26, సెప్టెంబర్ 2009, శనివారం

మా ఊరు - 1 (వెన్నూతల)

నేను ఈ ఊళ్ళో పుట్టలేదు, పెరగలేదు, నాకు ఇరవై ఏళ్ళు వచ్చేవరకు అక్కడకు వెళ్ళలేదు.కాని, మా నాన్నగారు, వారి పూర్వీకులు, ఈ గ్రామం వారు. మా పూర్వీకుల గ్రామాల గురించి వ్రాద్దామని మొదలు పెట్టి మొదట మా తండ్రి గారి వైపునుండి మొదలుపెట్టాను. మరొక వ్యాసంలో మా అమ్మగారి గ్రామం గురించి . ***********************************************************

వెన్నూతల, కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము విజయవాడకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. గ్రామ జనాభా సుమారు 2000-నుండి 3000 వరకు ఉండవఛ్ఛును. ఈ గ్రామము గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గము పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామ ప్రజలు పూర్తిగా వ్యవసాయము మరియు వ్యవసాయ సంబంధ వృత్తులపై ఆధారపడి ఉన్నారు. ఇక్కడి వ్యవసాయ కుటుంబాల వారు దాదాపు 3-4 తరాల వెనుక తూర్పు జిల్లాల నుండి వలస వచ్చారని పెద్దలు చెబుతుంటారు.


ప్రయాణ సదుపాయాలు ప్రత్యేకముగా ఈ గ్రామమునకు బస్సు సౌకర్యాములేదు. దగ్గరలోని రైలు స్టేషను తరిగొప్పుల(విజయవాడ-మచిలీపట్నం మార్గము) గన్నవరమునుండి(4-5 కిలోమీటర్ల దూరం) వరకు ఆటోలో వెళ్ళవచ్చును (ఫొటోలో చూడండి),విజయవాడ, ఏలూరు మరియు ఇతర పట్టణాలకు జాతీయ రహదారిపై తిరిగే వాహనాల ద్వారా(గన్నవరం మీదుగా) ప్రయాణం చేయవచ్చును. (అధికంగా బస్సులు). విజయవాడ నుండి ఈ గ్రామము మీదుగా ఒక సిటీ బస్సు (116 నంబరు)నడుస్తున్నది.


వ్యవసాయం
ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం. ప్రధానమైన పంట వరి.


నీటి వనరులు
వ్యవసాయం కొరకు , కృష్ణా నది నుండి ఈ గ్రామము మీదుగా ఒక కాలువ కలదు.


ఆలయాలు
ఈ ఊరిలొ ఒక పురాతనమైన శివాలయం ఉంది. అది దాదాపు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడినది. .2006-07లో ఈ ఆలయమును పునరుద్ధరించినారు. ఆ సమయములొ జరిగిన తవ్వకాలలో లభ్యమయిన ఆధారాల ప్రకారము ఈ ఆలయమును 1880 ప్రాంతములో నిర్మించి ఉంటారని తెలుస్తున్నది. ఈ ఆలయమును కప్పగంతు మరియు లొల్లా వారి కుటుంబముల వారు నిర్మించినారని పెద్దలు ఛెప్తారు. ఈ ఆలయము ముందు ఒక పెద్ద కోనేరు(చెరువు) ఉంది.ప్రతి సంవత్సరం మే నెలలో వైశాఖ పౌర్ణమి రోజున రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కల్యాణం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారి కల్యాణం చూసి ఆనందిస్తుంటారు. ఆలయ ధర్మకర్తలైన ఇటీవల ఊరిలో ఉన్న పురాతనమైన రామాలయంను కూడా పునరుద్ధరించారు. ఈ ఆలయం కూడా కోనేరుని ఆనుకొని వున్నది.

ఇతర సదుపాయాలు కప్పగంతు అచ్యుతరామయ్య గారు గ్రామ పంచాయతీ సర్పంచిగా ఉన్న కాలములో ఈ గ్రామమునకు రహదారి ఏర్పడింది. కప్పగంతు లక్ష్మినరసింహం గారు రహదారి కొరకు తన పొలమును ప్రభుత్వమునకు ఇచ్చుటకు ముందుకు రావడం వల్ల ఇది సాధ్యమయ్యింది. రహదారి 1967-69లొ పూర్తయ్యింది.


ప్రయాణ సదుపాయాలు ప్రత్యేకముగా ఈ గ్రామమునకు బస్సు సౌకర్యాములేదు. దగ్గరలోని రైలు స్టేషను తరిగొప్పుల(విజయవాడ-మచిలీపట్నం మార్గము) గన్నవరమునుండి(4-5 కిలోమీటర్ల దూరం) వరకు ఆటోలో వెళ్ళవచ్చును (ఫొటోలో చూడండి),విజయవాడ, ఏలూరు మరియు ఇతర పట్టణాలకు జాతీయ రహదారిపై తిరిగే వాహనాల ద్వారా(గన్నవరం మీదుగా) ప్రయాణం చేయవచ్చును. విజయవాడ నుండి ఈ గ్రామము మీదుగా ఒక సిటీ బస్సు (116 నంబరు)నడుస్తున్నది.

అబ్దుల్లా

మా ఊరులో కొంతకాలం మా పొలం కౌలుకి తీసుకుని పంట పండించిన అబ్దుల్లా(మా నాన్నగారికి మంచి స్నేహితుడు),నేను మా ఊరుకి వెళ్ళినప్పుడు, ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేక, పక్కనే ఉన్న గన్నవరంలో ఉంటున్నాడని తెలిసింది. ఆయన అనారోగ్యం వల్ల మాట సరిగ్గా రావటంలేదు. ఆయన నాటకాలలొ వేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా హరిశ్చంద్ర లో పద్యాలకు, గ్రామంలో మంచి పేరున్నది.

అంత అనారోగ్యంలోనూ, నన్ను చూసి ఆనందంగా కూచుని మంచి మాటలు నాలుగు మాట్లాడి, అదే ఊపులో పద్యం అందుకున్నాడు.పద్యం పెద్దగా అర్థం కాకపోయినా, ఆయన ఉత్సాహం గమనించాలి.నాకు మా బాబాయిలు ఎంతో ఈయన కూడ అంతే.వీడియో చూసి/విని ఆనందించండి.


1 వ్యాఖ్య:

  1. మీ ఊరు చాలా బాగుంది. అబ్దుల్లా గారి గురించి చదువుతుంటే మా ఊరు శిర్సనగండ్లలో మా ఇంటి పక్క వున్న గుట్టపైన వుండే ముస్లిము కుటుంబాలు గుర్తుకొచ్చాయి. చిన్నపుడు ఆ గుట్టపైకి వెళ్ళి అక్కడి చిం చెట్టుకుండే చింతపండు రాలకొట్టి తినేవాళ్ళం. వాళ్ళు తేనె అమ్మేవారు. గాజు సీసా పట్టుకొని వాళ్ళ దగ్గర కొనడానికి వెళ్ళేవాడిని. ఇంకా ఊళ్ళో జరిగే పీర్ల పండగ బాగుండేది.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.