8, అక్టోబర్ 2009, గురువారం

శేష ప్రశ్నలు లేదా సామాన్యుని సణుగుడు


ఈ మధ్య మన రాష్ట్రానికి మెరుపు వరదలు వచ్చినాయి. ఈ వరదల గురించిన కొన్ని శేష ప్రశ్నలు



  1. వాతావరణ కేద్రాలు రాష్ట్రంలో ఈప్పుడు ఎంత వర్షపాతం పడే అవకాసం/ప్రమాదం ఉన్నది అని హెచ్చరించగల స్థితిలో ఉన్నాయా లేదా?


  2. అల్లాంటి సామర్ధ్యం ఆ యా కేంద్రాలకు ఉంటే, వారు ఎప్పుడు ఎ విధమైన హెచ్చరికలు చేసారు ఎ ఎ ప్రాంతాలలో వర్షం పడే అవకాశంఉన్నదని వారు చెప్పినట్టుగా ఉన్నది


  3. అటువంటి వాతావరణ హెచ్చరికలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు చూసి స్పందించాలి. అలా ఎవరికన్నా ప్రత్యేకంగా బాధ్యత ఇవ్వబడినదా?


  4. అలా ఎవరికీ బాధ్యత ఇవ్వకపోతే అందుకు కారణం ఏమిటి? పూర్తిగా పరిపాలనా సామర్ధ్యపు లోపమా ?


  5. అటువంటి బాధ్యత ఎ వ్యక్తికి గాని, శాఖకు గాని ఇవ్వబడి ఉంటే వారు ఏమి చేసారు.


  6. అంత భారీ వర్షం పడుతున్నప్పుడు, (పడటం మొదలు పెట్టినాక) అలా జరుగుతున్నా వైనం గమనించే యంత్రాంగం మనకు ఉన్నదా? ఉంటే వారేమి చేసారు, ఎవరికీ చెప్పారు. అలా చెప్పబడినవారి బాధ్యత ఏమిటి.


  7. రాష్ట్రంలో ఎ ప్రాంతంలోనైనా సరే వర్షం భారీగా పడుతూ, వరద ప్రమాదం ఉన్నప్పుడు తగిన చర్యలు తీసుకోవలసిన బాధ్యత ఎ శాఖ ది


  8. పైన ఎగువ ప్రాంతాలలో భారీవర్షాలు పడుతున్న విషయం గమనించినప్పుడు రాబొయ్యే ప్రమాదాన్ని పసిగట్టి మనకున్న ప్రాజేక్టులవద్ద, నీరు వదలటమా వదలక పోవటమా అన్నా కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం గలిగిన ఆఫీసర్లు ఉంటారా?


  9. వరదలను నివారించటానికి నీళ్లు వదలటం లేదా మళ్ళించటం వంటి చర్యలు, మామూలుగా అధికారులు వారి రోజువారి పనిలో భాగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నదా లేక తప్పనిసరిగా మంత్రుల అనుమతి తీసుకుని తీరాలా.


  10. శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి నీరు వచ్చి చేరుతున్నదని, మరింత నీరు వస్తే ప్రమాదమని ఎప్పుడు గమనించారు. నీరు వదలాలి అని నిర్ణయం తీసుకోవటంలో జాప్యం జరిగిందా. అలా జాప్యం జరిగితే, దానికి కారణం కన్న బాధ్యులు ఎవరైనా ఉన్నారా


  11. వరదలు రావటానికి రాజకీయ నాయకుల అనుచిత చర్యలు కారణమన్న అరోపణకి జవాబు చెప్పకుండా, బాధితులను ఆదుకోవాలని సాకు చెప్పి తప్పించుకోవటం ఎంతవరకు సమంజసం.


  12. ఇంత ఘోరమైన వరదలు వచ్చి ప్రలందరూ నానా అగచాటులు పడుతుండగా, ముఖ్యమంత్రి, రాత్రిపూటకూడ సెక్రటేరియట్లోనే ఉండి పరిస్థితి గమనిస్తూ తగిన ఉత్తర్వులు ఇస్తూ ఉండగా, నీటి పారుదల శాఖ మంత్రిగారైన శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు ఎక్కడ ఉన్నారు?

దయచేసి ఈ వ్యాసం చూసిన వారు, ఈ బ్లాగులోనే కుడిపక్కన బాగా పైన ఉన్న పోల్ లో ఓటు వెయ్యగలరు. ఓటు వేసేప్పుడు, దయచేసి ఎమోషనల్ గా కాకుండా, ఆ విషయం మీద పూర్తి అవగాహనతో వోటు చెయ్యమని మనవి ప్రార్ధన

1 కామెంట్‌:

  1. శివరాం గారూ,
    నా ఓటు ఆరోజే వేసేశాను. కామెంట్ పెట్టడం మర్చిపోయాను. ఇదీ సంగతి.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.