7, ఫిబ్రవరి 2010, ఆదివారం

దాసరి తాత సర్ - చందమామ సిబ్బంది జ్ఞాపకాలు

చూశావా ఖడ్గా! మనకే కాదు దాసరి వారి జ్ఞాపకాలు!!, మన కథలు వ్రాసిన దశాబ్దాల తరువాత ఆయనతో పని చేసిన వారు కూడ ఆయనను మర్చిపోలేక వాళ్ళ జ్ఞాపకాలను ఒకరికొకరు చేప్పుకోవటం పైగా వాళ్ళు తెలుగు వారు కూడా కాదట. మన జీవితాలు ధన్యమయ్యా అటువంటి మంచి వ్యక్తి చేతిలో రూపు దిద్దుకున్నాం.
=======================================================================================================

Memories with Dasari thatha sir

(చందమామతో పరిచయం ఉన్న, చందమామ ధారావాహికలతో పరిచయం ఉన్న పాఠకులు, అభిమానులు అందరికీ దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి ప్రస్తుతం తెలుసు. నాలుగేళ్ల క్రితం ఆయనతో కలిసి పనిచేసిన చందమామ ఉద్యోగులు, సిబ్బంది విషయం ఏమిటి? ఆయన పూర్వ సమకాలికులు చాలావరకు ఇప్పుడు లేరు.

చందమామలో ఆయన అడుగుపెట్టిన రెండు, మూడు తరాల అనంతరం చందమామలు చదువుతూ, బేతాళ కథల మహత్తులో మునిగితేలుతూ బాల్యం గడిపి చందమామలో పనిచేసే అవకాశం వచ్చిన పిల్లలు, ప్రస్తుత చిత్రకారులు, సిబ్బంది ఆయనతో ఎలా గడిపారు, ఆయన వ్యక్తిత్వాన్ని వారు ఎలా పరిశీలించారు అనే ఆసక్తితో రెండు రోజులు క్రితం వారిని కదిపి, అందరూ ఆయన జ్ఞాపకాలను పంపితే తెలుగు పాఠకులకు, దాసరిగారి అభిమానులకు తెలిపేందుకు వీలవుతుందని ప్రస్తావించాము.

వెంటనే ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కింద ప్రస్తావించిన వారు తమ జ్ఞాపకాలను పంపారు. ఆయన మనవరాళ్ల వయసులో ఉన్నవారు, మనవళ్ల ప్రాయంలో ఉన్నవారు చందమామలో ఆయనతో గడిపిన మాన్య క్షణాలను గుర్తుచేసుకుంటూ హృద్యంగా తెలుగు చందమామతో పంచుకున్నారు. వీళ్లందరూ ఆయనకు పెట్టుకున్న ముద్దుపేరు తాతా సర్.

ఆయనతో మాట్లాడడానికి గాను తెలుగు నేర్చుకుని తర్వాత ఆయన ఇంగ్లీషులో కూడా మాట్లాడగలరని తెలిసి ఆశ్చర్యపోయిన వారు, స్వంతబిడ్డలకు నజరానాలు ఇచ్చినట్లు రోజూ గులాబి పూవులు ఇస్తే ప్రీతిగా అందుకున్న చందమామ పాపలు, ఆయనతో చుట్టపీలుస్తూ ఆరుబయట చర్చలు గడిపిన కాలాన్ని జీవితంలో మర్చిపోలేని క్షణాలుగా భావించుకుంటున్న వారు, ఆఫీసు బాయ్‌ని అయినా, సరిసమాన ఉద్యోగులనయినా సమానంగానే చూసి ఆప్యాయత కురిపించిన ఆయన మూర్తిమత్వాన్ని సజలనేత్రాలతో తల్చుకుని బాధపడినవారు, చందమామలోనే చిన్న లైబ్రరీలాగా స్వంత పుస్తకాలను అమర్చుకున్న వైనాన్ని వర్ణించినవారు… ఇవి చందమామ ఉద్యోగులు, సిబ్బంది నిరాడంబరుడైన దాసరి తాత గురించి పంచుకున్న క్షణాలు.)

