8, ఆగస్టు 2009, శనివారం

మార్కోపోలో సాహస యాత్రలు


మనదేశానికి చాలామంది విదేశీయులు వచ్చి వెళ్ళారు. వారిలో మార్కో పోలో చాలా ముఖ్యుడు. ఇతని మూలంగా భారత దేశం గురించి బయట ప్రపంచానికి తెలిసింది. భారత చరిత్రలో ప్రసిధ్ధికెక్కిన మర్కోపోలో గురించి చందమామ వారు 1960 ఏప్రిల్ నుండి డిసెంబరు వరకు తొమ్మిదిభాగాలుగా రంగులలో ధారావాహికను అందించారు.

ఈ ధారావాహికకు బొమ్మలు శ్రీ చిత్రాగారు వేశారు. చిత్రాగారే అట్టమీద బొమ్మలు కూడ వేశారు. అప్పటికి ఇంకా వపా గారు(శ్రీ వడ్డాది పాపయ్య గారు) చందమామలో బొమ్మలు వెయ్యటం మొదలు పెట్టినట్టు లేదు. పాపయ్యగారు చిత్రాలు వెయ్యటం 1961 జనవరి నుండి అనుకుంటాను. దొరికినంతవరకు చిత్రాగారు వేసిన అట్టమీద బొమ్మలను కూడ ఈ ధారావాహికతో పాటు పొందుపరచటం జరిగింది.
ఈ ధారావాహిక సంకలనంలో సహకరించిన రాజుగారికి నా కృతజ్ఞతలు. సహాయ యత్నం చేసిన వేణు గారికి కూడ ధన్యవాదములు. ఈకింద ఇచ్చిన లంకె ద్వారా ఈ చక్కటి ధారావాహికను చదివి ఆనందించండి.
http://rapidshare.com/files/264850473/MARCOPOLO_SAAHASA_YAATRALU_KSRP.pdf

మార్కోపోలో సాహస యాత్రలు  ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

1 కామెంట్‌:

  1. శివ గారూ, మార్కోపోలో ధారావాహికను మొత్తానికి అందించారు; చాలా శ్రమించి. మీకూ, ఈ ప్రయత్నంలో మీకు సహకరించిన చందమామ రాజు గారికీ ధన్యవాదాలు. అట్ట మీద చిత్రా వేసిన బొమ్మలను కూడా అందించటం చాలా సంతోషం!

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.