పాత చందమామలు
-------------------
జీవులకి ఆత్మ ఉండడం నిజమైతే, చనిపోయాకా అది స్వర్గానికో నరకానికో వెళ్ళడం నిజమైతే, నేను చనిపోయాకా కొద్దికాలమైనా స్వర్గంలో గడపడం తటస్థిస్తే, అక్కడ నాకోసం ఖచ్చితంగా ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో ఒక సెక్షన్ లో పాత చందమామలూ, బాలజ్యోతులూ అన్నీ సంవత్సరాలవారీగా బైండు చేసి ఉంటాయి. నా చిన్నప్పుడు చదివిన పుస్తకాలు మళ్ళీ చూసుకుని నేను ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతాను.
ఇంకా స్వర్గానికి పోకుండానే అటువంటి అనుభవం కలిగింది నిన్న. 1947 నుంచీ 2006 దాకా చందమామలు అన్నీ ఇంటర్నెట్ లైబ్రరీ లో ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఎన్నోసార్లు చదివిన పుస్తకాలు బొమ్మలు, అడ్వర్టయిజ్మెంట్లతో సహా ఇప్పటికీ నా కళ్ళముందు ఉన్నాయి. అవే పుస్తకాలు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటుంటే ఒక ‘నోస్టాల్జియా’ ఆవహించింది.
బహుశా నేను బొమ్మల కథల పుస్తకాలు చదవడం నా ఆరు, లేక ఏడవ సంవత్సరంలో మొదలుపెట్టి ఉంటాను. ఇంకా చిన్నతనంలో కూడా ఏమైనా చదివానేమోగానీ అవేవీ గుర్తు లేవు. కానీ ఆరేడేళ్ళ వయసునాటి పుస్తకాలు ఇప్పుడు చూస్తే ఇంకా నిన్న మొన్న చదివినట్టే అనిపించింది. బహుశా తరవాత సంవత్సరాల్లో కూడా చాలాసార్లు పారాయణ చేసినందువల్ల కావచ్చు. సుమారు పదిహేనో ఏడు వచ్చేవరకూ కథలపుస్తకాలు చదువుతూనే ఉన్నాను. పాతవి పారాయణ చేస్తూనే ఉన్నాను.
ఇంతకీ ఈ చందమామలు ఎక్కడ ఉన్నాయంటే, http://www.ulib.org/ కి వెళ్ళండి. అందులో Advanced Search లోకి వెళ్ళండి. Title లో Chandamama అని కొట్టి, Language లో Telugu సెలెక్టు చెయ్యండి. సెర్చి కొట్టండి. అంతే, అన్నీ మీ ముందు ప్రత్యక్షమౌతాయి.
నిన్న ఉండబట్టలేక చిన్నప్పుడు చదివిన ‘ముగ్గురు మాంత్రికులు’ సీరియల్ మళ్ళా మొదటినుంచీ చివరిదాకా చదువుతుంటే తెలిసింది. కొన్ని కొన్ని సంవత్సరాల్లో కొన్ని నెలల చందమామలు అందులో లేవు. మిస్సయ్యాయి. చాలా బాధ కలిగింది. ఆ ఎడిషన్లు అసలు చందమామ వాళ్ళదగ్గరే లేవేమో? అలా అయితే మటుకు తెలుగు జాతికి గొప్ప నష్టం జరిగినట్టే.
మరో సంగతి. ఈ సైట్లో చందమామలు పీడీఎఫ్ రీడర్ సహాయంతో పేజీ తరవాత పేజీ చదువుకోవాలి. సదుపాయంగా ఉండదు. అయినా కొంచం ఓపిక ఉంటే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. http://www.chandamama.com/ లో Archives సెక్షన్లో 1947 నుంచీ 1959 దాకా అన్నీ పీడీఎఫ్ ఫైల్సు రూపంలో ఉన్నాయి. ఇవి చదువుకోడానికి చాలా సదుపాయంగా ఉంటాయి. సైటువాళ్ళు మిగతావి ఎప్పుడు ఇస్తారో తెలియదు. అంతవరకూ http://www.ulib.org/ మాత్రమే గతి కాబోలు.
మరి ఇంకా ఆలస్యమెందుకు? చదువుకోవడం మొదలు పెట్టండి.
(Original post link: http://nagamurali.wordpress.com/2008/04/23/)

నాగమురళి గారూ, మీ పాత చందమామలు వ్యాసం ఇక్కడ తిరిగి ప్రచురించినందుకు ధన్యవాదాలు. దాదాపు ఒకటన్నర సంవత్సరం క్రితం రాసిన వ్యాసం కదా ఇది. అందుకే మీ వ్యాసాన్ని అప్‌డేట్ చేయవలసి ఉంది. ఇప్పుడు చందమామ ఆన్‌లైన్‌లో 1990 వరకు పాత చందమామలు అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలో 2000 సంవత్సరం వరకు చందమామలను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి చందమామ ప్రియులు 1990 వరకు చందమామలను చందమామ ఆన్‌లైన్ ఆర్కైవ్స్ల్‌లో చూడవచ్చు. శి్వరాంగారు చేస్తున్న అద్బుత కృషి ఫలితంగా 1947 నుంచి 1990 వరకు చందమామ పీడీఎఫ్‌లను చందమామ బ్లాగర్లు అతి త్వరలో పరస్పరం షేర్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని శివరాం గారు స్వయంగా వివరిస్తేనే బాగుంటుందనుకుంటాను.
రిప్లయితొలగించండిhi andi...sivaram garu chandamama priyulani ila kaluputunnaduku chala happyga vundi...
రిప్లయితొలగించండిshanmukhan garu valla blog lo konni book's pettaru...chandamama lovers happyga download chesukovaccu...
bhuvanavijayam.blogspot.com
evaraian ilage upload chesi vunte cheppandi..