Vaasugi
వాసుకి (జూనియర్ చందమామ అసోసియేట్ ఎడిటర్)

తాతయ్యతో గడిపిన రోజులు

Journey 450

వయసు పైబడినా వెనుకబడని కుర్రతనం. ఆ చొక్కా చేతులు మడుచుకోవటం, ఫోటో కోసం నడుం మీద చేతులు ఉంచి ఫోజు ఇవ్వటం. అదే కాబోలు ఆయన రచనలో పిల్లలను ఆకట్టుకునే తత్వానికి ఉన్న రహస్యం. పిల్లల్లో పిల్లవాడైపోయి ఆయన వ్రాయగాలిగారు కాబట్టే, ఆ పిల్లలు పెద్ద వారైనప్పటికీ, ఈ నాటికీ మళ్ళి పిల్లలైపోయి ఆయన ధారావాహికలు మళ్ళి మళ్ళి చదువుకుంటున్నారు.
=======================================================================================================

చాలామంది పిల్లల్లాగే నేను కూడా చందమామ -హిందీ-తోపాటే పుట్టి పెరిగాను. చందమామలో నాకు బాగా నచ్చింది బేతాళ కథలు. వీటిని ఎంతగా ఇష్టపడేదాన్నంటే, చదివాక మా బంధువుల పిల్లలు, స్నేహితులు అందరికీ ఊరించి, ఊరించి చెప్పేదాన్ని.

చందమామలో నేను చేరినప్పుడు నా చిన్నప్పుడు ఎంతగానే ఆరాధించిన గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయబోతున్నానని నేను కల్లో కూడా ఊహించలేదు. అప్పటికే 83 సంవత్సరాల వయసున్న దాసరి గారు ఇంకా బేతాళకథలు రాస్తూనే ఉన్నారని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. ఆఫీసులో చేరిన కొత్తలో ఆయన వద్దకు అస్సలు వెళ్లేదాన్ని కాదు. ఎందుకంటే తన మాతృభాష తెలుగుతో నాకు పరిచయంలేదు. కాబట్టి పట్టుబట్టి తెలుగు మాట్లాడటం కొద్దిగా నేర్చుకున్నాను. తర్వాతే ఆయన కేబిన్ దగ్గరకు వెళ్లాను. నేను ఆయనతో తెలుగులో మాట్లాడటం ప్రారంభించేసరికి ఆయన ఇంగ్లీషులో సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన రెండు భాషల్లోనూ ఉద్దండులని అప్పటికి కాని నాకు బోధపడలేదు. నిజంగానే ఆయన ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడేవారు.

చందమామ ఆఫీసులో మేమంతా ఆయనను తాతా అని పిలిచేవారం. ఆయన కూడా మమ్మల్ని తన మనవరాళ్లుగా భావించి వ్యవహరించేవారు. నాకు, నా సహోద్యోగి రేవతికి ఆయన దాదాపు ప్రతిరోజూ ఒక గులాబీ పువ్వు ఇచ్చేవారు. ఆయన మమ్మలను ఎంతో ప్రీతిగా చూసేవారు. మా భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదించేవారు.

వ్యక్తిగా ఆయన చాలా నిజాయితీపరుడు, సమయపాలన ఖచ్చితంగా పాటించేవారు. ఆయన ఖాళీగా ఉండటం మేం ఎప్పుడూ చూడలేదు. అద్భుతమైన మనోబలం, ఆత్మవిశ్వాసంతో ఆయన సొత్తు. తెల్లచొక్కా అంటే ఆయనకు చాలా యిష్టం. అందుకని తన జన్మదినమైన అక్టోబర్ 25న మేం ఆయనకు తెల్లచొక్కా, ప్యాంట్‌ను బహుమతిగా ఇచ్చాము. ఆరోజు అంతా ఆయన చాలా సంతోషంగా గడిపారు. మమ్మల్నందరినీ నిండుమనసుతో ఆశీర్వదించారు.

నాలుగేళ్ల క్రితం చందమామ కార్యాలయాన్ని వదిలివెళ్లవలసి వచ్చినప్పుడు, కోలుకున్నాక తిరిగి వస్తానని ఆయన మాతో చెప్పారు. కానీ గత నెల 27న ఆయన పోయారని మర్నాడు విన్నప్పుడు విషాదంలో మునిగిపోయాను.

Ravathi
రేవతి – లేఅవుట్ డిజైనర్

నా మనస్సులో అణువణువునా నిండి ఉన్న దాసరి తాత గురించి చెబుతున్నాను. మొదట్లో ఆయన పేరు నాకు తెలిసేది కాదు. మాకందరికీ ఆయన తాతా సర్ గానే బాగా పరిచయం. తను చాలా మంచివ్యక్తి. అంత సరదా మనిషి కూడా. అంతకు మించి మహా ఔదార్యవంతుడు. నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడినా సరే నన్ను ఒక బిడ్డలాగా చూసేవారు.

