8, సెప్టెంబర్ 2009, మంగళవారం

చందమామ అభిమాని - సురేఖ గారు

సురేఖ అన్నారు ఇక్కడ చూస్తె ఒక పెద్దాయన ఫోటో ఉన్నది ఏమిటి అని ఆశ్చర్య పోతున్నారా!ఏమిటీ చిత్రం అనుకుంటున్నారా!! ఇందులో పెద్ద మిస్టరీ ఏమీ లేదు. చందమామ ప్రియుడైన ఈయన పేరు మట్టెగుంట అప్పారావు గారు. ఈయన "సురేఖ" పేరుతో కొన్ని వేల కార్టూన్లు వేసి ప్రసిధ్ధికెక్కారు( త్వరలో ఆయన కార్టూన్ల గురించి మరొక వ్యాసంలో విషయాలు చెప్తాను ).

అప్పారావుగారు చందమామకు వీరాభిమాని. ఆయన దగ్గర చందమామల నిధి ఉన్నది. దాదాపు మొదటి నుండి 1979-80 లవరకు ఓపికగా సంచికలన్నీ పోగుచేసి వాటన్నిటిని వరుసగా బైండ్లు కట్టించి భద్రపరచారు. ఇంత చక్కగా చందమామ పత్రిక ఆఫిసులో కూడ ఉండి ఉండవు. బాంకులో పని చేసి పదవీ విరమణ చేసిన అప్పారావుగారు, ఆయన ఎంత జాగ్రత్తతీసుకుంటే చందమామలన్నీ ఇంత చక్కగాఉన్నాయి. ఉద్యోగ నిర్వహణలో వచ్చిన అన్ని బదిలీలలోను పాడుకాకుండా ఒక చోటి నుండి మరొక చోటుకు మార్చటంలో ఆయన ఎంత జాగ్రత్త తీసుకుని ఉంటారు.పుస్తక ప్రియులందరూ పాటించవలసిన ఒక చక్కటి నినాదం అప్పారావుగారు సదా చెపుతుంటారు

నా కొత్త పుస్తకం ఎవరికీ ఇవ్వను. అవి ఇప్పుడు మీకు పుస్తకాల షాపులో దొరుకుతాయి కాబట్టి. నా పాత పుస్తకాలు ఎవరికి ఇవ్వను, అవి నాకు ఎక్కడ దొరకవు కాబట్టి


ఇంతే కాకుండా హాసం అని ఒక క్లబ్ స్థాపించి ప్రతి ఆదివారం సభ్యులందరినీ సమావేశపరచి హాస్యాన్ని అస్వాదింపచేస్తుంటారు. ఒక్కటే నియమం, ఈ సమావేశాలకు, సభ్యులు చక్కటి తెలుగు వేష ధారణలోనే రావాలి. మర్చిపొయ్యాను, తెలుగు వేష ధారణ అంటే ఏమిటో చాలమందికి గుర్తు లేదేమో. చక్కగా పంచె లాల్చి ధరించి పైన కండువా వేసుకుని రావాలి అన్నమాట.

ఈ మధ్య తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో భాగంగా, తన దగ్గర ఉన్న చందమామ బైండ్లన్నిటిని చందమామ ప్రియులకోసం ఒక ప్రదర్శన పెట్టారు. అందులో, ఎవరుపడితే వారు పుస్తకాలను అటు ఇటు తిరగేసి నలిపి పారెయ్యకుండా, గ్లాసు అరల కింద ఉంచి చూపించారు. ఎంతో మంది చందమామ ప్రియులు వచ్చి, ఈ ప్రదర్శనను చూసి పులకితులైపొయ్యారు. ఆయన చందమామ ప్రదర్శనను ఈ కింది ఫొటోల ద్వారా చూసి ఆనందించండి.
****************************************


***



***



***




****

6 కామెంట్‌లు:

  1. శివ గారూ,
    చందమామ అభిమాని అంటే ఇలా ఉండాలనిపించేలా చేశారు, ‘సురేఖ’ గారు! అంత అరుదైన సంచికలను ప్రదర్శనకు పెట్టటంలో కూడా ఎంత జాగ్రత్త చూపించారు!
    చాలా ఆసక్తికరమైన విశేషం రాశారు. అభినందనలు!
    ఇంతకీ ఈ ప్రదర్శన ఎక్కడ జరిగింది?
    > తెలుగు వేష ధారణ అంటే ఏమిటో చాలమందికి గుర్తు లేదేమో. చక్కగా పంచె లాల్చి ధరించి పైన కండువా వేసుకుని రావాలి అన్నమాట.
    వ్యంగ్యాన్ని భలే రాస్తారండీ మీరూ!

    రిప్లయితొలగించండి
  2. వేణూ గారూ,

    చందమామల ప్రదర్శన ఒక ఆహ్లాదకరమైన వార్త. అటువంటి చక్కటి వార్తను సేకరించి
    మన మీడియా ప్రచురించి ఉంటే ఎంత బాగుండేది. అనేకమంది చందమామ ప్రియులను ఆహ్లాదపరిచేది.

    ఇప్పటి వార్తా సేకరణకర్తలు, సంపాదకుల దృష్టిలో ఇటువంటి చక్కటి విషయాలకు వార్తా విలువ లేదేమో|| వాళ్ళే కరెక్టేమో అని భయమేస్తోంది

    రిప్లయితొలగించండి
  3. చందమామల ప్రదర్శనకు ‘న్యూస్ వేల్యూ’ లేకపోవటమేమిటి?
    అయితే ఇలాంటివి జిల్లా/ సిటీ ఎడిషన్లలోనే వస్తుంటాయి.
    వార్తా సేకరణకర్తల, ఉప సంపాదకుల అవగాహన లోపం వల్ల ఒక్కోసారి ‘విలువైన’ వార్తా నివేదికలు కూడా అప్రధానంగా వచ్చేస్తాయనుకోండీ!

    రిప్లయితొలగించండి
  4. excellent boss.excellent article.....

    can u provide malleswari(old) movie link if u find anywhere. please

    రిప్లయితొలగించండి
  5. సురేఖ గారి మీద వ్యాసం చూసిన ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారు ఈ మైలు ద్వారా ఈ విధంగా స్పందించారు

    *****************************
    From: Jayadev Babu
    Date: 2009/9/9
    Subject: Re: Fwd: SURPRISE MAIL FROM SIVARAMAPRASAD KAPPAGANTU
    To: SIVARAMAPRASAD KAPPAGANTU

    నమస్తె ప్రసాద్ గారు
    మీ లేఖ చదివి చాలా ఆనందించాను.
    సురేఖ గారు క్రిందటి నెల మా ఇంటికి వచారు. మంచి మిత్రుడు.
    మీ బ్లాగు లో వారి గురించిన కధ చదివి మరీఆనందించాను,
    జయదేవ్
    *******************

    రిప్లయితొలగించండి
  6. వేణూ గారూ,

    అంతేలెండి, ఇటువంటి మనస్సును ఆహ్లాద పరిచే వార్తలు జిల్లా ఏడిషన్లలో, ఎక్కడో మారుమూల లోపల పేజీలలో రెండు లైన్లలో ముగింపు. కంపుగొట్టే రాజకీయాలు, హత్యలు వంటి ఒళ్ళు గగుర్పోడిచే విషయాలు ఘోరమైన బొమ్మలతో సహా మొదటి పేజీలలో పతాక శీర్షికలతో. అదే ఇప్పుడు జర్నలిజం(!)కింద చలామణి అవుతున్నది, ఖర్మ.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.