11, నవంబర్ 2009, బుధవారం

నవ్వడం ఒక భోగం

శుభ్రతే దైవత్వం అని చాటి చెప్తున్నచోటే శుభ్రత లేకపోవటం!!

ఈ హోర్డింగు ముంబాయి నగరంలోని చర్చ్‌గేట్ స్టేషన్ బయట ప్రముఖంగా ప్రదర్శించబడుతున్నది

జంధ్యాల గారు చెప్పినట్టుగా నవ్వడం ఒక భోగం. నవ్వలేకపోవడం ఒక..........

మన రోజువారి జీవితంలొ మనం అనేక పనులు చేస్తూ ఉంటాం, అందరితో కలసి, నలుగురితో నారాయణా అనుకుంటూ. కాని అనేకసార్లు అందరూ చేస్తున్నా, అవి అంత మంచి పనులు కాకపోవచ్చు.

1. మన ఇంట్లో ఉండే ప్లాస్టిక్ చెత్తని నాశనం చేద్దామని ఎవరూ అనుకోరు. ఉల్లిపాయలో మరింకొకటో వస్తాయని అవి అమ్మేయటం, అవి మళ్ళి కారీ బాగ్‌లుగానో మరో రూపంలోనో వచ్చి మనకి అన్నిరకాలుగా చీకాకు పరుస్తుంటాయి. మనదగ్గర ఉన్న పనికిరాని గ్లాసు వస్తువులు ఎప్పుడూ పెద్దగా పట్టించుకోం. గాజు వస్తువులను మళ్ళి ఉపయోగంలోకె తేవటం ఎలా అందులోనూ నవ్వుతూ?


2.చక్కగా సరసరా పైకి నడిచే ఎస్కలేటరు (కదిలే మెట్లు)ఉండగా మామూలు మెట్లమీద ఎవరు పైకెక్కుతారు. చాలా తక్కువమంది. అలా కాకుండా, ఎస్కలేటరు ఉన్నప్పటికీ, మామూలు మెట్లమీదగా జనాల్ని నడిపించటం ఎలా?(వాళ్ళ ఆరోగ్యంకోసమే!!)


3. మన చేతిలో పనికిరాని కాయితమో, చేక్లెట్ రేపరో, వేరుసెనగ డిప్పలో ఏమాత్రం సంకోచం లేకుండా నేలమీద పారేసుకుంటూ తిరిగేస్తుంటాం. ఈ విషయంలో అక్షరాస్య-నిరక్షరాస్య సమస్యలేదు, అంతా ఏకాభిప్రాయమే. కాని చెత్తబుట్టలోనే పారెయ్యటం ఎప్పటికి అలవడుతుందో కదా!! అటువంటి మంచి అలవాటు చెయ్యటం ఎలా?

మంచి పనులు కానివి చేయటంనుండి మానిపించటం ఎలా?? హాస్యమే మార్గమా?? అవుననే సమాధానం వస్తున్నట్టుగా ఉన్నది. నిరంకుశంగా చెప్తే ఎలాగూ జనం వినరు,కొంచెం హాస్యం జోడించి కనుక చెప్పగలిగితే నవ్వటం వల్ల వచ్చే మానసిక వికాసం వల్ల ఆ మంచి విషయం "బోధపడి" తప్పకుండా ఆచరణలోకి తెస్తారని ఒక వెబ్సైటువారు ఆశపడుతున్నట్టున్నారు.

హాస్యాన్ని జోడించి సామాన్య పౌరులకు మంచి అలవాట్లను తెలియచెప్పే వెబ్ సైటుకు లింకు ఈ కింద ఇవ్వబడింది. అందులో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. చూసి ఆనందించండి.

>నవ్వుతూ నేర్చుకోవటం




*************************************************************************************

1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.