మనకు ఈ మధ్య వచ్చిన వరదలకు కారణం ఏమిటి?? మన ఘనత వహించిన మీడియా కొన్ని రోజులు హడావిడి చేసింది . రాజకీయ నాయకులు కూడా ఒకటి రెండు రోజులు చెలరేగిపొయ్యారు. ప్రస్తుతానికి ఈ విషయం అందరూ మర్చిపోయినట్టుగా నటిస్తున్నారు. మీడియా కాని, రాజకీయ నాయకులు కాని ఈ నోరెత్తటం లేదు. కారణం వారికే తెలియాలి !! ఎంతసేపు ఒక అనామక మంత్రి రాజినామా, లేదా ఒక నగరంలోని ఎన్నికలు ఇదే పాటగా ఉన్నది అందరి నోళ్ళలోనూ. ఈ వరదలు నిజంగా మానవ తప్పిదం వల్ల వచ్చి ఉంటే,
1. ఆ మానవులు ఎవరు?
2. వారి తప్పిదం ఏమిటి?
3. ఆ తప్పిదం పొరపాటున జరిగిందా లేక కావాలని స్వార్ధ రాజకీయాల/లాభం కోసం చేసారా?
4. పైన చెప్పిన రెండవ కారణం ఐతే ఆ తప్పు చేసిన వారికి శిక్ష ఏమిటి? తమ తప్పిదంతో కోట్ల రూపాయల నష్టం, ప్రజలకు అంతులేని కష్టం తెచ్చినందుకు.
5. కారణం మూడవది అయితే, ఎవరు ఇంత ఘోరానికి పాల్పడింది, వారి ఎలా శిక్షించాలి?
ప్రజల జ్ఞాపక శక్తి ఓకటి రెండురోజులకంటే ఉండదన్న ధీమాతో ఇటు మీడియా అటు రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నట్టుగా ఉన్నది. ఎంత కొట్టుకు చచ్చినా, ఎంతెంత ఛండాలపు మాటలు ఒకరినొకరు అనుకున్నా, ఈ రాజకీయ నాయకుల మధ్య మంచి అవగాహన ఉన్నట్టుగా కనపడుతున్నది. ఒక విషయం ఒక రాజకీయ పార్టీకి మరీ ఇబ్బందికరమైనప్పుడు, వారు మిగిలిన రాజకీయ పార్టీలను సంప్రదించి ఇక ఈ విషయం మాట్లాడద్దు అన్న అవగాహనకు వచ్చి గమ్మున ఉంటారనిపిస్తున్నది.అలా అవసరాలు ఎవరికైనా వస్తాయి కదా!! ఇక మీడియా, ఒక్కొక్క పేపరు, ఒక్కొక్క టి వి చానెల్ ఒక్కొక్క పార్టీ చేతులో ఉన్నట్టుగా వాళ్ళు వ్రాసే వార్తలు, కావాలని ఒక కోణం మాత్రమే ఎక్కువగా చూపించటం ద్వారా మనం గమనించవచ్చు.
ఇప్పటికైనా ఈ వరదలు రావటానికి కారణం ఏమిటి అన్న విషయం మీద సమగ్రమైన విచారణ జరగాలి, తప్పు చేసినవారికి తగిన శిక్ష విధించాలి. ఇందుకు మీడియా సహకరిస్తుందా. చాల్లే ఇంకా ఈ విషయం మీద వ్రాస్తే, చూపిస్తే , చూసేవాళ్ళు ఉండరు, పైగా రాజకీయ బాసులులకి కోపం వచ్చి వ్యాపార ప్రకటనలు ఇవ్వరు, లేదా వారివారికున్నఇతర వ్యాపారాలు ప్రభుత్వంపరంగా దెబ్బతింటాయని ఊరుకుంటారా? ఇదేమీ పత్రికా స్వాతంత్రం అని మనం విస్తుపోవాలా!! ఇప్పుడు లేగుతున్న రాజకీయ దుమారం ఈ వరద తప్పులను కప్పి పెట్టి ప్రజల దృష్టిని మరల్చటానికి కాదు కదా??!!

ఇలాంటప్పుడే మీడియా తమకున్న వనరులతో నిజాన్ని నిగ్గు తేల్చాలి, చేతులు ముడుచుకుని కూచుని రాజకీయ నాయకులకు వంతపాడకూడదు.
.
కాని మీడియా లోని కొన్ని వర్గాలు రాజకీయ పార్టీల కొమ్ము కాయటమే తమ ప్రధాన లక్ష్యంగా ఉద్భవించినవి. అవి నిష్పాక్షికమైన వార్తలు రాయాలని ఆశించడం మన అమాయకత్వం. కాని మన దురదృష్టవశాత్తూ ఆ పత్రికలే ఎక్కువ ప్రజామోదాన్ని పొందుతున్నాయి. అత్యధిక సర్క్యులేషన్ తో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి.
రిప్లయితొలగించండి