8, నవంబర్ 2009, ఆదివారం

హామ్ ఫెస్ట్ 2009

మన దేశంలో హామ్ రేడియో హాబీ మంచి ప్రాచుర్యంలో ఉన్నది. వేల మంది ఈ హాబీలో ఉన్నారు. సామాన్యంగా ఈ హాబీలో ఉన్నవారు తమ తమ రెడియోలద్వారా ఇతర హామ్ లతో మాట్లాడుతూ సాంకేతిక పరమైన విషయాలను చర్చిస్తూ తమ హాబీని మరింత అభివృద్ది పరచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు, హామ్ ఫెస్ట్ ఏర్పరుచుకుని దేశంలో ఏదో ఒకచోట తమ మీటింగు ఏర్పరుచుకుని ఒకరినోకరిని కలుసుకోవడమే కాకుండా, కొత్త కొత్త హామ్ సామగ్రి కొనుగోలు చేసుకోవటం, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవటం చేస్తూ ఉంటారు. ఈ విధంగా జరిగే మీటింగు లను హామ్ ఫెస్ట్ అని పిలుస్తారు హామ్ ఫెస్టివల్ కు హ్రస్వ రూపం. ఈ సంవత్సరం ఈ హామ్ ఫెస్ట్ బెంగుళూరులో నవంబరు ఏడు, ఎనిమిది తేదీలలో జరిగింది. ఇది 18 వ హామ్ ఫెస్ట్. ఈ హామ్ ఫెస్ట్ బెంగుళూరు అమెచ్యూర్ రేడియో క్లబ్ గోల్డెన్ జూబిలీ సందర్భంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సంబరం జరుగుతుండగా తీసిన కొన్ని ఫోటోలు.

బెంగుళూరు హాం ఫెస్ట్ ప్రవేశద్వారం వద్ద
దశాబ్దాల పాటు ఒకరితో ఒకరు హామ్ రేడియో ద్వారా మాట్లాడుకుంటూ, హామ్ ఫెస్ట్ లో కలుసుకున్న సీనియర్ హామ్ ల ఆనందం

పై ఫోటోలో ఉన్నవారు VU2 PAL మరియు VU2 JJS


ట్విన్స్ లాగ ఉన్నా ఇద్దరు హాములు


పాత రేడియో సామగ్రి అమ్మకం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.