10, జనవరి 2010, ఆదివారం

ఒసిబిస-ఆఫ్రికన్ సంగీతం గ్రూప్


మనకు లేవు /తక్కువ గాని, పాశ్చాత్య సంగీతంలో కొందరు కలసి ఒక గ్రూపుగా ఏర్పడి సంగీతాన్ని వండటం చాలా ప్రాచుర్యాన్ని సంపాయించింది. మనం పాశ్చాత్య సంగీతం అంటే అమెరికానో బ్రిటనో అనుకుంటాము. కాని రెండు దేశాలకు చెందని అనేక గ్రూపులు ఉన్నాయి. అందులో ఆఫ్రికాలోని ఘనా (ఎక్కువమంది) దేశానికి చెందిన ఒసిబిస ఒకటి. 1980 లలో గ్రూపు భారత దేశానికి వచ్చి, అనేక నగరాలలోఉర్రూతలూగించే వారి సంగీతాన్ని అందించారు. ఆఫ్రికన్ డ్రమ్స్ చక్కగా వాడుతూ, ఇంకా అనేక ఆఫ్రికన్ సాంప్రదాయక సంగీత వాయిద్యాలు వాడుతూ, పాటలు ఇంగ్లీషు లో పాడుతూ చాలా మంచి హిట్ పాటలు అందించారు చక్కటి గ్రూపు. ప్రస్తుతం లేదు.

వాళ్ళు పాడిన పాటలలో DANCE THE BODY MUSIC అన్న పాట ఎంతగానో జనాదరణ పొందినది. పాటను కింద ఇచ్చిన ప్లేయర్లో వినవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.