26, సెప్టెంబర్ 2009, శనివారం

మరోసారి పరాభవం!!

తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ గారికి "మరోసారి పరాభవం" ట తెలుగులో అతిపెద్ద అమ్మకపు అంకెలు గల పత్రిక వాపోయింది ఈరోజున (ఇరవై ఆరు సెప్టెంబరు రెండువేల తొమ్మది). ఏమిటిట పరాభవం?? తెలియని పోలీసు ఎవరో ఈ చైర్మన్ కారుని ఆపాడుట వెంటనే వారు కాలినడకన వెళ్ళాల్సి వచ్చిందట. ఇందులో పరాభవమేమిటో నాకైతే అర్థం కావటంలేదు.

తాను అక్కడకు వచ్చింది తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ గా. పోలీసులను పెట్టింది, జనాన్ని మాత్రమే అదుపు చెయ్యటానికి పెట్టింది ఆ దేవస్థానం వారే. పోలీసొకడు, అతను వీరెవరో తెలిసి కూడ, అక్కడి నియమం ప్రకారం కారు అంతకు మించి వెళ్ళకూడదంటే, అటువంటి పోలీసుని మెచ్చుకోవాల్సింది పోయి, అలగటమా. ఎవరిమీద ఈ అలక? దేవస్థానం మీదా లేక దేవుడి మీదా. వార్తలో వ్రాసిన ప్రకారం వారు అలిగి శ్రీవారి వాహనం ముందు హారతి తీసుకునేందుకు నిరాకరించారట!! ఎంతటి అపచారం? దేవుడిముందా ఇటువంటి ప్రవర్తన. మొన్నొక రోజున, విజయవాడ దుర్గగుడిలో కూడ ఇదే పధ్ధతిన మరొకడు వీరంగం వేశాడు. వీళ్ళ ఉద్దేశ్యం ఏమిటి, దేవుడి గుడి దగ్గర కూడ వీళ్ళ అహంకారాన్ని వదులుకోలేరా?

తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ అయ్యి ఉండి, హుందాగా ప్రవర్తించి, మిగిలిన యాత్రికులకి ఏర్పరిచిన నియమ నిబంధనలన్నిటిని తాను పాటించి చూపించవలసిందిపోయి, ఈ పెద్దమనిషి ఇలా అనుచితంగా ప్రవర్తిస్తాడా!

ఆపైన, శ్రీలంక హై కమిషనరు వచ్చి ఉంటే, ఆయనను లోపలకి ఆహ్వానించటానికి ఎవరూ రాలేదుట. వీరి ఆధ్వర్యం అలా ఏడిచింది మరి. ఆ విషయం మీదకూడ అలగటమే. తన్ని తాను పరిచయం చేసుకుని, ఆ హై కమిషనర్ ని వెంటపెట్టుకుని గుడిలోకి తీసుకుని వెళ్ళాల్సింది. అక్కడి విషయాలను ఆకళింపుచేసుకుని, అన్ని వ్యవహారాలు చక్కదిద్దటానికి చైర్మన్ గాని, అలగటానికి, అక్కడ జరిగే కార్యక్రమాలకు అడ్డు పడటానికి కాకూడదుకదా. పేను పెత్తనం ఇదేనేమో!


ఆపైన మీడియా మరొక్కసారి వార్తలను ఏవిధంగా ప్రచురించాలో తెలియని అజ్ఞానాన్ని ప్రదర్శించింది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు తి.ది.దే చైర్మన్ అనుచిత ప్రవర్తన అని శీర్షిక పెట్టాల్సిందిపోయి, పరాభవం అని వ్రాయటం ఏమిటి??పైగా ఏదో గొప్ప పనిచేసినట్టు, ఫొటో కూడ వేసిమరి. అసలు వేయాల్సింది, ఆ పోలీసు ఫొటోని.

1 వ్యాఖ్య:

  1. బాగుంది.
    మనవాళ్ళ పద్ధతి ఏవిటంటే, ప్రతీ చోటా పోలీసులదో, మరో సెక్యూరిటీదో గొప్ప ఆర్భాటమైన బందోబస్తు పెట్టడం, అటూపైన ఎవడు ఆ బందోబస్తుని ఎంత విర్రవీగుతూ అతిక్రమించి పోగలరో చూపించుకోవడం వీళ్ళ బల ప్రదర్శనకి గుర్తింపన్న మాట. అసలు వెయ్యాల్సింది పోలీసు ఫొటోని అని మీరన్నది సూపరు కరక్టు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.