ఆయన దేవుడిని ఎప్పుడూ నమ్మేవాడు కాదు. అందుకే ప్రతిసారీ ఆయనతో దేవుడున్నాడని వాదించేదాన్ని. మా చర్చ, వాదన భలే తమాషాగా ఉండేది. చాలా సందర్భాల్లో తాత మొహంలో నిండా చిరునవ్వుతో ఒక పువ్వు ఇచ్చేవాడు. దీంతో నా కోల్లీగ్స్ ఆటపట్టించేవారు. అంతే చుట్టూ పెద్దగా నవ్వులు.

నిజంగా అవి చాలా మంచిరోజులు. ఇప్పటికీ ఆయన గురించి తల్చుకుంటే చాలు నా కళ్లలో నీళ్లు నిండతాయి. నా మనో ప్రపంచంలో ఆయన అంతగా ఉండిపోయారు. నా జీవితంలో అంత గొప్ప మనీషిని నేను కలుసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది నాకు.

V.Srinivasan
వి. శ్రీనివాసన్ – అంబులిమామ క్రియేటివ్ రైటర్

మంచి హృదయం, నిబ్బరం, సరదా కలగలిసిన పొడుగరి ఆయన. తాతా సర్ ఒక సజీవ ఉదాహరణ, చందమామ మూలస్తంభాల్లో ఆయన ఒకరు.

P.Mahesh
పి.మహేష్ – సీనియర్ చిత్రకారులు

దయా హృదయం, హాస్యప్రవృత్తి కలగలసిన సాదా సీదా మనిషి ఆయన. ఆయనతో కలిసి పనిచేసే అనుభవం నాకు దక్కకపోయినప్పటికీ తనపై నాకు ఆరాధనా భావం ఉంది. నాకు తెలిసినంతవరకు ఆయన చందమామలో 54 ఏళ్లు పనిచేశారు. చందమామ మూలస్తంభాల్లో ఆయన ఒకరు. ఆయన మరణవార్త తెలియగానే మొత్తం చందమామ సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మాతో ఇప్పటికీ కలిసి జీవిస్తున్నట్లే భావిస్తూ ఆయనను గుర్తు చేసుకుంటూనే చందమామలో పనిచేసుకుపోతున్నాం.

Gandhi ayya
గాంధీ అయ్య – సీనియర్ చిత్రకారులు

ఆయన ఇక లేరని వినగానే తీవ్రంగా విచారపడ్డాను. ఆయనకూ నాకూ వయోభేదం ఉన్నప్పటికీ ఆయన నన్ను ఎల్లప్పుడూ తన మిత్రుడిలాగే భావించేవారు. ఆయన దయార్ద హృదయుడు, నిరాడంబరుడు. మేమిద్దరం చుట్టపీలుస్తూ ఆరుబయట చర్చించుకుంటూ గడిపిన కాలం నా జీవితంలోనే ఆనందకరమైన క్షణంగా భావిస్తుంటాను. నిజంగా తనను కోల్పోయాను. బండెడు జ్ఞాపకాలను వదిలి ఆయన వెళ్లిపోయారు. నేనేమో ఇప్పటికీ ఆ జ్ఞాపకాల్లో మునిగితేలుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.

Balamurugan
బాలమురుగన్ – లైబ్రేరియన్

నేను చందమామలో 2005లో చేరాను. ఆయనను నాకు బాలసుబ్రహ్మణ్యం గారు పరిచయం చేశారు. ఆయన ఆఫీసులో పెద్దగా మాట్లాడేవారు కాదు. తన పనిచేసుకుని పోయేవారు. కానీ మాట్లాడినంతసేపు జోకులు విసురుతూనే ఉంటారు. ఆయన దేవుళ్లను, దేవతలను నమ్మరని బాలు గారు నాకు చెప్పారు. దేవుళ్లపై కూడా ఆయన జోకులు వేసేవారు.

