వినాయక చవితి శుభాకాంక్షలు
మనం వినాయకుడి పేరున పండుగ చేసుకుంటున్నాము. పూజలో భాగంగా పత్రితో పూజ చేస్తాము. అసలు పత్రితో పూజ ఎందుకు ప్రవేశపెట్టి ఉంటారు? ఇలా అన్నా ప్రజలు తమ తమ ఇళ్ళలో రకరకాలైన చెట్లు పెంచుతారేమో అని అయి ఉంటుందని నా అభిప్రాయం. కాని, మనం ఏమి చేస్తున్నాము! సరిహద్దు గోడకి, ఇంటికి అంగుళం కూడ వదలకుండా ఇళ్ళు కట్టేసుకుని (లేకపోతే అద్దెలు తక్కువవుతాయి మరి), ఇలా పూజలకి అవసరమైన (పూజ చెయ్యకపోతే ఏమి జరుగుతుందో అని "భయం", భక్తి పాలు తక్కువ) పత్రి కోసరం మార్కెట్టుకు ఎగబడటం ఇదే సందని, ఎక్కడేక్కడ చెట్లని విరిచి పత్రి కింద అమ్మటం అది తెచ్చి వినాయకుడికి పూజ!! భగవంతుడు ఇల్లాంటి పూజలను ఒప్పడు.
ఎన్ని అరటి పిలకలండీ విరిచి, కోసి అమ్ముతున్నారు. కనీసం, అవి మొక్కలయ్యి ఎన్ని అరటికాయలు కాస్తాయన్న ఇంగిత జ్ఞానం కూడ లేకుండా(ఈ కరువు రోజులలో). పాపం ఆ అరటి మొక్కలను అలా రోడ్డు మీద వందల సంఖ్యలో పడేసి అమ్ముతుంటే చాలా భాధ వేసింది.
ఇలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే "పుణ్యం" అన్నమాట పట్టుకుని, ఆ చెట్టు పెంచకపోగా ఒక 20 వీధులకు ఉన్న ఒక్క చెట్టు కొమ్మలను తలా ఒకటి విరిచి పట్టుకుపోయి అది పక్కన పెట్టుకుని భోజనం, పూజ!! ఉన్న ఆ ఒక్క చెట్టు చచ్చిపోవటం. వచ్చే సంవత్సరం మరొక చెట్టుని వధించటానికి మళ్ళీ ఈ పుణ్యమూర్తులు ఎగబడటం!! ఇదా ఈ ఆచారం ఉద్దేశ్యం?? ఉసిరి మొక్క, కాయలు ఎన్నో రకాలుగా మన ఆరోగ్యానికి పనికివస్తాయి. అటువంటి చెట్టును అందరూ ఇళ్ళల్లో పెంచుకోవటాన్ని ప్రోత్సహించటానికి పెద్దవాళ్ళు పుణ్యం వస్తుందని ప్రలోభ పెట్టారు. మన ఆరోగ్యం కంటే పుణ్యం ఏముందండీ.
మనం మన పిల్లలు, రాబోయ్యే తరాలు సుఖంగా బతకాలంటే, సమయానికి వానలు పడి పంటలు పండాలంటే, ఇలా ఆచారాల పేరిట చెట్లను సంహరించటం మానితే కొంతన్నా మేలు జరుగుతుంది.ఆచారాల వెనుక ఉన్న ఉద్దేశ్యం సరిగ్గా అర్థం చేసుకోవాలి, చెట్లను పెంచాలి, కాపాడాలి. అంతేకాని, విపరీతార్ధాలు తీసుకుని ఇలా నెగటివ్‌గా(దీనికి సరైన తెలుగు పదం దొరకలేదు) పాటించటం మంచిదికాదు.

Very well said!
రిప్లయితొలగించండిచాలా మంచి విషయం చెప్పారు! ఇలాంటి టపాల ఆవశ్యకత ఎంతైనా ఉంది నేడు.
రిప్లయితొలగించండిఅభినందనలు.