20, డిసెంబర్ 2009, ఆదివారం

రోజుకొక ఉచిత సాప్టువేర్

మనకి ఇంటర్నెట్‌లో(ఈ పదానికి తెలుగు పదాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలిగించారు, అది నాకు సరైన పదం అనిపించదు) అనేకానేక సదుపాయాలు కనపడుతుంటాయి. ఉచితంగా బొమ్మలు, ఫాంటులు, అలా అనేకం.

ప్రతిరోజు ఒక సాఫ్టువేరును ఉచితంగా అందచేస్తుంది ఒక వెబ్ సైటు. అంటే ఇప్పటికే ఉచితంగా దొరుకుతున్న సాఫ్టువేరు కాదు. సామాన్యంగా మనం డబ్బులుపెట్టి కొనుక్కోవలసినది, ఈ వెబ్‌సైటు వారు, రోజుకొకటి ఉచితంగా ఇస్తారు. ఆ వెబ్సైటు వెళ్ళటానికి మార్గం ఈ కింద ఇవ్వబడినది.
GIVE AWAY OF THE DAY
అక్కడకు వెళ్ళి మీ మైలు చిరునామా వారికి ఇస్తే రోజుకొక మైలు వస్తుంది. ఆ మైలులో ఆరోజున వాళ్ళు ఉచితంగా ఇస్తున్న సాప్టువేరు వివరాలు ఉంటాయి. మనకు అది అవసరం అనిపిస్తే, వారిచ్చిన లింకు నొక్కి , ఆ సాఫ్టువేరును డౌన్లోడు చేసుకోవచ్చును.

కాకపోతె, ఈ కింద చెప్పిన విషయాలు గుర్తుంచుకోవాలి:

1. వారు ఇస్తున్న సాప్టువేరు పరిమితమైన కొన్ని గంటల లోపే డౌన్లోడ్ చేసుకుని, మన కంప్యూటర్లో వాళ్ళీచ్చిన సమయంలో ఇన్స్టాల్ చేసేసుకోవాలి.
2. ఇన్స్టాల్ చేసేప్పుడు ఇంటర్నేట్టుకు అనుసంధానమై ఉండటం తప్పనిసరి( ఆ సాఫ్టువేరు రిజిస్టరు కావటానికి)
3. ఆ సమయం అయిపొయ్యాక లేదా ఇంటర్నెట్టుకు కనెక్టుకాకుండా ప్రయత్నిస్తే, ఇన్‌స్టాల్ కాదు.

నేను ఈ విధంగా చాలా సాఫ్టువేర్లు వాడి చూశాను. వాళ్ళు ఇచ్చే ప్రతి సాఫ్టువేరు మనకు పనికి రాదు. అందుకని కొద్దిగా చూసుకుని అవసరమైతేనే డౌన్లోడు చేసుకోవాలి. ఈ డౌన్లోడ్లలో ఇంతవరకు వైరస్‌లు గట్రా తగలలేదు, కాబట్టి సురక్షితమే అని భావిస్తున్నాను.

కొసమెరుపు
వాళ్ళు ఇస్తున్న కొన్ని కొన్ని సాప్టువేర్లు చూస్తుంటే ఇటువంటివి డబ్బెట్టి ఎవరు కొంటారు అనిపించక మానదు

3 కామెంట్‌లు:

  1. చాలా ఉపయోగకరమైన లింకు ఇచ్చారు. ధన్యవాదములు. చిన్న చిన్న సాఫ్ట్ వేర్లను చిన్న చిన్న అవసారల కోసం కొనుక్కొలేము కదా.

    రిప్లయితొలగించండి
  2. ఉచిత సాఫ్ట్ వేర్ లు అందిచే ఒక మంచి సైటు.
    అన్ని రకాల సాఫ్టవేర్ లు అందుబాటులో ఉంటాయి.

    http://sourceforge.net

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.