చందమామ లైబ్రరీకి మల్లే ఆయన ఎడిటోరియల్ బోర్డు ఉన్న ప్రాంతంలో చాలా పుస్తకాలు వ్యక్తిగతంగా కొని తెచ్చి పెట్టుకునేవారు. బాలు గారు కూడా కొన్ని పుస్తకాలు వాటికి జతచేశారు. ఆయన 200 పైగా పుస్తకాలను ఇలా తనకు అందుబాటులో పెట్టుకునేవారు. వాటిలో లోకజ్ఞానం, పిల్లలకు సంబంధించిన ఇతర పుస్తకాలు ఉండేవి. ఆయన నాకు తెలిసి సాధారణంగా లైబ్రరీకి వచ్చేవారు కాదు. తన వద్ద ఉన్న పుస్తకాలతోనే సర్దుకునేవారు. దీన్ని చందమామలో కుట్టి లైబ్రరీ అనలేము కాని ఎక్కువగానే పర్సనల్ పుస్తకాలను చివరివరకూ ఉంచుకున్నారు. 2006లో ఆయన ఆఫీసు వదిలి విజయవాడ వెళ్లేటప్పుడు తన పుస్తకాలను తీసుకుపోయారు. ఆరోగ్యం ఏమాత్రం సహకరించకపోవడంతో ఆయన చందమామను విడిచిపెట్టి పోవలసి వచ్చింది.

Arun
అరుణ్-లైబ్రరీ అసిస్టెంట్

నాకు తెలిసి ఆయన చాలా మంచిమనిషి, నిరాడంబరుడు. వయసులో చాలా పెద్దవారయినప్పటికీ, ఆయన నన్ను తన మనవడిలా చూసుకున్నారు. ఇంతవరకూ అలాంటి మంచివ్యక్తిని నేను చూడలేదు. అలాంటి వ్యక్తిని నా జీవితంలో ఇకపై చూడలేను కూడా. ఆయన పోయినందుకు చాలా విచారంగా ఉంది. కానీ చందమామ ఉన్నంతవరకు ఆయన పాఠకుల హృదయాల్లో నిలిచే ఉంటారు.

Ravi
రవి- ప్యాకింగ్ విభాగం

చివరివరకు ఆయన చందమామలో పనిచేస్తూనే వచ్చారు. 2005-06లో వయసయిపోయిన కారణంగా అనారోగ్యం ముదిరి ఆయన రెండు, మూడు నెలల పాటు చందమామ ఆఫీసుకు రాకుండా విశ్రాంతి తీసుకున్నారు. కాస్త నయమయ్యాక మళ్లీ ఆఫీసుకు వచ్చారు కాని ఎక్కువరోజులు ఉండలేకపోయారు. ఎందుకంటే బట్టలు ఉతుక్కోవడం, వంట చేసుకోవడం, ఆస్పత్రికి వెళ్లడం వంటి పనులు చేసుకోవడానికి కూడా ఆయనకు చెన్నయ్‌లో ఎవరూ లేరు.

మొదటినుంచీ ఆయన ఒంటరిగానే గడిపారు. కుటుంబం లేదు. ఒక మనిషి అన్నివేళలా ఆయనను కనిపెట్టుకుని ఉండవలసిన పరిస్థితి. అది ఇక్కడ కుదరకపోవడంతో చివరకు ఆయన చెన్నయ్ వదిలిపెట్టి విజయవాడలో కూతురువద్దకు వెళ్లిపోయారు. చందమామలో పనిచేస్తూండిన బాలసుబ్రహ్మణ్యం గారు (అసోసియేట్ ఎడిటర్) ఆయనను తీసుకువెళ్లి విజయవాడలో వదిలిపెట్టి వచ్చారు.

వ్యక్తిగతంగా ఆయన మనుషులను ఎంతో అభిమానంగా చూసుకునేవారు. ఆఫీసు బాయ్‌ని అయినా, సరిసమాన ఉద్యోగులనయినా ఆయన సమానంగానే చూసేవారు. ఆప్యాయంగా పలకరించేవారు. నిజంగా గొప్పమనిషి. ఆయన పోయారనే వార్తవినడం బాధకలిగిస్తోంది.

=======================================================================================================

దాసరిగారి ఫోటోలను అందించిన, ఈనాడు వేణు గారికి కృతజ్ఞతలు

=======================================================================================================

2 Responses to “దాసరి తాతగారితో మా జ్ఞాపకాలు”
  1. sivaramaprasad kappgantu on February 6, 2010 9:06 PM

    Rajugaaroo,

    Thank you for sharing the sweet memories of your staff with our favorite writer Shri Dasari I mean TATA SIR. All your staff are quite fortunate to have amongst them a Chandamama legend who influenced the childhood days of more than 4 generations of boys and girls in Andhra Pradesh with his excellent Telugu serials and may be in other states through his translated serials.

    I too have grown up reading the entertaining serials of Shri Dasari. The first was Patala Durgam which I started to read from the second or third episode. The full length serial was Sidhilalayam.

