6, ఆగస్టు 2009, గురువారం

మార్కోపోలో సాహస యాత్రలు




మార్కోపోలో సాహస యాత్రలు చందమామలో 1960లో వేసిన ఒక రంగుల ధారావాహిక. ఇందులో ఒక భాగం నవెంబరు 1960 చందమామలో విషయ సూచిక ప్రకారం మార్కోపోలో ధారావాహిక 25 వపుటలో ఉండాలి. కాని చందమామ వెబ్ సైటులో అప్లోడ్ అయిఉన్న ఫ్లాష్ ఫైలులో అది లేదు. అలాగే మునుపున్నెడో నేను డౌన్లోద్ చెసుకున్న పి డి ఎఫ్ ఫైలులో కూడ మార్కోపోలో సాహస యాత్రలు ధారావాహిక భాగం లేదు. యెవరి దగ్గరన్నా నొవెంబరు 1960 చందమామ హార్డు కాపీ ఉంటే దయచేసి స్చాన్ చేసి షేర్ చెయ్యగలరు. ఈ ఒక్క భాగం నా దగ్గరలేక ఈ ధారావాహికను ఒక ఫైలుగా చెయ్యాలేకపోయినాను. ఇతర చంపిలు సహాయానికి రావాలి అని నా పిలుపు.

4 కామెంట్‌లు:

  1. అయ్యో. ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లుంది మీరు కోరుతున్న సహాయం గురించి ఇక్కడ చూస్తుంటే. పాత చందమామలను స్కాన్ చేసినపుడు తగిన జాగ్రత్తలు తీసుకోనందున ఇలాంటి అపభ్రంశ చర్యలు చాలానే జరిగాయి. పుటల చివరలోని టెక్ట్స్ స్కాన్ చేస్తున్నప్పుడు సరిగా వచ్చిందా లేదా ఏమయినా మడతలు పడ్డాయా అని కూడా చూసుకోకుండా అప్పట్లో స్కానింగ్ చేసి పడేసారు. ఇప్పుడు అలాంటివి తిరిగి సరిచేసే అవకాశముందా అని చందమామ లైబ్రరీ నిర్వాహకులను అడిగితే ఛాన్సే లేదు అని చెప్పేస్తున్నారు. 1957 చందమామ సంచిక ఒకదానిలో ఇలాగే జరిగింది. ఒక టీమ్‌గా అంకితభావంతో చేయవలసిన పనులు ఏక వ్యక్తి ద్వారా జరిగితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. మీరు చెప్పిన సంచికలో మార్కోపోలో వివరాలు లేవు. ఇప్పుడే చూశాను. మీ ఆశను తుంచడం ఎందుకనే రేపు చందమామ ఆపీసులో అడిగి చూస్తాను. ఫలితంపై ఆశ మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే పత్రిక ఘనతర చరిత్రకున్న విలువ కూడా అర్థంకాని స్తితిలో ఇప్పుడు పని తీరు ఉంటోంది. మీరు కోరింది దొరికితే మీ భాగ్య విశేషమే మరి..

    రిప్లయితొలగించండి
  2. రాజుగారూ మీరు ప్రయత్నిస్తున్నందుకు నా ధన్య వాదములు. మీ కృషి సఫలీకృతమవ్వాలని నా అకాంక్ష

    రిప్లయితొలగించండి
  3. శివరాం గారూ,
    మీరడిగిన 1960 నవంబర్ నాటి మార్కోపోలో ధారావాహిక 8 వ భాగం గురించి ఇప్పుడే చందమామ లైబ్రరీ నిర్వాహకులను సంప్రదించాను. మొత్తానికి నవంబర్ నెలలో రావలసిన 8వ భాగం తప్పిపోయిందని వాళ్లు కూడా ఇప్పుడే కనుగొన్నారు. ఎలాగయినా ఆ పార్ట్ కావాలి అని అడిగితే హార్డ్ కాపీ ఉందో లేదో చూసి చెబుతామని, ఉంటే దాన్ని పీడీఎఫ్‌గా మార్చి ఆర్కైవ్స్‌లో పెడతామని చెప్పారు. ఈ మేరకు పని జరిగినా గొప్పే అనుకుని తప్పక ఆ పనిచేయమని చెప్పాను. ఇంతకు ముందు చందమామ లైబ్రరీకి ప్రతినెలా 10 కాపీలు కేటాయించేవారు, ఇప్పుడు స్పేస్ సమస్య అని చెప్పి 3 కాపీలు మాత్రమే తీసుకుంటున్నారు. ఇవి తప్పిపోయాయంటే చందమామ వద్దే ఒరిజనల్ హార్డ్ కాపీలు లేకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మీలాంటి వారు కూడగలుపుకుని ఇప్పటి వరకు వ్యక్తుల వద్ద అందుబాటులో ఉన్న హార్డ్ కాపీలను ఎలాగైనా సంరక్షించే పని చేపడితే బాగుంటుందేమో. ఇది అంత సులభం కాదు లేండి.

    మార్కోపోలో 8వ పార్ట్ విషయం ఈ సాయంత్రం లోపే సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. అలా కాదంటే మళ్లీ సోమవారమే. అంతవరకు సెలవు.

    రిప్లయితొలగించండి
  4. అద్భుతం రాజుగారూ. అద్భుతం.

    మీరు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇల్లాగే మునుపు నాదగ్గర ఉన్న పిడిఎఫ్ లలో ఏదన్న ఒక భాగం తప్పి పొతే (ఇప్పుడు రహస్యం చెప్తున్నాను) చందమామ ఆర్ఖైవ్ లో ఉన్న ఫ్లాష్ ఫైలు నుంచి ప్రింట్ స్క్రీన్ ఆప్షన్ తో అది సంపాయించుకున్నాను. ఈ భాగం ఎక్కడా లేకపోవటం చేత ఇంత ప్రయత్నం చెయ్యాల్సి వచ్చింది.

    మీ చక్కటి ప్రయత్నం మంచి ఫలితాన్నే ఇచ్చి ఆ 8వ భాగం దొరకాలని నేను ఆశిస్తున్నాను.

    మరొక్కసారి ధన్యవాదములు
    శివరామప్రసాదు కప్పగంతు
    బెంగుళూరు, భారత్

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.