16, జూన్ 2009, మంగళవారం

వడ్డాది పాపయ్యగారి అద్భుత చిత్రాలు

వడ్డాది పాపయ్య గారు ఒక అద్భుతమైన చిత్రకారుడు. ఆయన వేసిన అనేక వందల చిత్రాలు చందమామ చదువరులను ఎంతగానో అలరించాయి. ఆ మహా చిత్రకారుడు అరణ్యపురాణం ధారావాహికకు వేసిన అట్టమీద బొమ్మలను కొన్నిటిని (దొరికినంతవరకు) ఒక ఆల్బంగా తయారు చెసాను. బొమ్మలన్నిటిని ఫొటో ఏడిటర్లో మరొక్కసారి డిజిటైజు చేసి రంగులు చాలావరకు పునరుధ్ధరించటం జరిగింది. చందమామ చదువుతున్న అనుభూతి కలగటానికి చక్కగా పుటలు తిప్పటానికి వీలున్నది. కుడిపక్కన కింద చివర మౌసె తో క్లిక్ చెయ్యగానే మనం మామూలుగా పేజీ తిప్పినట్టుగానే పుటలు తిరిగి అన్ని చిత్రాలు చూపబడతాయి . ఈ కింద ఇచ్చిన లంకెతో ఈ ఫైలును మీ కంప్యూటర్లోకి దింపుకొనవచ్చును. డౌన్లోడ్ అయినతరువాత ఆ ఫైలును డబుల్ క్లిక్ చెయ్యటమే తరువాయి కనువిందవుతుంది. ఆనందించండి.

http://rapidshare.com/files/258667425/ARANYAPURANAM_VAPA_BOMMALU.EXE

వడ్డాది పాపయ్య గారి బొమ్మల మీద  మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామల అట్టలమీద వారు వేసిన బొమ్మలను చోడవచ్చు.  ఆశగా ఈ  డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

2 కామెంట్‌లు:

  1. శివ గారూ! మీరు చేసింది చాలా గొప్ప పని. వ.పా. బొమ్మల రంగులను మెరుగుపరచటం ఒక ఎత్తయితే... మౌస్ క్లిక్ చేయగానే బొమ్మలు పేజీ తిప్పినట్టుగా మారేలా చేయటం మరింత బావుంది. చాలా థాంక్యూలు.

    రిప్లయితొలగించండి
  2. డౌన్ లోడ్ ని క్లిక్ చేస్తే ఎర్రర్ అని వస్తుంది. కారణం తెలియటం లేదు. డౌన్ లోడ్ చేసుకోవటానికి సాయం చెయ్యగలరు. మంచి మంచి చందమామ సీరియల్స్ అందిస్తున్న మీ ప్రయత్నానికి నెనర్లు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.