ఈ వ్యాసం ఇంతకుముందు తెలుగు వికీలో వ్రాశాను. ఇక్కడ మళ్ళీ ప్రచురిస్తున్నాను. అడిగిన వెంటనే తన వివరాలు, కార్టూనులు పంపి వ్యాసం వ్రాయటానికి ప్రోత్సహించిన తులసీరాంగారికి కృతజ్ఞతలు
తెలుగు వ్యంగ్యచిత్ర రంగంలో 1960, 1970 దశకాలలో పేరెన్నికగని, వేల కార్టూన్లను అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రచురించినవారు తులసీరాం. వీరి అసలు పేరు షరాఫ్ తులసీ రామాచారి. తన పేరులోని "తులసి" "రామ" కలిపి 'తులసీరాం' తన కలంపేరును చేసుకుని ఆ పేరుతోనే ప్రఖ్యాతిగాంచారు.
వ్యక్తిగతం
వీరు 1941, ఏప్రిల్ 24న కర్నూలు జిల్లా, సంజామల మండలంలోని అలువకొండ గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి షరాఫ్ పుల్లయ్య ఆచారి, తల్లి షరాఫ్ సుబ్బమ్మ. ఇద్దరూ కీర్తిశేషులయ్యారు. 1958-59లో ఎస్సెసెల్సీ (Secondary School Leaving Certificate[SSLC]), 1959-60 ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, అనంతపురం నుండి పి.యు.సి. (Pre University Course[P.U.C.]) పూర్తి చేశారు. 1968 లో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ (Andhra Pradesh State Electricity Board [APSEB])లో ఎల్డిసీగా చేరి, విజయవాడ, నరసారావుపేట, గుంటూరు ప్రాంతాలలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి జూనియర్ అక్కౌంట్స్ ఆధికారిగా 1998వ సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. వీరు ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్నావీరు. వీరి భార్య షరాఫ్ సత్యవతి, వీరిని ఎంతగానో ప్రోత్సహిస్తూ, ఉన్నత స్థానాల్లో చూడాలని ఆకాక్షిస్తుంటారు. వీరికి ఇద్దరు కుమారులు-రవీంద్రీశ్వర్, సుధాకర్ మరియు కుమార్తె-నాగమణి. వీరి పెద్ద కుమారుడు రవీంద్రీశ్వర్ దురదృష్టవశాత్తూ చిన్న వయసులోనే స్వర్గస్తులయ్యారు. వీరి చిన్న కుమారుడు, సుధాకర్ కూడ మంచి కళాకారుడు. ఏనిమేషన్ లో ప్రవేశం ఉన్నది, స్వంతంగా చక్కటి బొమ్మలు గీస్తూ ఉంటారు.
కార్టూన్ రంగ ప్రవేశం

చిన్నతనం నుండి బొమ్మలు గీయటం మీద ఆసక్తి. ఈ ఆసక్తి మూలంగానే, ప్ర్రాధమిక విద్యాభ్యాసం జరుగుతుండగానే, 1958వ సంవత్సరంలో అంటే 17 సంవత్సరముల వయస్సులో, లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్షలు ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణుడైనారు. ప్రకృతి చిత్రాలు, కార్టూన్లు, నలుపు-తెలుపు చిత్రాలు గీయటం, వ్యంగ్య చిత్రాలు, ఛాక్‌పీసులతో, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో రకరకాల బొమ్మలు చెయ్యటం, చెక్కటం చేశేవారు. వీరి మొట్టమొదటి కార్టూన్ 1964వ సంవత్సరంలో ఆంధ్రపత్రిక లో ప్రచురితమయ్యింది.
ఆ తరువాత వీరి వ్యంగ్య చిత్రాలు అన్ని ప్రముఖ దిన/వార/మాస పత్రికలలోనూ ప్రచురితమయ్యి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒక్క తెలుగు పత్రికలలోనే కాక, వీరి కార్టూన్లు, ఆంగ్ల పత్రికలయిన శంకర్స్ వీక్లీ (Shankar's Weekly), న్యూస్ టైమ్ (News Time)లలో కూడ ప్రచురితమయ్యాయి. స్వాతి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల వారు నిర్వహించిన కార్టూన్ల పోటీలలో ప్రధమ, ద్వితీయ బహుమతులు లబించాయి.
వ్యక్తిగతం
వీరు 1941, ఏప్రిల్ 24న కర్నూలు జిల్లా, సంజామల మండలంలోని అలువకొండ గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి షరాఫ్ పుల్లయ్య ఆచారి, తల్లి షరాఫ్ సుబ్బమ్మ. ఇద్దరూ కీర్తిశేషులయ్యారు. 1958-59లో ఎస్సెసెల్సీ (Secondary School Leaving Certificate[SSLC]), 1959-60 ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, అనంతపురం నుండి పి.యు.సి. (Pre University Course[P.U.C.]) పూర్తి చేశారు. 1968 లో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ (Andhra Pradesh State Electricity Board [APSEB])లో ఎల్డిసీగా చేరి, విజయవాడ, నరసారావుపేట, గుంటూరు ప్రాంతాలలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి జూనియర్ అక్కౌంట్స్ ఆధికారిగా 1998వ సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. వీరు ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్నావీరు. వీరి భార్య షరాఫ్ సత్యవతి, వీరిని ఎంతగానో ప్రోత్సహిస్తూ, ఉన్నత స్థానాల్లో చూడాలని ఆకాక్షిస్తుంటారు. వీరికి ఇద్దరు కుమారులు-రవీంద్రీశ్వర్, సుధాకర్ మరియు కుమార్తె-నాగమణి. వీరి పెద్ద కుమారుడు రవీంద్రీశ్వర్ దురదృష్టవశాత్తూ చిన్న వయసులోనే స్వర్గస్తులయ్యారు. వీరి చిన్న కుమారుడు, సుధాకర్ కూడ మంచి కళాకారుడు. ఏనిమేషన్ లో ప్రవేశం ఉన్నది, స్వంతంగా చక్కటి బొమ్మలు గీస్తూ ఉంటారు.
కార్టూన్ రంగ ప్రవేశం

