంకె ద్వారా ఆ వెబ్ స్వర్గానికి వెళ్లి తెలుసుకోండి.
in 2008 i have got chicken pox and i was taking rest in my home at machilipatnam. by virtue of job i live at hyderabad. during that period i listened guruvugari sundarakanda pravachanam. from then onwards i became an ardent devotee of god with the blessings of guruvugaru through his pravachanams. till now daily i cant live with out listening guruvugari pravachanams, may it be ramayanam or siva maha puranam or sankara acharya jeevita visheshalu. by gods grace i have got a good collection of his pravachanams, i may not express completely in words about my thankful ness to guruvugaru but i can tell one thing : my life now runs only becoz of guruvugaru.
రిప్లయితొలగించండి