6, సెప్టెంబర్ 2009, ఆదివారం

ప్రజాస్వామ్యమే మనది??


రాష్ట్రంలో పాలకపక్షం నాయకుని అకాల మరణం వల్ల, కొంత సంక్షోభంలో ఉన్నట్టున్నది. ప్రస్తుతం ఒకాయన రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్నప్పటికి, అయనేదో తాత్కాలికమే అన్నట్టుగా ఊహగానాలు, ప్రకటనలు, చర్చలు కొనసాగుతున్నయి. యధావిధిగా, మన మీడియా కొన్ని అనవసరపు చర్చలు చేయిస్తూ, లేనిపోని దుమారాలను రెచ్చగొట్టటం, విజయ గర్వంతో, కొనసాగిస్తూనే ఉన్నది.

గత కొద్ది రోజులుగా వస్తున్న ప్రకటనలు చూస్తుంటే మన రాజకీయ నాయకులకు ప్రజాస్వామ్యం మీద అవగాహన ఎంతమాత్రం లేదన్నది సత్యం. ఒహాయన అంటాడు, "......కంటే యెం ఎల్ ఎ ల మాట యెక్కువా ..." అని. ఇటువంటివాళ్ళగురించి వ్రాసేప్పుడు ఏకవచన ప్రయోగంకంటే కిందికి ఇంకేమన్నా ఉన్నదా, ప్రయోగిద్దాం అనిపిస్తుంది. యేమిటి ఈయనగారి ఉద్దేశ్యం,యెం ఎల్ ఎ ల మాటకు విలువలేదు, అక్కడెక్కడో ఢిల్లీలో కూచుని ఇలాంటి వాళ్ళ సలహాలతో పనిచేస్తున్న మరెవరో నిర్ణయిస్తారా? నేనేమీ ఫలానా ఆయన ఏమైనాసరే ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే........ అని కళ్ళెర్ర చేస్తున్న ఎం ఎల్ ఎ లకు మద్దతుగా వ్రాయటం లేదు, వాళ్లు ప్రచారం చేస్తున్న వ్యక్తికి మద్దతుగా అంతకంటే కాదు.

రాజ్యాంగపరంగా, ఎం ఎల్ ఎ లకు కాకపోతే ఇంకెవరికి ఉన్నది నాయకుణ్ణి ఎన్నుకునే హక్కు అన్న మౌలిక విషయం మీద నా బాధ.

మరొకచోట,ఒక ఎం ఎల్ ఎ గారు ఇలా శలవిచ్చారు (ఆయనకి పదవి దొరకలేదని బస్సులు అవి తగలబడ్డాయి ఈ మధ్య)" అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం, వారు సూచించిన వారికి చెయ్యెత్తడమే" అని. యేమి బానిసత్వం, యేమి చంచాగిరి. ఇదేనా మన రాజ్యాంగ నిర్మాతలు సూచించిన విధానం??

రాజ్యాంగ ప్రకారం ఒక వ్యక్తి కాని లేదా వ్యక్తుల సమూహంకాని(లెజిస్లేచర్ సభ్యులు)ఒక హక్కును పొంది ఉన్నప్పుడు వారు ఆ హక్కును వినియోగించుకోకుండా వేరొకరికి ధారపొయ్యటం రాజ్యాంగ విరుధ్ధం అవునా కాదా అని రాజ్యాంగ నిపుణులు తప్పనిసరిగా నిర్ణయించాలి.

ఇక్కడే కాదు, దాదాపు అన్ని పార్టీలలోనూ అదే గోల, ఎన్నికైన ప్రతినిధులకు ఏమాత్రం అవకాశంలేదు. పైన కూచుని అధిష్టానమో, పోలిట్ బ్యూరోనో అని గంబీరమైన మాటలు వాడి వాళ్ళ మాట వినే వాణ్ణే పదవిలో కూర్చోపెట్టటం! ఇది ఎంతవరకు సబబు చాలాసార్లు, ప్రజలచేత ఇంకా ఎన్నుకోబడని వ్యక్తినో, లేదా ఎగువ సభ సభ్యుణ్ణో, వాళ్ళ నాయకుడిగా ఎన్నుకునేట్టు చేస్తారు. వీళ్ళల్లో ఒక వీరాభిమాని రాజీనామా చేసి తన సురక్షిత స్థానం నాయకుడికి ఇస్తే, ఆయన గెలిచి ఆ "బెడద" కాస్త దాటటం!
ఈ మాత్రానికి ఎన్నికలెందుకు, ఒక కంపెనీ సి ఇ ఒ ని నియమించినట్టుగా బహిరంగ ఇంటర్వ్యూ చేసి, అర్హతగల వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తే పోలేదా!! ప్రజలం, మనం, ప్రత్యక్షంగా ముఖ్య/ప్రధాన మంత్రిని ఎన్నుకోక పోయినా, మనం ఎన్నుకున్న ప్రతినిదుల ద్వారా వారి వారి నాయకులను ఎన్నుకుని, తద్వారా పరిపాలన చెయ్యమంటే, వాళ్ళేమో ఇంకెవరి మాటో వింటారా! రాజ్యాంగ పరిధిలోనేనా ఇదంతా???
తాము ఈ వ్యవస్థకు నాలుగో స్తంభంగా భావించే మీడియా (టీ వీ మరియు పత్రికలు)ఈ మౌలికమైన విషయం గురించి ఏనాడు చర్చలను చేసినట్టు కనపడదు. ఇదంతా మామూలే అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ వైఖరి. ప్రతి చిన్న విషయాన్ని గోరంతలు కొండంతలు చేసే ఎందుకూ కొరగాని విషయాలమీద కూడ లైవ్ ప్రసారం చేసే ఈ మీడియా ముఖ్యమైన ఈ విషయాన్ని పట్టించుకోక పోవటం విడ్డూరమే కాదు గర్హనీయం కూడ.

4 కామెంట్‌లు:

  1. మనం అనుకుంటున్న ప్రజాస్వామ్యం నిజస్వరూపం ఇలాంటి సమయాలలోనే కదా బయటపడేది. ఎవడో ఒకడి ఫోటో పెట్టుకొని గేలిచేసి, వాడి చంక నాకుతూ బతికేస్తున్న ఈ ౩౦ శాతం ఒత్లుకుడా రాణి ప్రజా ప్రతినిధులు(?) ఇంతకంటే ఏమిచేయలేరు సార్. మనం ఎవరికీ వారు చేష్టలుడిగి చూస్తున్నంత కాలం ఈ వైకుంత పాలిలో మనమే ఎప్పుడూ కోతి ముడ్డిలోకి జారుతు౦టా౦.

    రిప్లయితొలగించండి
  2. Thank you all for making comments in my blog. What pains me most and what is scary is that the so called fourth estate ie. present unruly media, is not aware of such breach of democratic principles either out of illeteracy among them or out of sheer corruption that has seeped into the ranks of media (supporting outright one party and writing hate stories against one other party).

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.