    I like that serial so much that when I lost some of the episodes, years later(in 1970s, I went and pestered all the second hand ruddi merchants and every evening I was used to go there and rummage through their merchandise and pull out my prize discoveries of old Chandamamas and purchase them much to their delight and surprise with a sum of 10 or 20 paise which they would have otherwise sold by weight getting hardly 3 or 4 paise per book from palli sellers or Mirchi bajji sellers. Thus I collected most of the episodes of Sidhilalayam with the pocket money of 50 paise my father was used to give me daily. In those days with 50 pais we could get a decent breakfast of excellent 2 idlis, 1 dosa with (my God my mouth is watering)verty tasty coconut chutney.

    In Rati Ratham Serial in one place, one of the the heroes (Khadgavarma & Jeevadatta), I think Khadga Varma seeing a tribal sentrying a tree says to his friend, “See we should find out why he is doing this sentry duty for this tree. If we do not, all through our lives we would just be wondering what it is!!” This dialogue written by Shri Dasari has influenced me so much, whenever I see something that catches my interest I go and investigate and will not rest until I go to the bottom of it. This trait has helped me in my career and got the name that “this fellow never leaves a thing I say, he just gets obsessed with it until he knows full about it” by my bosses.

    In my childhood days, the first thing the moment I snatch Chandamama from the Killy Buddy (Smalla shops in Andhra area selling Pawn and Magazines), I still remember eagerly going to the main serial by Dasari (in those days we were not knowing who was writing) and reading it while walking back to my house just about a furlong away. Fortunately, in those days the greatest traffic on the road was only a cycle and an occasional Suvega moped put putting on the road and so I was always safe walking back on auto pilot.

    I very much appreciate all your staff sharing their memories of Shri Dasari although Shri Dasari was quite elder to them by decades. I also salute your staff for their inclination to try and be friendly with a lonely old man whom they started calling TATA SIR and made him part of their group. I feel that this friendly nature and the affection shown towards him by your staff must have extended the life of Shri Dasari by some more years. Its really great and greatest tribute to the Chandamamam giant Shri Dasari.

    May the departed soul rest in peace. Although shri Dasari Tata does not believe in GOD, I am sure he is enjoying all heavenly facilities with Shri Chakrapani, Shri Chitra, Shri Vaddadi Papaiiah and Shri Nagireddy, may be planning a great magazine for the Children in Heavens for the Angles.

    I wish to publish this article as it is in MANA TELUGU CHANDAMAMA for still wider readership.

  2. వేణు (venu) on February 6, 2010 9:32 PM

    The post is touching. The tribute by the employees and staff of Chandamama took me to the memories of the great writer. I could know many new things about dasari garu. Thank you.

1 కామెంట్‌:

  1. శివరాం గారూ, వేణూగారూ,

    నిజంగా మీ హృదయాల్లోంచే వచ్చాయీ వ్యాఖ్యలు. మా వాళ్లు ఎంత సంతోషపడతారో మీ ఇద్దరి వ్యాఖ్యలు చదివి. రేపు ఆఫీసులో వారికి మీ వ్యాఖ్యలు చూపిస్తాను. చాలా బాగా రాశారు.

    వీలైతే దాసరి గారి గురించి మనందరం రాసిన వ్యాసాలను కూర్చి ఓ సమగ్ర వ్యాసంగా మలిచి ఇంగ్లీషులో అనువదించి తెలుగేతర చందమామ పాఠకులందరికీ పెద్ద ఎత్తున పంపిస్తే ఎంత బావుండనిపిస్తోంది. మన అందరి కథనాలు, కౌముదిలో వసుంధరగారు రాసింది కలుపుకుంటే దాసరి గారిపై 50 పుటల సమాచారం సిద్ధంగా ఉంది.

    కానీ తెలుగు నుంచి ఇంగ్లీష్‌లోకి చేయడంలో వెనుకబాటుతనం నన్ను పీడిస్తోంది. చేయగలిగిన సామర్థ్యం ఉన్న మీరు ఇప్పటికే రెండు ప్రత్యేక పనులతో బిజీగా అయిపోయారు.

    నిజంగా ఆయన చరిత్ర, లోకానికి మరింతగా తెలియాలంటే ఆయనపై సమగ్ర వ్యాసం ఆంగ్లంలో అనువదించవలసిన అవసరం చాలా ఉంది. ఎప్పటికి ఇది పూర్తవుతుందో చూద్దాం. చందమామ అభిమానులదే భారం.

    మంచి వ్యాఖ్యకు, చందమామ సిబ్బందికి సంతోషం కలిగిస్తున్నందుకు మీకు వేవేల కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.