10, ఫిబ్రవరి 2010, బుధవారం

దాసరి తాత సంస్మరణ సభ ఫిబ్రవరి 16 న

విచారాన్ని వదలండి మహారాజా! మన కథలను పిల్లలకు, పిల్లలకేమిటి పెద్దలకు కూడా చక్కగా చెప్పగలిగిన అటువంటి చక్కటి రచయిత ఇక రాబోరు, అదే నా బాధ కూడా. కాని ఏమి చేస్తాం, మనుషులం!! ఏదో ఒకరోజున మరణం తప్పదు కదా! ఉన్నవాళ్ళం పోయిన వారి గుణగణాలను గుర్తుంచుకుని వారి మంచితనాన్నిసంస్మరణ చేయటమే మన చేతులలో ఉన్నది .

చందమామ అభిమానులు హైదరాబాదులో దాసరివారి సంస్మరణ సభ పదహారు ఫిబ్రవరిన ఏర్పాటు చేసారట మన వాళ్ళు అందరిని కేకేసి సభకు వెళ్లి వద్దాం ప్రభూ.

అలాగే మహా మంత్రీ! తప్పకుండా ఏర్పాట్లు చేయించండి, మేమూ సపరివారంగా వస్తాం.

=======================================================================================================================


తేది: 9 ఫిబ్రవరి 2010 11:07 am
సబ్జెక్టు: [chandamama_priyulu] దాసరి సుబ్రహ్మణ్యం సంస్మరణం
కి: chandamama_priyulu@yahoogroups.com

దాసరి వెంకట రమణ గారు క్రింది మెయిలు పంపారు. హైదరాబాదు, విజయవాడలలో ఉన్న చందమామఅభిమానులు తప్పక పాల్గొంటారని అశిస్తున్నాను.

-త్రివిక్రమ్
------------------------------
------------------------------------------------------------
త్రివిక్రమ్ గారికి నమస్కారం

దాసరి సుబ్రహ్మణ్యం గారు మధ్యే పరమపదించారు. మీకు విషయం బహుశ వార్తా పత్రికల ద్వారా తెలిసివుంటుంది. నెల పదహారో తేదిన మంగళ వారం సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ లెక్చర్హాలు నందు సంస్మరణ సభ ను బాల సాహిత్య పరిషత్తు హైదరాబాద్ పక్షాన ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే నెలఇరవై ఒకటో తేది ఆదివారం విజయవాడలో ప్రజాసాహితి పక్షాన ఏర్పాటు చేయటం జరిగింది విషయం చందమామఅభిమానులకు తెలియచేయ గలరు.
రచన వచ్చే సంచికను దాసరి సుబ్రహ్మణ్యం సంస్మరణ సంచికగా వేయటానికి రచన శాయి గారు నిశ్చయించారు. విషయమై ఒకసారి శ్రీ శాయి గారితో మాట్లాడండి.

మీ స్పందన కోసం ఎదురు చూస్తూ. - దాసరి వెంకట రమణ

--------------------------------------------------------------------------------------------------

చందమామలో ఎక్కువ ధారావాహికలు రచించిన శ్రీ దాసరి మరణ వార్త విని బాధపడని చందమామ అభిమాని లేరు. ఆయనను గుర్తుకు తెచ్చుకుంటూ హైదరాబాదులో ఒక సంస్మరణ సభ జరుప తలవటం ముదావహం. చందమామ అభిమానులు అందరూ సభకు హాజరై తమకున్న జ్ఞాపకాలను పంచుకోగలరు.


విషయాన్ని మనకు తెలియచేసిన శ్రీ దాసరి వెంకట రమణ మరియు శ్రీ త్రివిక్రమ్ లకు ధన్యవాదములు.






********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.