14, మార్చి 2010, ఆదివారం

మరొక్క మంచి పాట - ఊన పలోమా బ్లాంకా

పాశ్చాత్య సంగీతం అంతా అమెరికాలోనో లేక ఇంగ్లాండు లోనో మాత్రమె లేదు. యూరోపులో ఉన్న స్వీడన్, హాలెండు లాంటి దేశాలు చక్కటి సంగీత కళాకారులను అందచెశాయి. పరంపరలో, జార్జి బెకర్ సెలెక్షన్ అనే గ్రూప్ హాలెండుకు చెందినది చక్కటి పాటలను అందించి సంగీత ప్రేమికులకు అలరించింది. గ్రూపు పాడిన "ఊన పలోమా బ్లాంకా" అనే పాట 1975 సంవత్సరంలో పెద్ద హిట్ సాంగ్. "ఊన పలోమా బ్లాంకా" అంటే స్పానిష్ భాషలో "తెల్ల పావురం" అని అర్ధమట. ఎందరినో అలరించిన చక్కటి పాటను కింది ప్లేయర్లో వినవచ్చు. పాట మొదట్లో వచ్చే వేణువు మీద ఊదిన గమకాలు చక్కగా ఉంటాయి.

పాటకు సంబంధించిన సాహిత్యం కూడ కింద ఇస్తున్నాను.

When the sun shines on the mountain
And the night is on the run
It's a new day
It's a new way
And I fly up to the sun

I can feel the morning sunlight
I can smell the new-mown hay
I can hear God's voice is calling
For my golden sky light way

Una paloma blanca
I'm just a bird in the sky
Una paloma blanca
Over the mountains I fly
No one can take my freedom away

Once I had my share of losing
for they locked me on a chain
Yes they tried to break my power
oh I still can feel the pain

Una paloma blanca
I'm just a bird in the sky
Una paloma blanca
Over the mountains I fly
No one can take my freedom away

Una paloma blanca
I'm just a bird in the sky
Una paloma blanca
Over the mountains I fly
No one can take my freedom away

ఈ పాట వీడియో చూద్దామనుకుంటే యూ ట్యూబులో దొరుకుతున్నది. ఈ కింది లింకు నొక్కి చూసి ఆనందించండి.
UNA PALOMA BLANCA

వేణువు ఊదుతున్న కళాకారుణ్ణి గమనించండి, ఆయన వేణువు ఊదుతూనే కాసేపటికి పియానో కూడ వాయిస్తూ ఉంటారు. అదేకాదు, ఆయన చేతిలోని వేణువు రూపం మనకు తెలిసిన మనపక్క చూసే వేణువు లేదా ఫ్లూట్ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ పాటలో ముఖ్య గాయకుడు జార్జి బేకర్, అస్సలు పేరు జొహన్నెస్ బౌవెన్స్,(Johannes Bouwens), హాలెండు దేశానికి చెందినవారు. ఈ పాటను ఎన్ని సార్లు విని ఉంటానో లెక్కలేదు. ఈ పాటలో నాకు బాగా నచ్చిన భావం No one can take my freedom away.

5 కామెంట్‌లు:

  1. ప్రసాద్ గారు,

    పాట చాలా బాగుంది. సంగీత ప్రేమికులకు భాషతో సంబంధం లేదని మీరు నిరూపించారు. దేశ విదేశాల్లో ఉన్న గాయక బృందాలు, వారి వివరాలు, వారు పాడిన పాటలు మాకందరికీ అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. దాదాపు 30 ఏళ్ళ క్రితం నేను ప్రతిరోజు ఉదయం రేడియో సిలోన్లో ఇంగ్లీషు పాటలు వినేవాణ్ణి. ఆప్పుడు చాలాసార్లు విన్న పాట ఇది. నాకెంతో ఇష్టమైన పాట. ఇన్నాళ్ళకు ఈ పాటను గుర్తుకుతెచ్చి దాని సాహిత్యం కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు. అప్పుడే బోనీ యం. ఆబా (అబ్బా)? పాటలు వినేవాణ్ణి. వాటితోపాటు గోవా గ్రూప్ వాళ్ళ పాటొకటి వచ్చేది. దాన్నేమంటారో తెలియదు కాని నాకు బాగా నచ్చింది. ఎంతైనా తెలుగు పండితుణ్ణి కదా సాహిత్యం అర్థమయ్యేది కాదు. కేవలం సంగీతాన్ని ఆస్వాదించేవాణ్ణి. మీ పుణ్యాన ఆ రోజులు గుర్తుకు వచ్చాయి.

    రిప్లయితొలగించండి
  3. కంది శంకరయ్యగారూ! నా బ్లాగుకు మొదటిసారిగా వచ్చి మీ వ్యాఖ్య వ్రాసినందుకు ధన్యవాదములు. నేను భీ చాలా కాలం శ్రీలంక బ్రాడ్కాస్టింగు కార్పోరేషన్ ద్వారా మాత్రమె పాశ్చాత్య సంగీతం వినేవాడిని. అప్పుడు మన రేడియోలో అదేదో పాపం అన్నట్టుగా ఇంగ్లీషు సంగీతం వేసేవారు కాదు. ఇప్పటికీ అదే ఆనవాయితీ ఆకాశవాణి వరకు.

    మీరు ఈ కింద ఇచ్చిన లింకు నొక్కి చూడండి. మనలాగానే ఎస్ ఎల్ బి సి విన్న ఒక పెద్దాయన తానూ అప్పట్లో శ్రీలంక , వాయిస్ ఆఫ్ అమెరికా లో విన్న పాటలన్నీ వెబ్ లో పెట్టారు. విని ఆనందించండి.

    http://harry.cckerala.com/india-pop/download.php

    పాటలను మీరు Donload కూడా చేసుకోవచ్చు అనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  4. శివ గారూ !

    నూతన సంవత్సరంలో మీ నుంచి సంగీత సాహిత్య విశేషాలు కోరుకుంటూ...ఉగాది శుభాకాంక్షలతో...

    - శిరాకదంబం

    రిప్లయితొలగించండి
  5. ఈ బ్లాగ్ చదువుతూ ఉన్నంత సేపు నాకు చాలా హాయగా వుంది. అమ్మమ్మ గారి వూరు, వేసవి లో వెన్నెల రాత్రి, కరెంటు పోతే ఊరంతా నిశ్శబ్దంగా వున్నప్పుడు డాబా మీద పడుకుంటే వుండే హాయి, సూర్యుడు ఉదయిస్తుండగా తాగే కాఫీ ఇవి అన్ని కూడా గుర్తుకు వస్తున్నాయి.ఇంతకన్నా ఎక్కువ చెప్పేంత బాష పరిజ్ఞానం లేనివాడిని, ఆలస్యమైన ఒక మంచి బ్లాగ్ దొరికినందుకు చాలా ఆనందంగా వుంది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.