19, నవంబర్ 2009, గురువారం

వేరుశనక్కాయల ఉత్సవం


వేరుశనక్కాయల ఉత్సవం అని చెప్పగానే ఇదేమిటి పల్లీలకు ఉత్సవమేమిటి, అదీ బెంగుళూరులో అని ఆశ్చర్యం కలిగింది. కాని, ఆ ఉత్సవం చూసొచ్చిన మీదట ఇలా ఉత్సవం జరపటం సబబే అనిపించింది.

చరిత్ర:
చాలా సంవత్సరాల క్రితం బెంగుళూరు ప్రాంతం అంతా కూడ వేరుశనక్కాయలు పండించేవారుట. పంట పండి దాదాపు చేతికి అందే సమయానికి ఎక్కడినుంచో ఒక పెద్ద ఎద్దు వచ్చి తిన్నంత తిని మిగిలిన పంటను ధ్వంసం చేసిపారేసేదిట. రైతులంతా ఓ రోజున కాపుకాసి జరిగే ఈ నష్టానికి కారణమైన ఎద్దుని తరిమారట. ఆ ఎద్దు పరిగెత్తి పారిపోతూ, ఒక కొందమీదకు వెళ్ళి శిలగా మారిందట. అది చూసిన రైతులు భయపడి, ఆ ఎద్దు శిలా విగ్రహానికి పూజలు చేసి, తమ పంటలో కొంత నైవేద్యం పెట్టటం మొదలుపెట్టారు. మరికొంతకాలానికి, బెంగుళూరు వ్యవస్థాపకుడిగా పేరొందిన కెంపెగౌడ ఈ శిలా విగ్రహానికి ఆచ్చాదన ఏర్పరిచి, గుడిగా మలిచారట. ఆ గుడే, ఈరోజున ప్రసిధ్ధిగాంచిన "బుల్ టెంఫుల్" . ఈ విధంగా వేరుశనగ రైతులు, ఇప్పటికి ఈ గుడికి వచ్చి తమ పంటను బసవన్నకు నైవేద్యం పెడుతూనే ఉన్నారు. అదే ఈ వేరుశనక్కాయల ఉత్సవం.ఈ ఉత్సవాన్ని కడెలికాయే పరిషే అని కన్నడంలో వ్యవహరిస్తారు.

ఎప్పుడు చేస్తారు:
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని చివరి సోమవారం నాడు ప్రారంభం అయ్యి రెండురోజులు జరుగుతుంది ఈ ఉత్సవం.

ఎక్కడ జరుగుతుంది:
బెంగుళూరు నగరం నడిబొడ్డున ఉన్న బసవన్న గుడి (బుల్ టెంపుల్) బయట రోడ్డుమీద ఈ వేరుశనక్కాయల ఉత్సవం జరుగుతుంది.

ఉత్సవ విశేషాలు:
తమ పంటను బసవన్నకు నైవేద్యం పెట్టిన తరువాత అక్కడే రోడ్డుమీద రైతులు అమ్మకానికి పెడతారు. బెంగుళూరు ప్రజలు వేలాదిగా పాల్గొని, రకరకాల వేరుశెనక్కాయలను చూసి తమకు ఇష్టమైన వాటిని సరసమైన ధరలో కొనుక్కుంటారు. ఈ ఉత్సవం సందర్భంగా ఆరోడ్డు మొత్తం ట్రాఫిక్కును ఈ రెండురోజులూ నిషేధిస్తారు. రైతులతో పాటుగా అనేక చిన్న వ్యాపారులు తమ తమ సరుకులను అమ్ముకోవటం మరొక విశేషం. మొత్తం మీద ఒక తిరణాల వాతావరణం బెంగుళూరు నగరంలోని ఈ ప్రాంతాన ఈ రెండురోజులు ఏర్పడుతుంది.

వేరుశనక్కాయల ఉత్సవానికి సంభంధించిన కొన్ని బొమ్మలను ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు
వేరుశనక్కాయల ఉత్సవం ఫోటోలు

4 కామెంట్‌లు:

  1. అవును శివగారూ, ఇది నేనూ చూశాను. మేము బెంగుళూరులో ఉన్నపుడు దీని గురించి ఈనాడు కర్ణాటక ఎడిషన్ లో చదివి బసవన్న గుడి కి వెళ్ళి(మేము బన్నేరు ఘట్ట రోడ్ లో ఉండేవాళ్ళం) ఈ ఉత్సవాన్ని చూశాను. వేరు శనక్కాయలు కూడా కొన్నాను .నాకు భలే నచ్చింది ఈ పండగ, ఆ వాతావరణం!

    రిప్లయితొలగించండి
  2. Thank you Suryudu gaaroo for your comment.

    Sujatagaaroo, Thanks for your comment. I liked the festive atmosphere very much. After coming from Mumbai I have been missing the Ganapati festivities and especially the Nimajjanam day celebrations. This Groundnut Festival has filled the gap.

    రిప్లయితొలగించండి
  3. ప్రసాద్ గారూ, చాలా చిత్రంగా ఉంది. నేనెప్పుడు వినలేదు ఇలాంటి ఒక ఉత్సవం గురించి. ఫొటోస్ అన్నీ చూసాను. చాలా బాగున్నాయి. వేరుశనక్కాయ ఫొటోస్ చూసి నోరు ఊరి, నేను కూడా లేచివెళ్ళి ఉప్పు వేసి వేయించిన పల్లీలు తెచ్చుకుని తింటూ కామెంట్ రాస్తున్నా. ఇక్కడ ప్రధాన పంటల్లో ఇది కూడా ఒకటి. అందుకని అయిపోగా అయిపోగా ఏదో ఒక చిరు తిండి చేసి పెట్టుకుంటూ ఉంటాను. మొత్తానికి సరదాగా ఉంది, పల్లీలు తింటూ పల్లీల ఉత్సవం చూట్టం. ఇలా కొత్త కొత్త విషయాలు తెలుపుతున్నందుకు మీకు చాలా థాంక్స్.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.