10, సెప్టెంబర్ 2009, గురువారం

తాగుబోతులే మంచివాళ్ళా!!

ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారు వేసిన చక్కటి అర్ధవంతమైన కార్టూన్


తాగుబోతులే మంచివాళ్ళా!!అని అనుమానం రావటానికి అంతకంటే దరిద్రులు, చండాలులు మనకి తారసపడటమే!! ఒక తాగుబోతు తాగి తాగి చస్తాడు, వాడి వల్ల పక్క వాడికి న్యూసెన్సే తప్ప చాలా వరకు ప్రమాదం ఉండదు. వాడి కుటుంబం వాడి ప్రవర్తన వల్ల వాడికున్న తప్పుడు అలవాటువల్ల నాశనమైపోతుంది.

కాని, సిగిరెట్టు తాగేవాళ్ళు తాగుబోతులకంటే ఎంతో ప్రమాదకారులు. కారణం, మన ప్రమేయం లేకుండా వాళ్ళు తాగి వదలిన విషపూరిత, ప్రమాదకర మైన పొగను మనను పీల్పిస్తారు. ఒక తాగుబోతు తాగి ఉండగా నలుగురిలోకి రావటానికి సిగ్గు పడతాడు. సిగిరెట్టు తాగుబోతులకి ఆ సిగ్గులేదు. నిర్భయంగా, నిరాటంకంగా నలుగురిలో కూచుని, తామేదో గొప్ప పని చేస్తున్నట్టు, ఆ వెధవపని చేస్తారు. తమ ఆరోగ్యం ఎల్లాగో నాశనం అవుతుంది, ఇతరుల ఆరోగ్యం చెడగొట్టటానికి వీళ్ళకెవరిచ్చారు అధికారం?

పొగ తాగేవాళ్ళంత అమర్యాదకరపు మనుషులు యెక్కడా ఉండరు. పక్కవాడికి అసౌకర్యమా కాదా అన్న కనీస జ్ఞానం లేకుండా ఎక్కడ పడితే అక్కడ, రైళ్ళల్లో, బస్సుల్లో, చివరకు సినిమా హాళ్ళల్లో వీళ్ళ అసభ్యకరమైన అలవాటుకు అడ్డుండదు . ఈ ఏ సి బస్సులు, రైళ్ళు, సినిమా హాళ్ళు వచ్చాక, కొంత ఈ ప్రత్యక్ష నరకం తగ్గింది. కాని, ఏ విశ్రాంతి సమయంలోనో, బస్సు ఆగినప్పుడో, అలా బయటకు వెళ్ళి ఆబగా నాలుగు పీకులు దబదబ పీక్కుని, వచ్చి మన పక్కన కూలబడతాడు ఆ నికృష్టుడు. వాడి నోట్లోంచి వచ్చే దుర్ఘంధం మనం భరిస్తూ, తప్పదు కనుక కూచోవాలి.

తాగుబోతు కొంతలో కొంత ఎవరన్నా అదిలిస్తే పోతాడు ఆవతలకి. కాని ఈ సిగిరెట్టు వాడు, ఎవరన్నా ఎంత అబ్యంతర పెడితే అంత ఎక్కువ ఎగబడి కాలుస్తాడు.

అందుకనే ప్రభుత్వం చేసిని మంచి పనులలో మొట్టమొదటిది, నలుగురూ కూడే స్థళాలలో పొగ తాగటం నిషేధించటం. ఎంత నిషేధం ఉన్నప్పటికి, ఇంకా తక్కుతూ తారుతూ మన ఆరోగ్యం పాడు చెయ్యటానికి తమ అనారోగ్యపు అలవాటును కొనసాగించే ఈ సిగిరెట్టు తాగుబోతులను చూస్తుంటే అనిపిస్తుంది, అసలు తాగుబోతులే నయమేమో అని.

ఈ కింద ఇచ్చిన రెండు లింకులతో రెండు చక్కటి వీడియోలు చూడండి. అద్భుతంగా తీశారు. ఇవి చూసినాక కూడ ఇంకా ఎవరన్న నలుగురిలో పబ్లిక్ స్థల్లాల్లో సిగిరెట్టు తాగుతుంటే, ఇక వాళ్ళని బాగుచెయ్యటానికి ప్రయత్నించటం అనవసరం. సంఘంలో ఉండతగరు.


5 కామెంట్‌లు:

  1. ఆ బ్రహ్మదేవుడు తెలివితక్కువవాడండీ. తాటిముంజకాయల్లాగా నాలుగు తలకాయలున్నాయి కానీ, అందులో "కళ్ళు"లేవు. అది లేకే ఈ పొగబోతుల్ని తయారుచేసాడు. లక్కముద్ర వేసి ఆ పొగ నోరు అంటించి పారేస్తే గానీ, కుడితి కుతి తీరదు. కాకపోతే బ్రహ్మదేవుడు ఒక మంచి పని కూడా చేశాడండీ. ఒక్కోడికి రెండూ మూడు నోళ్ళు, ఐదు ఆరు ఊపిరితిత్తులు, నాలుగైదు చేతులు ఇవ్వలా, ఒక వేళ ఇచ్చుంటే చక్కగా పొగబోతులు పోట్లగిత్తలైపోయేవారు.

    రిప్లయితొలగించండి
  2. @jalasutram బాగుందండి ఒక వైపు బ్రహ్మదేవుడు తెలివి తక్కువ వాడంటారు, మరోప్రక్క మంచిపని చేసాడంటారు.ఆయన అవయవాలిచ్చింది వాటిని సక్రమంగా వాడుకునేదానికి, దాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటూ ఆయన్ను ఆడిపోసుకుంటే ఎలా ?

    రిప్లయితొలగించండి
  3. ఎన్ననుకుని ఏం లాభం?...ఆరోగ్యవంతుల మధ్య ' పొగ ' రాజేసే ఇటువంటి ' పొగ 'రు బోతుల ఆఖరి దశలో వారి చితినుండి వెలువడేది ఆ 'పొగే'నని వాళ్లు గ్రహిస్తే చాలనుకుందాం!

    రిప్లయితొలగించండి
  4. I really like to read chandama, balamitra stories when I was a kid.Now I want adopt that my daughter Siri.so that they know what is good and bad things they should follow.
    thank Q so much for sharing this info on this blog Sir.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.