30, జులై 2009, గురువారం

అహింసా జ్యోతి


చందమామలో 1959 జనవరి నుండి 1960 మార్చ్ వరకు బుద్ధుని జీవిత చరిత్రను ధారావాహికగా వెయ్యటం జరిగింది. చాలా పాత ధారావాహికల్లో ఒకటి ఇది. చందమామ వారు ఎందుకనో గాని ఈ ధారావాహికను పున:ప్రచురణ చేసినట్టులేదు. ఈ ధారావాహికకు ప్రముఖ చిత్రకారుడు చిత్రాగారు బొమ్మలు వేశారు. అప్పటికి ఇంకా వడ్డాది పాపయ్యగారు చందమామలో బొమ్మలు వెయ్యటం మొదలు పెట్టినట్టులేదు. అందుకని, అట్టమీద బొమ్మను ఎం.టి.వి.ఆచార్య గారు వేశారు. దొరికినంతవరకు ఆ అట్టమీద బొమ్మలనుకూడ సేకరించి ఇవ్వటం జరిగింది. కాని స్కానింగు నాణ్యం బాగాలేక బొమ్మలు అంతబాగా కనపడటంలేదు.

చిత్రాగారు ఈ ధారావాహికకు రంగులలో తన నైపుణ్యాన్నంతా చూపిస్తూ, విజృంభించి బొమ్మలు వేశారు. ఈ కింది లంకె ద్వారా ఈ ధారావాహికను అందుకుని ఆనందించండి.

http://rapidshare.com/files/261805025/AHIMSA_JYOTHI.pdf

అహింసా జ్యోతి ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013


ధర్మం శరణం గచ్చామి.

2 వ్యాఖ్యలు:

  1. బొమ్మల్లో క్వాలిటీ లేకపోతేనేం... 50 ఏళ్ళనాటి ధారావాహికను చూడటమే చాలా గొప్ప విషయం. చిత్రా త్రివర్ణ చిత్రాలూ, ఎంటీవీ ఆచార్య ముఖచిత్రం చూడముచ్చటగా అనిపిస్తున్నాయి! థాంక్యూ శివ గారూ!

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఈ సీరియల్ కోసం చాలా రోజులుగా వెతుకుతున్నాను.నా దగ్గర ఈ సీరియల్ తాలూకు చందమామల వరుస ఉన్నాకూడానూ. ధన్యవాదాలండి గురువు గారు.

    బుద్ధుని జీవితంలో అనేక మందికి తెలియని విషయాలను చప్పిన చక్కటి ధారావాహిక ఇది.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.