11, ఏప్రిల్ 2010, ఆదివారం

ఇట్లు మీ విధేయుడు - ఏరి?? వెళ్ళిపోయారు

భరాగోగా మనకు తెలిసిన శ్రీ భమిడిపాటి రామగోపాలం గారు, ఈనెల (ఏప్రిల్, 2010) ఏడవ తేదీన పరమపదించారు. ఆయన "ఇట్లు మీ విధేయుడు" ఇక కనపడదు. వెళ్ళిపోయారు ఆయన, మనకొక భర్తీ చెయ్యలేని ఖాళీని వదిలేసి. ఆయన కథలలో హాస్యం ఉంటుంది. అలాగే చెప్పవలసిన విషయాన్ని ఎక్కడకు గురిగా వదలాలో ఆయనకు తెలుసు.

అందుకనే నండూరి రాంమోహన రావుగారు ఆయన గురించి "ఇట్లు మీ విధేయుడు" కథల సంపుటికి ముందుమాటలో ఇలా అన్నారు
"వెన్నెల ఎంత బాగుంటుందో వెన్నెల్లో నీడలు అంత బాగుంటాయి. ఆయన కథలు చదువుతూ ఉంటే, వెన్నెల నీడలలో కూచుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నట్లు ఉంటుంది. ఆయన కథ చెప్పటం రంజుగానూ, లబ్జుగానూ కూడా ఉంటుంది. చెప్పే పద్ధతి. ఆయన మాట లాగానే చురుగ్గానూ, కరుగ్గానూ ఉంటుంది. ఆయన వాక్యాలు ఆయన లాగానే చాలా నిష్కర్షగానూ , మొగమాటం లేకుండానూ, ఉండటానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనపడతాయి............రామగోపాలం గారి కథలు చాలా సామాన్యంగా ఉన్నట్టుగా కనిపిస్తూనే మళ్ళి మళ్ళి ఆలోచింప చేస్తాయి.....

ప్రముఖ రచయిత, రేడియో కళాకారులు, సినీ నటులు అయిన శ్రీ గొల్లపూడి మారుతీ రావుగారు, భరాగో గారికి విధంగా శ్రధ్ధాంజలి ఘటించారు:



అందరం వెళ్లిపోవాలిసిన వాళ్ళమే . కొద్దిగా ముందు-వెనుక అంతే! ఉన్నవాళ్ళం, వెళ్లిపోయినవారి జ్ఞాపకాల దొంతరలను తడుముకుంటూ , వారు చెప్పిన మాటలలో ఒకటి రెండు ఆచరించగలిగితే అంతకంటే మరొక నివాళి ఉండదు.







ఆడియో రికార్డింగు పంపిన మిత్రులు శ్రీ ప్రసాదుగారికి కృతజ్ఞతలు
***O***

6 కామెంట్‌లు:

  1. భరాగో గారి స్థానం భర్తీ చేయలేనిది.. నేనిప్పుడు ఆయన రాసిన నూటపదహార్లు అనే పుస్తకం చదువుతున్నాను

    May the departed soul rest in peace.

    -కార్తీక్

    రిప్లయితొలగించండి
  2. భరాగో గురించిన గొల్లపూడి వారు చెప్పిన సంగతులలో కొత్త విషయాలు తెలిశాయి. భరాగో పుస్తకాన్ని పాఠకులకు పరిచయం చెయ్యాలన్న కోరిక ధృఢమైంది ఈ వ్యాసం చదివాక.ఏ పుస్తకం పరిచయం చెయ్యాలన్నదే ముందున్న ప్రశ్న.
    cbrao
    Mountain View, CA

    రిప్లయితొలగించండి
  3. భరాగో గారి పుస్తకాలు పాఠకులకు సుపరిచితం. గొల్లపూడి మారుతీ రావుగారి వంటి సాటి సాహితీ వేత్తే , ఆయన శ్రధ్ధాంజలిలో "భరాగో పుస్తకాల గురించి వ్రాయలేదు, కారణం వ్రాయవలసిన అవసరం లేదు" అన్నారంటే చూడండి, భరాగో గారి సాహిత్య ప్రాచుర్యం.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శివప్రసాదుగారు,భరాగో గురించి మారుతీ రావుగారి ఆడియో చాలా బాగుంది.భరాగోలో మానవత్వపు కోణం,ఇంచుమించుగా స్టీఫెన్ హాకిన్సులాంటి భౌతిక కాయం,పరోపకార పరాయణత,చాలామంది సాహితీవేత్తల నిజజీవితాల వలె దుఃఖమయమైన సంసారాన్ని నడుపుతూ అందరికీ చిరునవ్వులు పంచటం కళ్ళు చెమ్మగిల్లేటట్లు చేసాయి.-గంటి లక్ష్మీ నరసింహ మూర్తి(బెంగుళూరు)

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.