19, జులై 2009, ఆదివారం

శ్రీ జయదేవ్-ప్రముఖ కార్టూనిస్ట్(వ్యంగ్య చిత్రకారుడు) మూడవ భాగం

మైలు రాళ్ళు
జయదేవ్ గారికి అనేకానేక బహుమతులు, అవార్డులు లభించాయి. అందులో మచ్చుకి కొన్ని:
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు నిర్వహించిన కార్టూన్ల పోటీలో మొదటి బహుమతి
1991:ఊర్కహోన్డె ఛార్టర్, న్నొకి-హైస్ట్, బెల్జియం-గౌరవ ప్రస్తావన (Honourable Mention)

1992: ఒక్ హొట్స్క్ అంతర్జాతీయ కార్టూన్ పోటీ, జపాన్-ప్రత్యేక బహుమతి (Work of Special Merit Prize)

1993: భారత ప్రభుత్వం నిర్వహించిన పర్యావరణ అవగాహన పోటీలో ప్రధమ బహుమతి (First Prize, Care for the Enivironment Cartoon Contest, Government of India)

1994: ఒక్ హొట్స్క్ అంతర్జాతీయ కార్టూన్ పోటీ, జపాన్-ప్రత్యేక బహుమతి (Work of Special Merit Prize)

1995: అంతర్జాతీయ సందేశాత్మక కార్టూన్ ఫెస్టా, 1994, మియాగవ, జపాన్- కంపెనీ సౌజన్య బహుమతి (Company Sponsored Award)

1996: 25వ అంతర్జాతీయ కార్టూన్ ఫెస్టివల్ లో జూరీ సభ్యునిగా నియామకం (Nominated as Member of International Jury for the 25th International Cartoon Festival)

1997-2000: వ్యవస్థాపక ప్రిన్సిపాల్, హార్ట్ ఏనిమేషన్ ఎకాడమీ,హైదరాబాదు. పూర్తి పాఠ్యాంశ నిర్ణయం అమెరికన్ నిపుణులతో కలసి

2002: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ ఎకాడమీ మరియు రాజకీయ వ్యంగ చిత్రకారుల ఫోరం వారి సన్మానం

ఔత్సాహిక వ్యంగ్య చిత్రకారులకు జయదేవ్ సూచనలు:

ఐడియాలు మెదడులో ఫ్లాష్ ఔతాయి. కార్టూనిస్ట్ ఆవిధంగా ఫ్లాష్ ఐన ఐడియాలను ఒక పాకెట్ నోట్ బుక్ లో, నోట్ చేసి పెట్టుకోవాలి.

మన కార్టూన్ ఐడియాలు మన దేశవాతావరణఅనికి అనుగుణంగా ఉండాలి. నోట్ బుక్కూ పెన్సిలూ రెడీగా పెట్టుకోవాలి. రఫ్ గా బొమ్మ వేసి, ఐడియాకు సరిపడా వ్యాఖ్య రాసేయాలి. కార్టూన్లు గీయడానికి ఉపక్రమించే ముందు, ఈ పాకెట్ నోట్ బుక్ చాలా ఉపయోగపడుతుంది.

కార్టూన్ అనుకున్నప్పుడు సీన్ ను చిత్రించడమే కాకుండా క్యారక్టర్స్ కు సంబంధించిన ఎక్సప్రెషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మాట్లాడే క్యారక్టరు నోరు తెరిచి ఉండాలి. ఆవతలి క్యారక్టర్ ఎక్సప్రెషన్ ను సూచించేలా ఉండాలి. క్యారక్టర్స్ చిత్రీకరణ అయ్యాక బాక్ గ్రౌండును క్రియేట్ చేయాలి. బాక్ గ్రౌండ్ లొకేషన్ ను సూచించాలి. ముఖ్యమైన అంశాలుంటే చాలు. అనవసరమైన డీటైల్సుతో బాక్ గ్రౌండు, క్యారక్టర్లను డామినేట్ చేయకుండా జాగ్రత్తపడాలి.

కార్టూన్ గీశాక ముందస్తుగా ఇంట్లో వాళ్ళకీ, స్నేహితులకి చూపించాలి. వాళ్ళి మెచ్చుకుంటే తప్పకుండా పత్రికల ఎడిటర్లు ఆ కార్టూన్ కు పాస్ మార్కులిచ్చినట్లే.

