13, నవంబర్ 2009, శుక్రవారం

చందమామ అభిమానులకు శుభవార్త

చందమామ కు అభిమానులు కోకొల్లలు. అందులోనూ 1960-1970 లలో చదివినవారు మన చందమామ పత్రికను ఎప్పటికి మర్చిపోరు. ప్రస్తుతం, సాంకేతికపరమైన అభివృద్ది పుణ్యమా అని చందమామ అభిమానులు తమ తమ బ్లాగుల్లో తమ అభిమాన పత్రిక గురించి అనేక వ్యాసాలూ వ్రాసారు, ఇంకా వ్రాస్తారు కూడా. చందమామ అభిమానులకు ఇటువంటి వ్యాసాలన్నీ ఒకే చోట అందివ్వగలిగితే అని కొంతమంది చందమామ అభిమానులకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు రూపమే "మన తెలుగు చందమామ" బ్లాగు అవతరణ. ఈ కింద ఇచ్చిన లింకు నొక్కి ఆ బ్లాగును సందర్సించవచ్చు:

మన తెలుగు చందమామ

ఇందులో ఇప్పటికే బ్లాగుల్లో చందమామ గురించి వ్యాసాలూ వ్రాసిన వారు భాగస్వాములు అయ్యారు. వారి వారి బ్లాగుల్లో మునుపు వ్రాసిన వ్యాసాలూ ఈ బ్లాగులో ఉంచుతారు. ఇక ముందు వ్రాయబోయ్యో వ్యాసాలను, ఈ బ్లాగులో కూడా ప్రచురిస్తారు. ఒక్కటే ఉద్దేశ్యం చందమామ అభిమానులకు చందమామ గురించి సమగ్రంగా ఒక బ్లాగును నిర్వహించి సమాచారాన్ని విశేషాలను పంచుకోవటమే.ఈ బ్లాగులో చందమామ అభిమానులు ఎవ్వరైనా భాగస్వాములు కావచ్చు.ఇలాగే కొడవటిగంటి , చలం, శంకరమంచి సత్యం వంటి చక్కటి రచయితల గురించి బ్లాగుల్లో అనేక చోట్ల వ్రాస్తున్నారు. ఈ వ్యాసాలన్నీ కూడా ఒకే బ్లాగులో చూడ/చదవ గలిగే అవకాశం రావాలని ఆశిద్దామా.

5 వ్యాఖ్యలు:

 1. శివ గారూ, మన చందమామ బ్లాగు పోస్టు కు మీరిచ్చిన లింక్ ఓపెన్ కావటం లేదండీ.

  ఆసక్తి ఉన్నవారు కింద ఇచ్చిన యూఆర్ఎల్ ద్వారా ఈ కొత్త బ్లాగును చూడొచ్చు.
  http://manateluguchandamama.blogspot.com/

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Dear Venu,

  Thanks for informing me. In the morning just before rushing to Office I did the work. Now I rectified the link and its working.

  Please post all your Articles on Chandamama in this Blog. I am posting all the articles written by me here.

  Likewise Rajugaru also doing. Madam Sujata promised to do so.

  If you know E mail of Shri Nagamurali, please inform him. He too can join our Group and add his articles here.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. siva garu....manchi pani chesaru....chestunaru...
  meeku post chesa...alreadt....kaani.. publish kaledu.....tappu vunte cheppandi

  ప్రత్యుత్తరంతొలగించు
 4. siva garu....manchi pani chesaru....chestunaru...
  meeku post chesa...alreadt....kaani.. publish kaledu.....tappu vunte cheppandi

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.