11, మార్చి 2010, గురువారం

కుటుంబాన్ని గుర్తుంచుకోవాలి

కారు డ్రైవ్ చేసేప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన జాగ్రత్త సీట్ బెల్ట్. మనం కారు గాని మరే ఇతర వాహనం గాని నడిపేప్పుడు, ఒక్కోసారి మనకు తెలియని ఆవేశం చుట్టుకుంటుంది, వేగం అధికం అవుతుంది. అన్ని అనర్ధాలకు మూలం మితిమీరిన వేగం. వేగంగా వెళ్ళే కారు అకస్మాత్తుగా ఆగాల్సి వచ్చినప్పుడు జరిగే పరిణామాలకు ప్రతిగా సీట్ బెల్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడండి అని ఎంతో చక్కగా మంచి సృజనాత్మకంగా చూపించిన వీడియో కింద ఇస్తున్నాను. ఇంటర్నెట్టులో చాలామంది సరికే చూసి ఉంటారు. చూసి ఉండకపోతే చూసి ఆనందించటమే కాదు ఆచరిస్తే వీడియో తీసినవారి ఆశయం నెరవేరుతుంది.



ఏది ఏమైనా, డ్రైవ్ చేసేప్పుడు మన్ని ప్రేమించే మన కుటుంబం ఇంటిదగ్గర మన కోసం ఎల్లవేళలా తలుచుకుంటూ ఎదురు చూస్తున్న సంగతి గుర్తుంచుకోవాలి. భావనే రాష్ డ్రైవింగు దిశగా వెళ్ళకుండా కాపాడాలి.

పైన ఉన్న వీడియో గురించిన పూర్తీ వివరాలు లింకు నొక్కి తెలుసుకోవచ్చు

EMBRACE LIFE







3 కామెంట్‌లు:

  1. శివ గారూ !
    మంచి సందేశం. మంచి వీడియో. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. అవునండి. మన దేశంలో ఎవరూ పట్టించుకోడంలేదు కానీ ఇతర దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడానికి వీలు లేదు. డ్రైవింగ్ చేసే వ్యక్తీ మాత్రమె కాదు.. ముందు కూర్చున్న ఆ రెండో వ్యక్తీ కూడా సీట్ బెల్ట్ పెట్టుకుని తీరాలి. మన రక్షణ కోసం చేయబడిన నిబంధనలని మనమే పాటించకపోతే.. ఆనక ఏ ప్రమాదమో ముంచుకు వచ్చినపుడు చింతించడం తప్ప చేయగలిగేది ఏమీ ఉండదు.

    రిప్లయితొలగించండి
  3. రావుగారూ మరియు స్వర్ణ మల్లికా గారూ. ఇద్దరికీ నేను వ్రాసినది చూసి స్పందింఛినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.