3, డిసెంబర్ 2009, గురువారం

మూడు దశాబ్దాల చందమామ సంపాదకుడు


చందమామను స్థాపించి, సొంత బిడ్డలా సాకి, ఎంతగానో ప్రాచుర్యంలోకి తేవటానికి తాపత్రయపడ్డవారు శ్రీ చక్రపాణిగారు. తన స్నేహితుడైన శ్రీ నాగిరెడ్డిగారితో కలసి చందమామను 1947లో స్థాపించి 1975లో మరణించేవరకు చందమామకు సంపాదకునిగా ఉన్నారు. ప్రముఖ రచయిత అయిన శ్రీ కుటుంబరావుగారిని చందమామలొకి 1952లో తీసుకురావటంతో చందమామ ప్రాభవం మొదలయ్యింది. అద్భుతమైన శీర్షికలతో, తన రచనా నైపుణ్యంతో కుటుంబావుగారు (తన పేరును సంపాదకునిగా ఏనాడు వెయ్యకపోయినప్పటికి) చందమామను ఒక అద్భుత పత్రికగా తీర్చి దిద్దారు.

1975లో చక్రపాణి మరణానంతరం చందమామలు సంపాదకులు ఎవరు అని చాలా ఊహాగానాలు వచ్చాయట. నాగిరెడ్డిగారు తన కుమారుడైన విశ్వనాథ రెడ్డిని చందమామ సంపాదక బాధ్యతలు చేబట్టమని ఆదేశించారు. ఆ విధంగా చందమామకు సంపాదకులయిన శ్రీ విశ్వనాథ రేడ్డిగారు మూడు దశాబ్దాలకు మించి చందమామ సంపాదకులుగా వ్యవహరించారు. చంద మామ చరిత్రలో ఎక్కువకాలం సంపాదకునిగా ఉన్నది వీరే.

శ్రీ విశ్వనాథ రెడ్డిగారి గురించి ఒక వ్యాసం ఆదివారం ఆంధ్ర జ్యోతిలో ప్రచురించబడిన విషయం మా దృష్టికి వచ్చింది. ఆ వ్యాసాన్ని బ్లాగుల్లో నలుగురికీ తెలియచెప్పటానికి ఈ కింద లింకు ఇస్తున్నాము. ఆసక్తిగలవారు లింకు నొక్కి వ్యాసాన్ని చదువుకోవచ్చు.

శ్రీ విశ్వనాథ రెడ్ది
*******************************************

త్వరలో చందమామ వ్యవస్థాపకులు శ్రీ చక్రపాణిగారు గురించిన ఒక వ్యాసం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.