26, జనవరి 2010, మంగళవారం

రిటైర్ అవ్వద్దూ


సహజంగా ఉద్యోగాలు చేసేవాళ్ళకి పదవీ విరమణ అనేది ఉంటుంది. మనకు పదవీవిరమణ వయస్సు అరవై సంవత్సరాలు. అరవైనిండిన వారు రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకుంటారు. కారణం? వయస్సులో ఉండగా ఉన్నంత చురుకుగా పని చేయలేక పోవచ్చు , అనుభవం ఉన్నా వేగవంతమైన ఆలోచనా సామర్ధ్యం లోపించనూ వచ్చు. ఇప్పుడు మన రిపబ్లిక్ కు కూడ అరవైనిండింది. మనకు మనమే ఏర్పరుచుకున్న రాజ్యాంగం అరవై వసంతాలు చూసింది. ఆరు దశాబ్దాలలో తొంభై సార్లకిపైగా (సగటున సంవత్సరాని ఒకసారి కన్నా ఎక్కువసార్లు) ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా మార్చబడింది.

రాజ్యాంగానికి కూడ ముసలితనం రాలేదూ! పెరిగిన జనాభా,మారిన ప్రపంచం, మన ఆర్ధిక వ్యవస్థ సవ్యంగా పెరగటానికి దోహదపడటానికి వీలుగా, రాష్ట్రాల మధ్య అనవసర తగాదాలు నివారించటానికి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్రం చూడవలసిన విషయాలు, రాష్ట్ర పరిపాలనలో చూడవలసినవి ఇలా ఇంకా అనేకం ఉన్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని కొత్త రాజ్యాంగం వ్రాసుకోవటం మంచిది అనిపిస్తోంది. బ్రిటిష్ వారు చేసిన 1935 ఏక్ట్ ను అనుసరించి వ్రాయబడి, ఇప్పటికి ఇన్నిసార్లు మార్చబడిన రాజ్యాంగం ప్రస్తుత దేశ కాల పరిస్థితులకు ఎంతవరకు అనుగుణంగా ఉన్నది అని బేరీజు వేసుకుని, మనకు ఉన్న ప్రస్తుతపు వోటింగు వ్యవస్థ, అధ్యక్ష పాలన అవసరం వంటివి కూలంకషంగా చర్చించుకుని, మరొక రాజ్యాంగం వ్రాసుకుంటే అన్న ఆలోచన రిపబ్లిక్ డే రోజున వచ్చింది. పాపము శమించు గాక!

మన రాజ్యంగా నిర్మాతలు వ్రాసిన రాజ్యాంగాన్ని ఇంకా ఎన్ని సార్లు తూట్లు పోడుస్తాం. మార్చి, మార్చి మళ్ళి మరొకసారి మార్చి చివరకు అసలు స్వరూపం ఎలా ఉంటుందో అని తరచి పెద్ద పరిశోధన చెయ్యవలసిన అవసరం రాకుండానే, కొత్త రాజ్యాంగ ప్రక్రియ మొదలు పెట్టడం మనదేశ సమగ్రతకు ఎంతయినా అవసరం.

అందరికీ రిపబ్లిక్ డే సందర్భంగా శుభా కాంక్షలు.

2 కామెంట్‌లు:

  1. శివ గారూ !
    గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  2. కొత్త రాజ్యాంగమా, మళ్ళీ రాయడమా, మన రాజకీయ'వేత్త'లా. పోండి సర్, భలేవారు. ఒక్క పుట విషయంలో కూడా మనవాళ్లు ఏకాభిప్రాయానికి రాలేరని నాది గ్యారంటీ. ఏదో 60 ఏళ్ల క్రితం వాళ్లు ఆమాత్రం రాయబట్టి బతికిపోయాం.

    కథనం ఆలోచనాత్మకంగానే ఉంది. కానీ....

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.