ఓపిక అలవరుచుకోండి. అలోచించండి. హాయిగా సరదాగా నోరువిప్పి మాట్లాడండి. ఇతరుల మాటలను వినండి. అబ్జర్వ్ చేయండి.......కార్టూన్లు గీయండి.

జయదేవ్ గారి కార్టూన్ల మీద ప్రముఖుల అభిప్రాయాలు

బాబు -ప్రముఖ కార్టూనిస్ట్ - కార్టూను గీతలు హడావిడిగా కాక, శ్రద్ధగా గీసినట్టుండి, అందంగా కనిపిస్తాయి. రాత అచ్చు అక్షరాల్లా ఉంటాయి. సంభాషణరహిత కార్టూన్లు వెయ్యటంలో దిట్ట. హాస్యం అతని కార్టూన్ గమ్యం. సైన్సు విషయాలమీద తెలుగులో కార్టూన్లు వెయ్యగల ఏకైక కార్టూనిస్ట్. మెగతా కార్టూనిస్టులకు ప్రొత్సాహం ఇచ్చే విషయంలో చాలా చొరవ చూపుతారు.

వంశీ-ప్రముఖ సినీ దర్శకుడు-అందరూ ఒక కోణంలో అలోచించగలిగితే, జయదేవ్ పలు కోణాల్లో అలోచించగల సామర్ధ్యం తన స్వంతం చేసుకున్న వ్యక్తి........అన్ని కార్టూనులూ చూసి అనందించాను. కొన్ని కడుపుబ్బ నవ్విస్తే మరికొన్ని చాలా అలోచింపజేశాయి. ఒక కార్టూనిస్టు ఏ విధంగా ఆలోచించాలో, ఎలా అలోచింపజేయాలో జయదేవ్ తన కార్టూన్ల ద్వారా విపులీకరించారు.

శివలెంక రాధాకృష్ణ ఆంధ్ర పత్రిక సంపాదకులు-చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ-తెలుగు కార్టూన్‌లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయాన్ని శ్రీ బాపు గారు మొదలు పెట్టారు. శ్రీయుతులు జయదేవ్, బాబుగారల హాస్య చిత్రాలు ఈ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నాయి.

రామకృష్ణ - ప్రముఖ కార్టూనిస్ట్-జయదేవ్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. ఆ శైలే, క్రింద సంతకం చూడనవసరం లేకుండానే తేలికగా పట్టించేస్తుంది......విషయం ఎన్నుకునే విధానం చాలా గొప్పగా ఉంటుంది. నిశ్శబ్ద వ్యంగ్య చిత్ర నేర్పరి. "ట్యూబ్‌లైటు" కార్టూన్లలో మరింత పరిశీలిస్తేకాని బుర్రలో లైటు వెలగని గొప్ప కార్టూన్లు వేశారాయన. చిన్న కార్టూన్లలోనే ఆయన చేసే బహు విశాలమైన సన్నివేశ చిత్రీకరణ అద్భుతం.....

జయదేవ్ కార్టూన్లతో చిన్న సినిమా(వ్యాఖ్యానం రచయితది)

4 కామెంట్‌లు:

  1. గురువులు,ప్రముఖ చిత్రకారుదు శ్రీ జయదెవ్ గారి గురించి మంచి సమాచారం ఇస్తున్నారు, మీకు వేల నమస్కారాలు

    రిప్లయితొలగించండి
  2. అన్వర్ గారూ,

    మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. బాబు, రాగతి పండరి, తులసీరాం, రామకృష్ణ, బాలి గార్ల గురించి కూడ వ్రాద్దామనుకుంటున్నాను.

    శివరామప్రసాదు కప్పగంతు
    బెంగుళూరు, భారత్

    రిప్లయితొలగించండి
  3. జయదేవ్, బాబు నా అభిమాన కార్టూనిష్టులు. వారిగురించిన వివరాలిచ్చి ఆహ్లాదపరచారు ధన్యవాదాలు. అన్నట్టు నేనూ ఓ చిన్నపాటి కార్టునిష్టునే. MSPaint లో వేసిన నా కార్టూన్లను దయచేసి నా బ్లాగులో చూడగలరు. - Surya (www.suryamahavratayajula.wordpress.com)

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.