చిన్నతనం నుండి బొమ్మలు గీయటం మీద ఆసక్తి. ఈ ఆసక్తి మూలంగానే, ప్ర్రాధమిక విద్యాభ్యాసం జరుగుతుండగానే, 1958వ సంవత్సరంలో అంటే 17 సంవత్సరముల వయస్సులో, లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్షలు ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణుడైనారు. ప్రకృతి చిత్రాలు, కార్టూన్లు, నలుపు-తెలుపు చిత్రాలు గీయటం, వ్యంగ్య చిత్రాలు, ఛాక్‌పీసులతో, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో రకరకాల బొమ్మలు చెయ్యటం, చెక్కటం చేశేవారు. వీరి మొట్టమొదటి కార్టూన్ 1964వ సంవత్సరంలో ఆంధ్రపత్రిక లో ప్రచురితమయ్యింది.

రచనా వ్యాసంగం
వీరు కార్టూన్లు వెయ్యటమేకాక, అనేక కథలు, చిన్న కథలు, రకరకాల జోకులు, వ్యాసాలు, కవితలు, హైకూలు, పాటలు, చిన్న పిల్లల కథలు వ్రాశారు. వీరు వ్రాసిన కవితలలో కొన్ని, ఆకాశవాణి విజయవాడ కేద్రం వారు వివిధ భారతిలో ప్రసారం చేశారు. పదశృతి శీర్షికన వ్రాసిన వ్యాసాలు ఆంధ్ర ప్రభలో ప్రచురితమవుతున్నాయి. వీరు వ్రాసిన కథలు దాదాపు 30 దాకా ఉంటాయి 1960లో వ్రాసిన "ప్రేమ ఫలితం" అనే నాటకం హైదరాబాదులో నిర్వహించబడిన పోటీలలో బహుమతి అందుకున్నది.
వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు
- వీరి కార్టూన్‌లు చక్కటి ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తాయి.
- మనకు సామాన్యంగా ప్రతిరోజూ తారసపడే సంఘటనల నుండి హాస్యాన్ని అందిస్తారు
- బొమ్మలు తక్కువ గీతలతో పరిపూర్ణంగా ఉంటాయి.
- కార్టూన్‌లో ఇతర వివరాలు ఎంతవరకూ అవసరమో అంతే ఉంటాయి.
- మోతాదుకు మించిన వివరాలు, బొమ్మలమీద గీతలు, పిచ్చి జుట్లు వంటివి వీరి కార్టూన్ల లో కనపడవు.
ప్రదర్శనలు
వీరు వేసిన కార్టూనులు, చిత్రాలు, చెక్కిన ఛాక్‌పీసు బొమ్మలు, లియో క్లబ్, రోటరీ క్లబ్, చిరంజీవి కల్చరల్ అసొసియేషన్ వంటి స్వచ్ఛంధ సంస్థలు తెనాలి, నరసారావుపేట లలో ప్రదర్శనలు నిర్వహించాయి.
అంతేకాక, జిల్లా గ్రంధాలయ సంస్థలు, ప్రెస్ క్లబ్‌లు కూడ వీరి ప్రదర్శనలను ఏర్పరిచి, ప్రజలకు వీరి చిత్రకళా నైపుణ్యాన్ని చూపించారు.

వ్యంగ చిత్ర మాలిక

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.